తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Messi Goal Video: వావ్.. 75 అడుగుల దూరం నుంచి గోల్ కొట్టిన మెస్సీ.. విన్నింగ్ షాట్: వీడియో

Messi Goal Video: వావ్.. 75 అడుగుల దూరం నుంచి గోల్ కొట్టిన మెస్సీ.. విన్నింగ్ షాట్: వీడియో

22 July 2023, 14:02 IST

    • Messi Goal Video: లియోనెస్ మెస్సీ మరోసారి అద్భుత షాట్‍తో ఆశ్చర్యపరిచాడు. మ్యాచ్ చివరి నిమిషాల్లో కళ్లు చెదిరే గోల్ చేసి ఇంటర్ మియామీ జట్టును గెలిపించాడు.
గోల్ కొట్టాక మెస్సీ సంబరాలు (Photo Credit: Twitter/Inter Milan)
గోల్ కొట్టాక మెస్సీ సంబరాలు (Photo Credit: Twitter/Inter Milan)

గోల్ కొట్టాక మెస్సీ సంబరాలు (Photo Credit: Twitter/Inter Milan)

Messi Goal Video: అర్జెంటీనా ఫుట్‍బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ మరోసారి అద్భుతం చేశాడు. సూపర్ షాట్‍తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంటర్ మియామీ ఫుట్‍బాల్ క్లబ్ తరఫున బరిలోకి దిగిన తొలి మ్యాచ్‍లోనే కళ్లు చెదిరే మ్యాచ్ విన్నింగ్ గోల్ చేశాడు. చివరి క్షణాల్లో అదిరిపోయే గోల్‍తో జట్టును గెలిపించాడు. ఫ్లోరిడా వేదికగా లీగ్స్ కప్ టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‍లో ఇంటర్ మియామీ జట్టు 2-1 తేడాతో క్రజ్ అజుల్‍పై విజయం సాధించింది. 1-1తో గోల్స్ సమంగా ఉన్నప్పుడు అదనపు టైమ్ చివరి నిమిషాల్లో (94 నిమిషం) వచ్చిన ఫ్రీ కిక్‍ను గోల్‍గా మలిచాడు మెస్సీ. 25 గజాల (75 అడుగులు) దూరం నుంచి అద్భుతమైన షాట్‍తో బంతిని గోల్ పోస్టులోకి కొట్టాడు. దీంతో ఇంటర్ మియామీ విజయం సాధించింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ మ్యాచ్‍ చూసేందుకు అమెరికా టెన్నిస్ దిగ్గజం, 23 గ్రాండ్‍స్లామ్ టైటిళ్ల విజేత సెరెనా విలియమ్స్ కూడా వచ్చింది. మెస్సీ గోల్ చేశాక సెరీనా వావ్ అని అరిచింది. ఆశ్చర్యపోయింది. ఇక ఇంటర్ మియామీ జట్టు కో-ఓనర్ డేవిడ్ బెకమ్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఈ మ్యాచ్ 44న నిమిషంలో రాబర్ట్ టేలర్ గోల్ చేయడంతో ఇంటర్ మియామీ 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది. సెకండ్ హాఫ్ 65వ నిమిషంలో క్రజ్ అజుల్ ప్లేయర్ ఉరియెల్ అంటునా గోల్ బాదటంతో 1-1తో స్కోర్స్ సమమయ్యాయి. చివరి వరకు మ్యాచ్ హోరాహోరీగా సాగింది. అయితే, 94వ నిమిషంలో మెస్సీ మాయ చేశాడు. ఫ్రీ కిక్ లభించగా.. అద్భుతమైన షాట్‍తో మైమరిపించాడు. గోల్ చేసి జట్టును గెలిపించాడు.

మెస్సీ చేసిన ఈ అద్భుతమైన గోల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. మెస్సీ అద్భుతమని కొందరు.. మానవాతీతుడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా ఈ గోల్ చూసి మైమరచిపోతున్నారు.

ఇంటర్ మియామీ ఫుట్‍బాల్ క్లబ్‍తో ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నాడు లియోనెస్ మెస్సీ. ఆ జట్టు తరఫున బరిలోకి దిగిన తొలి మ్యాచ్‍లోనే అద్భుత గోల్ చేసి.. మరోసారి సత్తాచూపించాడు. ఓ ఫుట్‍బాల్ క్లబ్ తరఫున తొలి మ్యాచ్‍లోనే ఫ్రీకిక్ ద్వారా గోల్ చేసిన తొలి ప్లేయర్‌గా మెస్సీ మరో రికార్డు నెలకొల్పాడు.

తదుపరి వ్యాసం