తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Yashasvi Jaiswal Records: ముంబైపై సెంచ‌రీతో ఐపీఎల్‌లో య‌శ‌స్వి జైస్వాల్ బ్రేక్ చేసిన రికార్డులు ఇవే

Yashasvi Jaiswal Records: ముంబైపై సెంచ‌రీతో ఐపీఎల్‌లో య‌శ‌స్వి జైస్వాల్ బ్రేక్ చేసిన రికార్డులు ఇవే

01 May 2023, 10:41 IST

  • Yashasvi Jaiswal Records: ముంబై ఇండియ‌న్స్‌పై సెంచ‌రీతో అద‌ర‌గొట్టిన రాజ‌స్థాన్ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ఐపీఎల్‌లో ప‌లు రికార్డుల‌ను తిర‌గ‌రాశాడు. ఆ రికార్డులు ఏవంటే...

య‌శ‌స్వి జైస్వాల్
య‌శ‌స్వి జైస్వాల్

య‌శ‌స్వి జైస్వాల్

Yashasvi Jaiswal Records: ఆదివారం వాంఖ‌డే వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ముంబైపై సెంచ‌రీతో చెల‌రేగిన రాజ‌స్థాన్ యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ప‌లు రికార్డుల‌ను తిర‌గ‌రాశాడు. ఈ మ్యాచ్‌లో 62 బాల్స్‌లో ప‌ద‌హారు ఫోర్లు, ఎనిమిది సిక్స‌ర్ల‌తో 124 ప‌రుగులు చేశాడు జైస్వాల్‌.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

అత‌డి మెరుపు శ‌త‌కంతో రాజ‌స్థాన్ 212 ప‌రుగులు చేసింది. కానీ సూర్య‌కుమార్ యాద‌వ్‌, టిమ్ డేవిడ్ మెరుపుల‌తో రాజ‌స్థాన్ ఈ మ్యాచ్‌లో ఓట‌మి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో సెంచ‌రీతో య‌శ‌స్వి జైస్వాల్ ఐపీఎల్‌లో ప‌లు రికార్డుల‌ను బ్రేక్ చేశాడు. ఆ రికార్డులు ఏవంటే...

ఐపీఎల్‌లో సెంచ‌రీ చేసిన నాలుగో అతి పిన్న‌వ‌య‌స్కుడిగా య‌శ‌స్వి జైస్వాల్ నిలిచాడు. ఈ జాబితాలో మ‌నీష్ పాండే (19 సంవ‌త్స‌రాలు 253 రోజులు), రిష‌బ్ పంత్ (20 సంవ‌త్స‌రాల 218 రోజులు), దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ (20 సంవ‌త్స‌రాల 289 రోజుల‌) టాప్ త్రీ ప్లేస్‌లో ఉన్నారు. వారి త‌ర్వాతి స్థానంలో జైస్వాల్ నిలిచాడు.

ఐపీఎల్ లీగ్‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు చేసిన అన్‌క్యాప్‌డ్ ప్లేయ‌ర్‌గా య‌శ‌స్వి జైస్వాల్ నిలిచాడు. అంతే కాకుండా ఈ లీగ్‌లో సెంచ‌రీ చేసి ఐదో అన్‌క్యాప్‌డ్ ప్లేయ‌ర్‌గా రికార్డ్ నెల‌కొల్పాడు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు చేసిన ప్లేయ‌ర్‌గా జైస్వాల్ చ‌రిత్ర‌ను సృష్టించాడు. అంతే కాకుండా ఐపీఎల్ లీగ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌ఫున‌ అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు కూడా జైస్వాల్‌దే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ జాబితాలో జోస్ బ‌ట్ల‌ర్ 124 ప‌రుగుల‌తో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. అతి త‌క్కువ బాల్స్‌లోనే సెంచ‌రీ చేసి అత‌డి రికార్డ్‌ను జైస్వాల్ తిర‌గ‌రాశాడు.

తదుపరి వ్యాసం