తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ravi Shastri Slams Riyan Parag: 8 బంతుల్లో 4 పరుగులే చేశాడు.. రియాన్ ప్రదర్శనపై ఫైర్ అయిన రవిశాస్త్రీ

Ravi shastri Slams Riyan Parag: 8 బంతుల్లో 4 పరుగులే చేశాడు.. రియాన్ ప్రదర్శనపై ఫైర్ అయిన రవిశాస్త్రీ

20 April 2023, 12:52 IST

    • Ravi shastri Slams Riyan Parag: రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్‌పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రీ విమర్శల వర్షం కురిపించారు. అతడు కేవలం 8 బంతుల్లో 4 పరుగులే చేశాడని స్పష్టం చేశారు.
రియాన్ పరాగ్
రియాన్ పరాగ్ (AFP)

రియాన్ పరాగ్

Ravi shastri Slams Riyan Parag: ఐపీఎల్ 2023లో నిలకడగా రాణిస్తున్న జట్టు ఏదైనా ఉందంటే అది రాజస్థాన్ రాయల్సే. ఆడిన 6 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. బుధవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లోనూ రాజస్థాన్ విజయం సాధించింది. జాస్ బట్లర్, సంజూ శాంసన్, హిట్మైర్ లాంటి ఆటగాళ్లు అద్బుతంగా రాణిస్తున్నారు. ఇదే సమయంలొ కొంతమంది మాత్రం స్థాయికి తగిన ప్రదర్శన చేయట్లేదు. వారిలో రియాన్ పరగా ముఖ్యడు. ఈ సీజన్‌లో అతడు ఏ మాత్రం ప్రభావం చూపకపోవడంతో నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రీ సైతం రియాన్ పరాగ్‌పై విమర్శలు గుప్పించారు. లక్నోతో మ్యాచ్ అతడు మొదటి 8 బంతుల్లో 4 పరుగులే చేశాడని దుయ్యబట్టారు. మొత్తంగా 12 బంతుల్లో 15 పరుగులు చేశాడని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

R Praggnanandhaa: వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్‌కు షాకిచ్చిన భార‌త గ్రాండ్‌మాస్ట‌ర్ ప్ర‌జ్ఞానంద - నార్వే టోర్న‌మెంట్‌లో సంచ‌ల‌నం

Rafael Nadal: 14సార్లు ఛాంపియన్.. తొలి రౌండ్‌లోనే ఓడిపోాయాడు.. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నదాల్ ఔట్

French Open 2024: ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లోనే రఫేల్ నదాల్‌కు గట్టి ప్రత్యర్థి.. ఛాంపియన్ ప్లేయర్‌కు సవాలే

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

లక్నోతో మ్యాచ్‌లో రాజస్థాన్ సంజూశాంసన్, బట్లర్, యశస్వి జైస్వాల్ లాంటి ఆటగాళ్లను కోల్పోయింది. కానీ వారికి ఇంకా గెలిచే ఛాన్స్ ఉంది. రియాన్ పరాగ్ ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే రాజస్థాన్ మ్యాచ్‌ ఓటమి దిశగా ప్రయాణించింది. రియాన్ పరాగ్ తొలి 8 బంతుల్లో 4 పరుగులే చేశాడు. అతడు అంతా నిదానంగా ఆడాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న దేవ్‌దత్ పడిక్కల్ కూడా తన రిథమ్‌ను కోల్పోయాడు. అని రవిశాస్త్రీ తన కామెంటరీ సమయంలో తెలిపారు.

"సింగిల్స్ రావడం ఎక్కువైంది. అలా దాదాపు 28 బంతుల పాటు ఎలాంటి బౌండరీ లేకుండా సమయం వృథా చేశారు. ఆ సమయంలో ఇబ్బంది తలెత్తుతుంది." అని రవిశాస్త్రీ స్పష్టం చేశారు. ఇదే విషయంలో ఇంగ్లాండ్ మాజీ కెవిన్ పీటర్సన్ కూడా స్పందించారు.

"రాజస్థాన్ రాయల్స్ ఏం చేస్తున్నారో వారికి తెలిసే ఉంటుందనుకుంటా. అదృష్టవశాత్తూ వారు టేబుల్ టాప్‌లో ఉన్నారు. ఈ ఓటమి వల్ల నేర్చుకునే అవకాశముంది. బ్యాటింగ్ యూనిట్‌లో చాలా మార్పులు చేయాలని తెలుసుకుంటారు. రియాన్ పరాగ్ ఇచ్చిన బాధ్యతను అతడు ఎలా నిర్వర్తించారో వారు తెలుసుకుని ఉంటారు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది." అని పీటర్సన్ అన్నారు.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై లక్నో 10 పరుగుల తేడాతో నెగ్గింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 144 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(44), జాస్ బట్లర్(40) కొంతమేర రాణించినప్పటికీ.. కెప్టెన్ సంజూ శాంసన్(2) సహా మిగిలిన వారు పెద్దగా రాణించకపోవడంతో రాజస్థాన్ ఓటమి పాలైంది. లక్నో బౌలర్లలో ఆవేష్ ఖాన్ 3, మార్కస్ స్టోయినీస్ 2 వికెట్లు పడగొట్టాడు.

తదుపరి వ్యాసం