తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kkr Vs Gt: గుర్భాజ్‌, ర‌సెల్ సిక్స‌ర్ల‌ సునామీ - గుజ‌రాత్ టార్గెట్ 180

KKR vs GT: గుర్భాజ్‌, ర‌సెల్ సిక్స‌ర్ల‌ సునామీ - గుజ‌రాత్ టార్గెట్ 180

29 April 2023, 18:27 IST

  • KKR vs GT: ఓపెన‌ర్ ర‌హ్మ‌నుల్లా గుర్భాజ్ హాఫ్ సెంచ‌రీతో రాణించ‌డంతో గుజ‌రాత్‌తో జ‌రుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌క‌తా ఇర‌వై ఓవ‌ర్ల‌లో 179 ప‌రుగులు చేసింది. గుర్భాజ్‌తో పాటు ర‌సెల్ బ్యాటింగ్‌లో మెరిశాడు.

ర‌సెల్
ర‌సెల్

ర‌సెల్

KKR vs GT: ఆరంభంలో ర‌హ్మ‌నుల్లా గుర్భాజ్ దంచికొడితే చివ‌ర‌లో ర‌సెల్ ఫినిషింగ్ ట‌చ్ ఇవ్వ‌డంతో గుజ‌రాత్ ముందు కోల్‌క‌తా 180 ప‌రుగుల టార్గెట్‌ను విధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రుగుతోన్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేప‌ట్టిన కోల్‌క‌తా ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు న‌ష్ట‌పోయి 179 ప‌రుగులు చేసింది. కోల్‌క‌తా ఓపెన‌ర్ ర‌హ్మ‌నుల్లా గుర్భాజ్ హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

39 బాల్స్‌లోనే ఏడు సిక్స‌ర్లు, ఐదు ఫోర్ల‌తో 81 ర‌న్స్ చేశాడు. అత‌డి సిక్స‌ర్ల వ‌ర్షంతో కోల్‌క‌తా ఐదు ఓవ‌ర్ల‌లోనే యాభై ప‌రుగులు దాటింది. గుర్భాజ్ ధాటిగా ఆడినా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ నుంచి స‌రైన స‌హ‌కారం లేక‌పోవ‌డంతో కోల్‌క‌తా స్కోరు వేగం మంద‌గించింది. శార్దూల్ ఠాకూర్ డ‌కౌట్ కాగా, కెప్టెన్ నితీష్ రానా 4 ర‌న్స్‌, వెంక‌టేష్ అయ్య‌ర్ 14 ర‌న్స్‌తో నిరాశ‌ప‌రిచారు.

చివ‌ర‌లో ఆంద్రీ ర‌సెల్ బ్యాట్ ఝులిపించ‌డంతో కోల్‌క‌తా 170 ప‌రుగులు దాటింది. 19 బాల్స్‌లోమూడు సిక్స‌ర్లు, రెండు ఫోర్ల‌తో ర‌సెల్ 34 ర‌న్స్ చేశాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ష‌మీ మూడు వికెట్లు, లిటిల్‌, నూర్ అహ్మ‌ద్ త‌లో రెండు వికెట్లు తీసుకున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం