తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs Pakistan: పాకిస్థాన్‍ను చిత్తుగా ఓడించిన భారత్.. మెరిసిన కెప్టెన్

India vs Pakistan: పాకిస్థాన్‍ను చిత్తుగా ఓడించిన భారత్.. మెరిసిన కెప్టెన్

09 August 2023, 22:46 IST

    • India vs Pakistan: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో పాకిస్థాన్‍ను టీమిండియా చిత్తుగా ఓడించింది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండో గోల్స్ చేశాడు.
భారత హాకీ జట్టు
భారత హాకీ జట్టు (PTI)

భారత హాకీ జట్టు

Asian Champions Trophy 2023 - India vs Pakistan: భారత హాకీ జట్టు మరోసారి అదరగొట్టింది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‍ను టీమిండియా చిత్తు చేసింది. నేడు (ఆగస్టు 9) చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ హాకీ స్టేడియంలో జరిగిన గ్రూప్ స్టేజ్ ఆఖరి మ్యాచ్‍లో టీమిండియా 4-0 తేడాతో పాకిస్థాన్‍ను ఓడించింది. ఇప్పటికే సెమీ ఫైనల్‍కు అర్హత సాధించిన భారత్.. ఈ విజయంతో మరింత ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది. లీగ్ స్టేజ్ పాయింట్ల పట్టికలో టాప్‍లో నిలిచింది. ఇండియా చేతిలో ఓడిన పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత కెప్టెన్ హర్మన్‍ప్రీత్ సింగ్ (15వ నిమిషం, 23వ నిమిషం) రెండు గోల్స్ చేసి అదరగొట్టాడు. జుగ్‍రాజ్ సింగ్ (36వ నిమిషం), అక్షదీప్ సింగ్ (55వ నిమిషం) చెరో గోల్ బాదారు. దీంతో టీమిండియా 4-0 తేడాతో పాక్‍పై ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఎలా సాగిందంటే..

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ మ్యాచ్‍లో ఆరంభం నుంచి పాకిస్థాన్‍పై భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. మ్యాచ్ 15వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను భారత్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ గోల్‍గా మలిచాడు. పాక్ గోల్ కీపర్ అక్మల్ హుసేన్‍కు ఎమడ వైపుగా బాది బంతిని గోల్ పోస్టులోకి పంపాడు. దీంతో టీమిండియా ఖాతా తెరిచింది. 23వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను కూడా గోల్ చేశాడు హర్మన్. ఈసారి పాక్ గోల్ కీపర్ కాళ్ల మధ్యలో నుంచి బంతిని పంపాడు. దీంతో పాకిస్థాన్ పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలో ఆడింది. ఏ మాత్రం కోలుకోలేకపోయింది. దీంతో హాఫ్ టైమ్ నాటికి ఇండియా 2-0 ఆధిక్యంతో నిలిచింది.

రెండో అర్ధభాగంలోనూ భారత్ పూర్తిగా దూకుడు చూపింది. 36వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను గోల్ చేశాడు భారత ప్లేయర్ జుగ్‍రాజ్ సింగ్. 43వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను పాక్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. 55వ నిమిషంలో అక్షదీప్ సింగ్ గోల్ చేయడంతో భారత్ 4-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొత్తంగా ఈ మ్యాచ్‍లో పాకిస్థాన్‍ను చిత్తుగా ఓడించింది. ఆత్మ విశ్వాసంతో ఆసియా చాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‍లో తలపడనుంది.

తదుపరి వ్యాసం