తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  England Vs India: సిరీస్‌పై కన్నేసిన ఇరు జట్లు.. వాతావరణం అనుకూలిస్తుందా?

England vs India: సిరీస్‌పై కన్నేసిన ఇరు జట్లు.. వాతావరణం అనుకూలిస్తుందా?

16 July 2022, 21:37 IST

    • మాంచెస్టర్ ట్రాఫోర్ట్ క్రికెట్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో భారత్ నిర్ణయాత్మక మూడో వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇరుజట్లు ఆశపడుతున్నాయి. అయితే వాతావరణం మేఘావృతమై ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రాక్టీస్ లో ఆటగాళ్లు
ప్రాక్టీస్ లో ఆటగాళ్లు (Action Images via Reuters)

ప్రాక్టీస్ లో ఆటగాళ్లు

ఇంగ్లాండ్‌-భారత్‌ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఇరజట్లు 1-1 తేడాతో సమంగా ఉన్నాయి. తొలి వన్డేలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. రెండో వన్డేలో భారత్‌పై 100 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టు గెలిచింది. ఇక నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం నాడు మాంచెస్టర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇరజట్లు ఆశపడుతున్నాయి. అయితే మూడో వన్డేకు వాతావరణం కలిసొచ్చేలా లేదు ఎందుకంటే మాంచెస్టర్ ట్రాఫోర్డ్ వద్ద ఆధివారం మేఘావృతమై ఉంటుందని వాతావరణం కేంద్ర హెచ్చరికలు జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

వన్డే సిరీస్‌ను డిసైడ్ చేసే ఈ మ్యాచ్‌‌లో వాతావరణం మేఘావృతమైంది. ఈ కారణంగా ఇరుజట్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే 50 ఓవర్ల పోరులో వర్షం కురిసే అవకాశం లేదని తెలుస్తోంది. చాలా వరకు పూర్తి మ్యాచ్‌ను ఆశించవచ్చు. ఈ రోజు ఉష్ణోగ్రత 18 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. గాలి వేగం గంటకు 14 నుంచి 16 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే మ్యాచ్‌ పూర్తిగా జరిగే అవకాశముందని నిపుణులు అంటున్నారు.

నిర్ణాయత్మక మూడో వన్డేలో భారత్ తన వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంది. రోహిత్ శర్మ నిదానంగా ఆడేది సమస్య కాదు. అతడు నిలకడగా క్రీజులో నిలబడాల్సి ఉంది. ఇంక 37 ఏళ్ల శిఖర్ ధావన్ 2023 ప్రపంచకప్ ఆడించాల్సి వస్తే.. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని టీమిండియా మేనేజ్మెంట్ కొన్ని సొంత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలు సమస్యలను మరింత ఎక్కువగా చేస్తున్నాయి. ఇది కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. గత మ్యాచ్‌లో ఓపెనర్లు తొలి రెండు ఓవర్లను మెయిడేన్ చేయడం పరిస్థితిని సానుకూలంగా సూచించడం లేదు. వన్డే ప్రపంచకప్‌నకు ఇంకా 15 నెలల సమయమే ఉన్న నేపథ్యంలో టాపార్డర్ బ్యాటర్లలో నిలకడలేమి ఆందోళన కలిగిస్తోంది.

రోహిత్, ధావన్, కోహ్లీ ముగ్గురు 1,2,3 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి జట్టును ముందుకు తీసుకెళ్తారా లేదా అనే అంశాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంది. మిడిలార్డర్‌ శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, పంత్‌తో కాస్త మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ.. వీరిలో నిలకడలేమి ప్రధాన సమస్యగా మారింది. బౌలర్ల విషయానికొస్తే బుమ్రా, షమీ బాగా రాణిస్తున్నారు. స్పిన్నర్ చాహల్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. వీరు కాకుండా మిగిలిన యువ బౌలర్లలో అనుభవలేమి సమస్యగా మారింది.

మరోపక్క ఇంగ్లాండ్ జట్టు గత మ్యాచ్‌లో విజయంతో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. జేసన్ రాయ్, రూట్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ లాంటి ఆటగాళ్లతో బలంగా కనిపిస్తోంది. అయితే వీరు గత రెండు వన్డేల్లో పెద్దగా ప్రదర్శన చేసింది లేదు. బౌలర్ల విషయానికొస్తే రెండో వన్డేలో రీస్ టోప్లే 6 వికెట్లతో విజృంభించాడు. అతడితో భారత బ్యాటర్లు ఎలా ఆడతారనేది చూడాలి. డేవిడ్ విల్లే, బ్రైడన్ కార్సే అతడికి చక్కగా సహకరించారు. స్వదేశంలో మ్యాచ్ జరగడం ఇంగ్లీష్ జట్టుకు కలిసొచ్చే అంశం.

జట్ల అంచనా..

ఇంగ్లాండ్..

జాస్ బట్లర్(కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్ స్టో, బ్రైడన్ కార్సే, సామ్ కరన్, లియామ్ లివింగ్ స్టోన్, క్రేగ్ ఓవర్టన్, జోయ్ రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లే.

భారత్..

రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, చాహల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ షమీ.

తదుపరి వ్యాసం