తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  England Vs India: వన్డే సిరీస్‌పై కన్నేసిన భారత్.. ప్రతీకారం కోసం ఇంగ్లాండ్

England vs India: వన్డే సిరీస్‌పై కన్నేసిన భారత్.. ప్రతీకారం కోసం ఇంగ్లాండ్

12 July 2022, 13:01 IST

    • లండన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడనుంది భారత్. టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ పునరాగమనం చేయనున్నాడు.
రోహిత్-కోహ్లీ
రోహిత్-కోహ్లీ (Twitter)

రోహిత్-కోహ్లీ

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు రీషెడ్యూల్‌ టెస్టు పరాభవం ఎదురైనప్పటికీ ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2 తేడాతో సమం చేసింది. అనంతరం మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో సిరీస్ కైవసం కైవసం చేసుకుంది. ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది టీమిండియా. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ మంగళవారం నాడు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రోహిత్ సేన సిరీస్‌ను కైవసం చేసుకుని విజయంతో పర్యటనను ముగించాలని ఆశపడుతోంది. మరోపక్క టెస్టు సిరీస్ డ్రా కావడం, టీ20లు సిరీస్ కోల్పోవడంతో కనీసం వన్డేల్లోనైనా సత్తా చాటాలని ఇంగ్లాండ్ తహతహ లాడుతోంది. సాయంత్రం 5.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ధావన్ పునరాగమనం..

ఇండియన్ టాపార్డర్ దగ్గరకొస్తే.. చాలా రోజుల తర్వాత ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టులోకి వస్తున్నాడు. అతడు రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. అయితే రోహిత్, విరాట్ కోహ్లీ ఫామ్ కలవరపరుస్తోంది. వీరిద్దరూ గత టీ20 మ్యాచ్‌ల్లో విఫలమయ్యారు. అయితే యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో పొట్టి సిరీస్ 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ప్రస్తుతం అందరి కళ్లు విరాట్‌పైనే ఉన్నాయి. గత మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన కోహ్లీ.. తొలి వన్డేకు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. గజ్జల్లో గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండకబోవచ్చు. ఒకవేళ అతడు దూరమైతే.. విరాట్ స్థానంలో సూర్య కుమార్ యాదవ్ వస్తాడు. శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో వచ్చే అవకాశముంది.

మిడిలార్డర్‌లో పంత్, హార్దిక్ పాండ్య ఆ బాధ్యతను నెరవేర్చే అవకాశముంది. బౌలింగ్ విషయానికొస్తే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, సిరాజ్ లేదా ప్రసిధ్ కృష్ణ బాధ్యత వహించనున్నారు. స్పిన్నర్లలో చాహల్, జడేజా ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ పేరు వన్డేలకు సూచించలేదు.

ప్రతీకారంతో ఇంగ్లాండ్..

మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో ఓడిపోయిన ఇంగ్లాండ్.. వన్డే సిరీస్‌పై కన్నేసింది. బెయిర్‌స్టో, రూట్, జోయ్ రూట్ లాంటి అనుభవజ్ఞల లేమితో టీ20ల్లో పరాభవాన్ని ఎదుర్కొన్న ఇంగ్లీష్ జట్టు.. వన్డే సిరీస్‌లో వారి రాకతో ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇయాన్ మోర్గాన్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన బట్లర్.. ఆడిన తొలి సిరీస్‌నే పరాజయం మూటగట్టుకోవడంతో వన్డేలపై దృష్టి సారించాడు. బౌలింగ్ విషయానికొస్తే డేవిడ్ విల్లే, రీస్ టోప్లేలకు బ్రైడన్ కార్స్ తోడయ్యాడు. ఆకరి టీ20లో గెలుపుతో క్లీన్ స్వీప్‌ను తప్పించుకున్న ఇప్పుడు అదే ఉత్సాహంతో మొదటి వన్డే నుంచి టీమిండియాను ఓడించాలని లక్ష్యంగా ఉంది. ఇంగ్లాండ్ పిచ్ పేసలకు అనుకూలించేవి. ఓవల్ మైదానంలో కూడా అలాగే ఉంటుంది. టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశముంది.

జట్ల అంచనా..

భారత్..

రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, జడేజా, జస్ప్రీత్ బుమ్రా, షమీ, ప్రసిధ్ కృష్ణ, చాహల్.

ఇంగ్లాండ్..

జాస్ బట్లర్(కెప్టెన్), జేసన్ రాయ్, సాల్డ్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, లివింగ్ స్టోన్, విల్లే, కార్స్, రీస్ టోప్లే, సామ్ కరన్

తదుపరి వ్యాసం