తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Nz 2nd T20: రెండో టీ20లో న్యూజిలాండ్‌పై టీమ్ ఇండియా ఘ‌న విజ‌యం

IND vs NZ 2nd T20: రెండో టీ20లో న్యూజిలాండ్‌పై టీమ్ ఇండియా ఘ‌న విజ‌యం

20 November 2022, 16:11 IST

  • IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా 65 ప‌రుగులు తేడాతో ఘ‌న‌ విజ‌యాన్ని సాధించింది. టీమ్ ఇండియా ప్లేయ‌ర్ల‌లో బ్యాటింగ్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌, బౌలింగ్‌లో దీప‌క్ హుడా రాణించారు.

సూర్య‌కుమార్ యాద‌వ్‌
సూర్య‌కుమార్ యాద‌వ్‌

సూర్య‌కుమార్ యాద‌వ్‌

IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌తో ఆదివారం జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా 65 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని సాధించింది. టీమ్ ఇండియా విధించిన 192 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించ‌డంలో విఫ‌ల‌మైన న్యూజిలాండ్ 18.5 ఓవ‌ర్ల‌లో 126 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 191 ర‌న్స్ చేసింది. సూర్య‌కుమార్ యాద‌వ్ సెంచ‌రీ చేశాడు. 51 బాల్స్‌లో ఏడు సిక్స‌ర్లు, ప‌ద‌కొండు ఫోర్ల‌తో 111 ర‌న్స్ చేసిన సూర్య‌కుమార్ నాటౌట్‌గా మిగిలాడు.

192 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలో దిగిన న్యూజిలాండ్‌కు రెండో బాల్‌కే అలెన్‌ను ఔట్ చేసి షాక్ ఇచ్చాడు భువ‌నేశ్వ‌ర్‌. కాన్వే, కెప్టెన్ విలియ‌మ్స‌న్ వికెట్టు ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఆడారు. కానీ వేగంగా ఆడ‌క‌పోవ‌డంతో న్యూజిలాండ్ సాధించాల్సిన ర‌న్‌రేట్ పెరుగుతూ వచ్చింది. 22 బాల్స్‌లో 25 ప‌రుగులు చేసి కాన్వే పెవిలియ‌న్ చేరాడు. ఫిలిప్స్ 12, మిచెల్ 10 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యారు.

టీమ్ ఇండియా బౌల‌ర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయ‌డంతో న్యూజిలాండ్ వ‌రుస‌గా వికెట్ల‌ను కోల్పోయింది. ఓ వైపు వికెట్లు ప‌డుతోన్న కెప్టెన్ విలియ‌మ్స‌న్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. సిరాజ్ బౌలింగ్‌లో సిక్స్‌తో హాఫ్ సెంచ‌రీ పూర్తిచేసుకున్నాడు. 52 బాల్స్‌లో రెండు సిక్స‌ర్లు, 4 ఫోర్ల‌తో 61 ర‌న్స్ చేసి టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

టీమ్ ఇండియా బౌల‌ర్ల‌లో దీప‌క్ హుడా నాలుగు వికెట్లు, సిరాజ్‌, చాహ‌ల్ త‌లో రెండు వికెట్లు తీశారు. భునేశ్వ‌ర్‌, సుంద‌ర్‌కు ఒక్కో వికెట్ ద‌క్కింది.

తదుపరి వ్యాసం