తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs Zimbabwe T20 World Cup: జింబాబ్వేపై ఇండియా ఘ‌న విజ‌యం - టాప్ ప్లేస్‌కు చేరుకున్న రోహిత్ సేన‌

India vs Zimbabwe T20 world cup: జింబాబ్వేపై ఇండియా ఘ‌న విజ‌యం - టాప్ ప్లేస్‌కు చేరుకున్న రోహిత్ సేన‌

06 November 2022, 17:04 IST

  • India vs Zimbabwe T20 world cup: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సూప‌ర్ 12 రౌండ్ చివ‌రి మ్యాచ్‌లో జింబాబ్వేపై టీమ్ ఇండియా 71 ప‌రుగులు తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. బ్యాటింగ్‌లో రాహుల్, సూర్య కుమార్ యాద‌వ్‌, బౌలింగ్‌లో అశ్విన్, ష‌మీ, పాండ్య రాణించ‌డంతో ఇండియా అలవోకగా విజ‌యాన్ని అందుకొంది.

అశ్విన్
అశ్విన్

అశ్విన్

India vs Zimbabwe T20 world cup: ఆదివారం జింబాబ్వేతో జ‌రిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా 71 ప‌రుగుల‌ తేడాతో విజ‌యాన్ని సాధించింది. ఈ గెలుపుతో ఏడు పాయింట్ల‌తో టీమ్ ఇండియా గ్రూప్ 2లో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

సూర్య కుమార్ 61 ప‌రుగులు, రాహుల్ 51 ర‌న్స్‌తో రాణించారు. 187 ప‌రుగుల టార్గెట్‌తో సెకండ్ బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 17.2 ఓవ‌ర్ల‌లో 115 ర‌న్స్‌కు ఆలౌట్ అయ్యింది. భారీ టార్గెట్‌తో బ‌రిలో దిగిన జింబాబ్వేను ఆరంభంలోనే భువ‌నేశ్వ‌ర్‌, అర్ష‌దీప్ దెబ్బ‌కొట్టారు. మెద్వేర్‌, చ‌బాకా ప‌రుగులు ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ చేరారు.

సీన్ విలియ‌మ్స‌న్‌, ఇర్విన్ కూడా త‌క్కువ ప‌రుగుల‌కే ఔట్ కావ‌డంతో 31 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి జింబాబ్వే క‌ష్టాల్లో ప‌డింది. సికింద‌ర్ ర‌జా 34 ర‌న్స్‌, ర‌యాన్ బ‌ర్ల్ 35 ర‌న్స్ చేయ‌డంతో జింబాబ్వే వంద ప‌రుగులు దాటింది. వారిద్దరూ ఔట్ కావడంతో మిగిలిన వికెట్లను త్వరలో కోల్పోయింది జింబాబ్వే.

ఇండియా బౌల‌ర్ల‌లో అశ్విన్ మూడు వికెట్లు, పాండ్య‌, ష‌మీ త‌లో రెండు వికెట్లు తీసుకున్నారు. భువనేశ్వర్, అర్షదీప్, అక్షర్ పటేల్‌కు ఒక్కో వికెట్ ద‌క్కింది..

తదుపరి వ్యాసం