తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wasim Jaffer On Players : కోహ్లీనే కాదు.. రోహిత్ శర్మ, మహమ్మద్ సిరాజ్, షమీ రంజీ ఆడితే బెటర్

Wasim Jaffer On Players : కోహ్లీనే కాదు.. రోహిత్ శర్మ, మహమ్మద్ సిరాజ్, షమీ రంజీ ఆడితే బెటర్

Anand Sai HT Telugu

22 January 2023, 12:45 IST

    • IND Vs AUS : న్యూజిలాండ్ తో రెండో వన్డేలో సూపర్ విక్టరీ నమోదు చేసింది టీమిండియా. మూడు వన్డేల సిరీస్ లో రెండు మ్యాచులు గెలిచి.. సిరీస్ సొంతం చేసుకుంది. ఇక మూడో వన్డే జరగాల్సి ఉంది. అయితే సీనియర్ ఆటగాళ్లకు కొంతమంది మాజీలు సలహాలు ఇస్తున్నారు.
విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (AP)

విరాట్ కోహ్లీ

న్యూజిలాండ్(New Zealand) మీద వరుసగా రెండు వన్డేలు గెలిచింది టీమిండియా. మూడు వన్డేల సిరీస్ ఖాతాలో వేసుకుంది. ఈ కారణంగా మూడో వన్డేకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఈ మ్యాచ్ నుంచి స్టార్ ఆటగాళ్లు తప్పుకోవాలని మాజీలు సూచనలు చేస్తున్నారు. అయితే తాజాగా మాజీ లెజెండ్ వసీం జాఫర్(Vasim Jaffer) కూడా ఇదే చెబుతున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

కేవలం కోహ్లీ(Kohli) మాత్రమే కాదు.. రోహిత్ శర్మ(Rohit Sharma), మహమ్మద్ సిరాజ్, షమీ తదితరులు కూడా ఇదే పని చేయాలని మాజీ లెజెండ్ వసీం జాఫర్ అన్నాడు. న్యూజిలాండ్ సిరీస్ ఎలాగూ మన ఖాతాలో పడిపోయింది. మూడో వన్డేలో గెలిచినా.. గెలవకపోయినా సమస్య లేదు. ఇక ఆస్ట్రేలియా(Australia)తో కీలకమైన టెస్టు సిరీస్ ఉంది. దీనికోసం సన్నాహకాలు మెుదలుపెట్టాలని జాఫర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

రంజీ ట్రోఫీ(Ranji Trophy) తదుపరి రౌండ్ మంగళవారం ప్రారంభం కానుంది. కివీస్ తో భారత జట్టు మూడో వన్డే కూడా అదే రోజున ఉండనుంది. అయితే వసీం జాఫర్ అదే విషయాన్ని చెబుతున్నాడు. టీమిండియా కీలక ఆటగాళ్లు వన్డే నుంచి తప్పుకొని రంజీ ట్రోఫీ ఆడాలని సూచించాడు.

భారత స్టార్ ప్లేయర్స్.. టెస్టు మ్యాచులు(Test Matches) ఆడి చాలా రోజులైంది. కేఎల్ రాహుల్(KL Rahul), విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇద్దరూ బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడారు. కానీ అంతగా రాణించలేదు. రోహిత్ శర్మ గతేడాది మార్చిలో టెస్టు ఆడాడు. ఆ తర్వాత మళ్లీ టెస్టులు ఆడలేదు. ఇలాంటివి అంచనా వేసుకుని.. ఆటగాళ్లు ఆస్ట్రేలియాతో జరిగే మెుదటి టెస్టుకు సిద్ధంగా ఉండాలని జాఫర్ చెప్పుకొచ్చాడు. రంజీలు ఆడితే.. అది సాధ్యమని తెలిపాడు.

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్(World Test Championship) ఫైనల్ కు చేరాలంటే... ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ ఇండియాకు కీలకం. ఈ సిరీస్ గెలిచి తీరాలి. టెస్టుల్లో మెుదటి ప్లేసులోకి వెళ్లాలంటే.. ఇది గెలవడం ముఖ్యం. అందుకే భారత ఆటగాళ్లు ఈ సిరీస్ మీద ఫోకస్ చేయాలని వసీం తెలిపాడు. కేఎస్ భరత్ ను సైతం రంజీలకు పంపితే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మూడో వన్డేలో లేడు.. కాబట్టి.. టెస్టు సిరీస్ కు సిద్ధం చేయాలన్నాడు.

తదుపరి వ్యాసం