తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Pak: పాకిస్తాన్‌పై ఇండియా గెలుపు.. గేమ్ ఎలా సాగిందంటే?

IND vs PAK: పాకిస్తాన్‌పై ఇండియా గెలుపు.. గేమ్ ఎలా సాగిందంటే?

Sanjiv Kumar HT Telugu

03 September 2023, 12:18 IST

  • Hockey5s Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా నీరుగారిపోయింది. ఇరు దేశాలు చెరో పాయింట్‍తో సరిపెట్టుకున్నాయి. కానీ, హాకీలో మాత్రం పాకిస్తాన్‍పై తిరుగులేని విజయం సాధించారు భారత ఆటగాళ్లు. ఆసియా కప్ 2023 హాకీ ఫైవ్స్ మెన్స్ ఆట ఎలా సాగిందంటే..

పాకిస్తాన్‌పై ఇండియా గెలుపు
పాకిస్తాన్‌పై ఇండియా గెలుపు

పాకిస్తాన్‌పై ఇండియా గెలుపు

ఎన్నో అంచనాలతో సెప్టెంబర్ 2న పల్లెకెలె వేదికగా ప్రారంభమైన ఆసియా 2023 ఇండియా-పాకిస్తాన్ వన్డే క్రికెట్ మ్యాచ్ అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ప్రత్యర్థ దేశంపై తమ బ్యాటింగ్‍తో విరుచుకుపడతారని ఆశించిన ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. కానీ, అదే రోజున ఓమన్‍లోని సలాలా వేదికగా జరిగిన ఆసియా కప్ 2023 హాకీ ఫైవ్స్ మెన్స్ గేమ్ మాత్రం రసవత్తరంగా సాగింది. దాయాదులపై తిరుగులేని వజయాన్ని నమోదు చేశారు భారత ఆటగాళ్లు. క్రికెట్ తరహాలోనే అభిమానులను ఉత్కంఠకు గురి చేసిన హాకీ ఆటలో పాకిస్తాన్‍ను 2-0 తేడాతో భారత్ ఓడించింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఆధిక్యం వైపు

ఆసియా కప్ ఫైవ్స్ హాకీ టోర్నమెంట్‍లో నిర్ణీత సమయంలో భారత్, పాకిస్తాన్ జట్లు 4-4 పాయింట్లతో నిలిచాయి. గేమ్ స్టార్ట్ అయిన 5వ నిమిషంలోనే పాకిస్తాన్ ప్లేయర్ అబ్ధుల్ రెహమాన్ గోల్ కొట్టి తమ దేశానికి ఖాతా తెరిచాడు. అయితే వెంటనే వేగం పుంజుకున్న భారత్ కూడా బాగా రాణించింది. ఏడో నిమిషంలో జుగరాజ్, పదో నిమిషంలో మణిందర్ సింగ్ గోల్స్ చేసి ఇండియాను ఆధిక్యం వైపు నడిపించారు. దీంతో 2-1తో భారత్ ఆధిక్యంలోకి వచ్చింది. తర్వాత పాకిస్తాన్ కూడా మూడు గోల్స్ చేసి ముందంజలోకి వెళ్లింది.

గోల్ చేయలేక

పాకిస్తాన్ జట్టు నుంచి 13వ నిమిషంలో అబ్ధుల్, పద్నాలుగో నిమిషంలో హయత్, 19వ నిమిషంలో హర్షద్‍లు వరుసగా గోల్స్ కొట్టి ఆశ్చర్యపరిచారు. దీంతో పాకిస్తాన్ 4-2 ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే పాకిస్తాన్ దాటికి గట్టిగా ఎదురు నిలబడిన ఇండియా ధీటుగా బదులిచ్చింది. భారత్ ప్లేయర్ రహీల్ 19, 26వ నిమిషంలో గోల్ కొట్టడంతో ఇండయా స్కోర్ 4-4తో సమమైంది. తర్వాత ఇరు జట్లు గోల్ కొట్టడంలో సక్సెస్ కాలేదు. మంచి డిఫెండ్‍తో పాక్, ఇండియా ముందుకు సాగాయి. అలాగే రెండో అర్ధ భాగంలో పాక్, ఇండియా హోరాహోరాగా తలపడినా ఏ ఒక్కరూ గోల్ చేయలేకపోయాయి.

అదిరిపోయిన షూటౌట్

హాకీ మ్యాచ్ 4-4తో సమం కావడంతో షూటౌట్ నిర్వహించారు. ఈ షూటౌట్‍లో భారత ఆటగాళ్లు గురుజ్యోత్ సింగ్, మణిందర్ సింగ్‍లు ఇద్దరూ గోల్స్ చేసి ఇండియాను ఆధిక్యంలో ఉంచారు. తర్వాత బరిలోకి దిగిన పాక్ ప్లేయర్స్ అర్షద్, ముర్తజాలు గోల్స్ కొట్టడంలో విఫలమయ్యారు. దీంతో ఆసియా కప్ 2023 మెన్స్ హాకీ మ్యాచ్‍లో పాకిస్తాన్‍పై భారత్ విజయం సాధించింది. ఇలా హాకీ ఫైనల్‍లో ఇండియా విజేతగా నిలవడంతో.. వచ్చే ఏడాది జరిగే హాకీ ఫైవ్స్ వరల్డ్ కప్‍కు అర్హత సాధించింది.

తదుపరి వ్యాసం