తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cwg 2022: కామన్వెల్త్ గేమ్స్ ఆరో రోజు భారత్ షెడ్యూల్ ఇదిగో.. చూసేయండి

CWG 2022: కామన్వెల్త్ గేమ్స్ ఆరో రోజు భారత్ షెడ్యూల్ ఇదిగో.. చూసేయండి

03 August 2022, 8:06 IST

    • కామన్వెల్త్ గేమ్స్ ఆరో రోజు కూడా భారత్ జోరు పెంచనుంది. ఈ రోజు వెయిట్ లిఫ్టింగ్‌లో మరో మూడు పతకాలు, అథ్లెటిక్స్‌లో ఒకటి, స్క్వాష్‌లో మరోకటి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు పూర్తి షెడ్యూల్ చూసేయండి.
కామన్వెల్త్ గేమ్స్ 2022
కామన్వెల్త్ గేమ్స్ 2022 (AP)

కామన్వెల్త్ గేమ్స్ 2022

బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. ఐదో రోజు భారత్ ఖాతాలో మరో నాలుగు పతకాలు వచ్చి చేరాయి. రెండు స్వర్ణాలు, రెండు రజతాలను భారత క్రీడాకారులు గెల్చుకున్నారు. భారత మహిళల ఫోర్స్ లాన్ బౌల్స్ జట్టు..సౌతాఫ్రికాపై నెగ్గి పసిడి సాధించి చారిత్రక రికార్డు సృష్టించింది. ఈ విభాగంలో భారత్ కిదే మొదటి గోల్డ్. అనంతరం టేబుల్ టెన్నిస్‌లో పురుషుల జట్టు మరో పసిడి సాధించింది. బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో మలేషియా చేతిలో ఓడి రజతం సాధించగా.. 96 కేజీల విభాగంలో వికాస్ ఠాకూర్ కూడా 346 కేజీలతో పసిడిని సాధించాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

కామన్వెల్త్ గేమ్స్ ఆరో రోజు కూడా భారత క్రీడాకారులకు పలు విభాగాల్లో పతకాలు ఊరిస్తున్నాయి. వెయిట్ లిఫ్టింగ్‌లో మరో మూడు పతకాలు, అథ్లెటిక్స్‌లో ఒకటి, స్క్వాష్‌లో మరోకటి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది కాకుండా భారత మహిళల క్రికెట్ జట్టు బార్బడోస్‌తో తలపడనుంది. పోటీల్లో వరుసగా రెండో విజయంపై కన్నేసింది. మరి ఆరో రోజు భారత తలపడనున్న క్రీడాంశాలకు సంబందించిన షెడ్యూల్ గురించి ఇప్పుడు చూద్దాం.

అథ్లెటిక్స్..

పురుషుల హైజంప్ ఫైనల్- తేజస్విన్ శంకర్(రాత్రి 11.30 గంటలకు)

మహిళల షాట్ పుట్ ఫైనల్- మన్ ప్రీత్ కౌర్(రాత్రి 12.35 గంటలకు)

బాక్సింగ్..

మహిళల 48 కేజీల క్వార్టర్ పైనల్- నీతూ గంగాస్(సాయంత్రం 4.45)

పురుషుల 57 కేజీల క్వార్టర్ ఫైనల్- హసముద్దీన్ మహ్మద్(సాయంత్రం 5.45 గంటలకు)

మహిళల 50 కేజీల క్వార్టర్ ఫైనల్- నిఖత్ జరీన్ (రాత్రి 11.15 గంటలకు)

మహిళల70 కేజీల క్వార్టర్ ఫైనల్- లవ్లీనా బోర్గోహెయిన్(రాత్రి 12.45 గంటలకు)

పురుషుల 80 కేజీల క్వార్టర్ ఫైనల్- ఆశిష్ కుమార్(రాత్రి 2 గంటలకు)

క్రికెట్..

మహిళల టీ20- భారత్-బార్బడోస్(రాత్రి 10.30 గంటలకు)

హాకీ..

మహిళల పూల్ ఏ- భారత్ - కెనడా(సాయంత్రం 3.30 గంటలకు)

పురుషుల పూల్ బీ- భారత్- కెనడా(సాయంత్రం 6.30 గంటలకు)

జూడో(మధ్యాహ్నం 2.30 నుంచి)..

మహిళల 78 కేజీల క్వార్టర్ ఫైనల్- తులికా మన్

పురుషుల 100 కేజీల ఎలిమినేషన్ 16 రౌండు- దీపక్ దేస్వాల్

లాన్ బౌల్స్..

పురుషుల సింగిల్స్- మృదుల్ బోర్గోహెయిన్(మధ్యాహ్నం 1.00 గంటలకు)

మహిళల పెయిర్- భారత్-NIUE(మధ్యాహ్నం 1.00 గంటలకు)

పురుషుల సింగిల్స్- మృదుల్ బోర్గోహెయిన్(మధ్యాహ్నం 4.00 గంటలకు)

మహిళల పెయిర్- భారత్-దక్షిణాఫ్రికా(మధ్యాహ్నం 4.00 గంటలకు)

పురుషుల ఫోర్స్- భారత్-కుక్ ఐలాండ్స్(రాత్రి 7.30 గంటలకు)

మహిళల ట్రిపుల్- భారత్-NIUE(రాత్రి 7.30 గంటలకు)

పురుషుల ఫోర్స్- భారత్-ఇంగ్లాండ్(రాత్రి 10.30 గంటలకు)

స్క్వాష్..

మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ 32- జోష్నా/హరీందర్- శ్రీలంక(3.30 గంటలకు)

పురుషుల సింగిల్స్ కాంస్య పతకం మ్యాచ్- సౌరవ్ ఘోష్(రాత్రి 9.30 గంటలకు)

వెయి‌ట్ లిఫ్టింగ్..

పురుషుల 109 కేజీల-లవ్ ప్రీత్ సింగ్(మధ్యాహ్నం 2 గంటలకు)

మహిళల 87 ప్లస్ కేజీ- పూర్ణిమా సింగ్ (రాత్రి 6.30 గంటలకు)

పురుషుల 109 ప్లస్ కేజీ- గుర్దీప్ సింగ్(రాత్రి 11.00 గంటలకు)

తదుపరి వ్యాసం