తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cwg 2022 Cricket: చెలరేగిన హర్మన్‌ప్రీత్‌, షెఫాలీ.. టీమిండియా ఫైటింగ్‌ స్కోరు

CWG 2022 Cricket: చెలరేగిన హర్మన్‌ప్రీత్‌, షెఫాలీ.. టీమిండియా ఫైటింగ్‌ స్కోరు

Hari Prasad S HT Telugu

29 July 2022, 17:02 IST

    • CWG 2022 Cricket: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇండియన్‌ వుమెన్స్‌ టీమ్‌ ఫైటింగ్‌ స్కోరు సాధించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ఓపెనర్‌ షెఫాలీ వర్మ చెలరేగారు.
హాఫ్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్
హాఫ్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (REUTERS)

హాఫ్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌ గోల్డ్‌ మెడల్‌ ఫేవరెట్‌ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియన్‌ టీమ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 రన్స్‌ చేసింది. మొదట్లో ధాటిగానే ఇన్నింగ్స్‌ ప్రారంభించినా.. మధ్యలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు చేసే అవకాశం కోల్పోయింది. ఓపెనర్‌ షెఫాలీ వర్మ (48), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (52) చెలరేగడంతో ఇండియా ఆ మాత్రం స్కోరైనా సాధించింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ చివరి వరకూ క్రీజులో ఉండి హాఫ్‌ సెంచరీ సాధించింది. చివరి ఓవర్లో ఆమె ఔటైంది. హర్మన్‌ప్రీత్‌ 34 బాల్స్‌లోనే 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 రన్స్‌ చేసింది. మరోవైపు షెఫాలీ వర్మ 33 బాల్స్‌లో 9 ఫోర్లతో 48 రన్స్‌ చేసింది. మరో ఓపెనర్‌ స్మృతి మంధానా 17 బాల్స్‌లో 24 రన్స్‌ చేసి ఔటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో జెస్‌ జోనాసెన్‌ 4 వికెట్లు, మేగన్‌ షుట్‌ 2 వికెట్లు తీశారు.

తదుపరి వ్యాసం