తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dinesh Karthik: నువ్వు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చావు...కార్తిక్ పై పాండ్య ప్ర‌శంస‌లు...

Dinesh Karthik: నువ్వు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చావు...కార్తిక్ పై పాండ్య ప్ర‌శంస‌లు...

HT Telugu Desk HT Telugu

19 June 2022, 12:48 IST

  • ఐపీఎల్ లో అద్భుత మెరుపులతో ఆకట్టుకున్న దినేష్ కార్తిక్ సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో నూ బ్యాటింగ్ లో రాణిస్తున్నాడు. అతడిపై టీమ్ ఇండియా ఆల్ రౌండర్ పాండ్య ప్రశంసల్ని కురిపించాడు. తన ఆటతీరుతో కార్తిక్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడని పాండ్య పేర్కొన్నాడు. 

హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తిక్
హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తిక్ (twitter)

హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తిక్

ఐపీఎల్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో సుదీర్ఘ విరామం త‌ర్వాత టీమ్ ఇండియాలో స్థానాన్ని ద‌క్కించుకున్నాడు వెటరన్ బ్యాట్స్ మెన్ , వికెట్ కీపర్ దినేష్ కార్తిక్‌. చివ‌ర‌గా కార్తిక్ 2019 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడాడు. ఆ స‌మ‌యంలో అత‌డు స‌రిగా రాణించ‌లేక‌పోవ‌డంలో సెలెక్ట‌ర్లు ప‌క్క‌న‌పెట్టారు. అత‌డి కెరీర్ ముగిసిపోయిన‌ట్లేన‌ని, 36 ఏళ్ల వ‌య‌సులో తిరిగి జాతీయ జ‌ట్టుకు ఆడ‌టం సాధ్యం కాదంటూ విమ‌ర్శ‌లు వినిపించాయి. కానీ త‌న ఆట‌తీరుతోనే విమర్శకులకు బ‌దులిచ్చాడు కార్తిక్‌. 

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఐపీఎల్‌లో ఫినిష‌ర్ రోల్ కు చ‌క్క‌గా న్యాయం చేశాడు. తిరిగి టీమ్ ఇండియాకు సెలెక్ట్ అయ్యాడు. సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న టీ20సిరీస్‌లోనూ బ్యాట్ ఝులిపిస్తున్నాడు.  నాలుగో టీ20 మ్యాచ్ లో హాఫ్ సెంచ‌రీతో భార‌త్ ను గెలిపించాడు. పాండ్య‌తో క‌లిసి టీమ్ ఇండియాకు గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరును అందించాడు.   నాలుగో టీ20 లో భారత్ విజయానంతరం పాండ్య,  కార్తిక్ బీసీసీఐ టీవీతో ముచ్చటించారు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 

ఇందులో కార్తిక్ పై పాండ్య ప్రశంసలు కురిపించాడు. కార్తిక్ ను చూస్తుంటే గర్వంగా ఉందని పాండ్య అన్నాడు. అతడి ప్రయాణం ఎంతో మందికి ఓ అనుభవపాఠంగా ఉపయోగపడుతుందని తెలిపాడు.  ‘టీమ్ ఇండియాలో తిరిగి చోటు సంపాదించుకోవడమే నా లక్ష్యమంటూ గతంలో నువ్వు చెప్పిన మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి. భారత జట్టు తరఫున ఆడటమే కాదు ప్రపంచకప్ లో చోటు దక్కించుకుంటానంటూ బలంగా చెప్పావు. మాటలు చెప్పడమే కాకుండా హార్డ్ వర్క్ ద్వారా అది నిజం చేసి చూపిస్తున్నావు.  నీ హార్డ్ వర్క్ తో ఎంతో మందిలో స్ఫూర్తిని నింపావు’ అని ఈ వీడియోలో  కార్తిక్ ను ఉద్దేశించి పాండ్య అభినందనల్ని కురిపించాడు. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్టోబర్ లో టీ20 వరల్డ్ కప్ జరుగనుంది. వరల్డ్ కప్ టీమ లో కార్తిక్ ను సెలెక్ట్ చేయాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. 

టాపిక్

తదుపరి వ్యాసం