తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Danushka Gunathilaka Suspended: గుణతిలకను సస్పెండ్ చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డ్

Danushka Gunathilaka Suspended: గుణతిలకను సస్పెండ్ చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డ్

07 November 2022, 15:40 IST

  • Danushka Gunathilaka Suspended: అత్యార‌ణ ఆరోప‌ణ‌తో అరెస్ట్ అయిన శ్రీలంక క్రికెట‌ర్ ధ‌నుష్క గుణ‌తిల‌క‌ను అన్ని ఫార్మెట్స్ నుంచి స‌స్పెండ్ చేసింది శ్రీలంక క్రికెట్ బోర్డ్‌. అత‌డికి ఆస్ట్రేలియా న్యాయం స్థానం బెయిల్‌ను నిరాక‌రించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ధ‌నుష్క గుణ‌తిల‌క‌
ధ‌నుష్క గుణ‌తిల‌క‌

ధ‌నుష్క గుణ‌తిల‌క‌

Danushka Gunathilaka Suspended: అత్యాచార‌ ఆరోప‌ణ‌ల‌తో అరెస్ట్ అయిన శ్రీలంక క్రికెట‌ర్ ధ‌నుష్క గుణ‌తిల‌క‌ను అన్ని ఫార్మెట్స్ నుంచి స‌స్పెండ్ చేస్తోన్న‌ట్లుగా శ్రీలంక క్రికెట్ బోర్డ్ ప్ర‌క‌టించింది. నేష‌న‌ల్స్‌తో పాటు ఇంట‌ర్‌నేష‌న‌ల్ క్రికెట్‌సెల‌క్ష‌న్స్‌లోనూ అత‌డి పేరును ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోబోమ‌ని ప్ర‌క‌టించింది ఈ స‌స్పెన్ష‌న్‌ త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి వ‌స్తుంద‌ని క్రికెట్ బోర్డ్ ప‌రిగ‌ణించింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఒక‌వేళ గుణ‌తిల‌క దోషిగా తేలితే అత‌డిపై క‌ఠిన శిక్ష‌ను తీసుకోవ‌డానికి తాము వెనుకాడ‌బోమ‌ని శ్రీలంక క్రికెట్ బోర్డ్ ప్ర‌క‌టించింది. ఎలాంటి ప‌క్ష‌పాతం లేకుండా విచార‌ణ‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని శ్రీలంక క్రికెట్ బోర్డ్ తెలిపింది.

కాగా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించిన టీమ్‌లో గుణ‌తిల‌క ఓ స‌భ్యుడిగా ఉన్నాడు. గాయం కార‌ణంగా సూప‌ర్ 12 రౌండ్ మ్యాచ్‌ల‌కు అత‌డు దూర‌మ‌య్యాడు.

శ్రీలంక క్రికెట్ టీమ్‌తో పాటు ఆస్ట్రేలియాలో ఉన్న అత‌డిని అత్యాచార ఆరోప‌ణ‌ల‌తో ఆదివారం ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. తాను బ‌స చేస్తోన్న హోట‌ల్ ఓ మ‌హిళ‌పై అత‌డు అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసుల‌కు ఫిర్యాదు అందింది.

డేటింగ్ యాప్ ద్వారా మ‌హిళ‌తో అత‌డికి ప‌రిచ‌యం ఏర్ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఆ ప‌రిచ‌యాన్ని ఉప‌యోగించుకొని ఆమెపై గుణ‌తిల‌క అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసుల ఇన్వేస్టిగేష‌న్‌లో తేలింది.

సోమ‌వారం పోలీసులు అత‌డిని కోర్టులో హాజ‌రుప‌రిచారు. బెయిల్ కోసం అత‌డు పెట్టుకున్న అప్పీల్‌ను కోర్టు తిర‌స్క‌రించిన‌ట్లు తెలిసింది. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్ 12 ద‌శ‌లోనే శ్రీలంక ఇంటిముఖం ప‌ట్టింది. అత్యాచార ఆరోప‌ణ‌ల‌తో గుణ‌తిల‌క అరెస్ట్ కావ‌డంతో అత‌డిని అక్క‌డే వ‌దిలేసి మిగిలిన జ‌ట్టు స‌భ్యులు శ్రీలంక చేరుకున్నారు.

తదుపరి వ్యాసం