తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Fifa World Cup Today Matches: ఫిఫా వరల్డ్ క‌ప్‌లో నేడు ఇంగ్లాండ్‌తో ఇరాన్ ఢీ - సెనెగెల్, నెద‌ర్లాండ్స్ పోరు

Fifa World Cup Today Matches: ఫిఫా వరల్డ్ క‌ప్‌లో నేడు ఇంగ్లాండ్‌తో ఇరాన్ ఢీ - సెనెగెల్, నెద‌ర్లాండ్స్ పోరు

21 November 2022, 10:31 IST

  • Fifa World Cup Today Matches: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సోమ‌వారం ఇంగ్లాండ్ - ఇరాన్‌, నెద‌ర్లాండ్స్ - సెనెగ‌ల్ మ‌ధ్య మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి. ప్ర‌ధాన జ‌ట్ల మ‌ధ్య జ‌రుగ‌నున్న ఈ పోరు ఫుట్‌బాల్ అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఇంగ్లాండ్ వ‌ర్సెస్ ఇరాన్‌
ఇంగ్లాండ్ వ‌ర్సెస్ ఇరాన్‌

ఇంగ్లాండ్ వ‌ర్సెస్ ఇరాన్‌

Fifa World Cup Today Matches: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సోమ‌వారం రెండు మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి. తొలి మ్యాచ్‌లో ఇరాన్‌తో ఇంగ్లాండ్ త‌ల‌ప‌డ‌నుండ‌గా మ‌రో మ్యాచ్ సెనెగ‌ల్‌, నెద‌ర్లాండ్స్ మ‌ధ్య జ‌రుగ‌నుంది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆరో స్థానంలో ఉండ‌గా ఇరాన్ 21వ స్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌లో విజ‌యాన్ని అందుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఇంగ్లాండ్ బ‌రిలో దిగుతోంది. ఇంగ్లాండ్ ఆశ‌ల‌న్నీ హ‌రీ కేన్‌పైనే ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

బుకాయో స‌కా, జూడ్ బెల్లింగ్‌హ‌మ్ రాణించాల‌ని ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ అభిమానులు కోరుకుంటున్నారు. మ‌రోవైపు ఇరాన్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ మ్యాచ్‌లో బ‌రిలో దిగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు వ‌ర‌ల్డ్ క‌ప్ ఓపెనింగ్ మ్యాచ్‌లో మూడు ఓట‌ములు, మూడు విజ‌యాల‌తో స‌మంగా ఉంది ఇరాన్‌. ఇంగ్లాండ్‌పై విజ‌యాన్ని సాధించేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డి ఆడేందుకు రెడీ అవుతోంది. ఇబ్ర‌హిమీ, కార్లోస్ కిరోజ్ గాయాల‌తో జ‌ట్టుకు దూరం కావ‌డం ఇరాన్‌ను పెద్ద దెబ్బ‌గా మారింది.

ఏషాన్ హ‌జ్‌స‌ఫీ, స‌ర్ధార్ హ‌జ్‌మౌన్ పైనే ఇరాన్ గెలుపు అవ‌కాశాలు ఆధార‌ప‌డ్డాయి. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇంగ్లాండ్‌, ఇరాన్ త‌ల‌ప‌డ‌టం ఇదే మొద‌టిసారి కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రో మ్యాచ్‌లో సెన‌గెల్‌తో నెద‌ర్లాండ్స్ త‌ల‌ప‌డ‌బోతున్న‌ది. 2018 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు క్వాలిఫై కానీ నెద‌ర్లాండ్స్ ఈ సారి అంచ‌నాల‌కు మించి రాణించింది.

అయితే తొలి మ్యాచ్‌లోనే సెనెగ‌ల్ రూపంలో ఆ జ‌ట్టుకు గ‌ట్టీపోటీ ఎదురైంది. ఆఫ్రికా క‌ప్ నేష‌న్స్ విజేత‌గా నిలిచి సెనెగ‌ల్ జోరుమీదున్న‌ది. అయితే కెప్టెన్ సాడియో మ‌నే దూరం కావ‌డం సెనెగ‌ల్‌కు పెద్ద లోటుగా చెప్ప‌వ‌చ్చు. అత‌డు లేకుండా డ‌చ్‌పై సెనెగ‌ల్ విజ‌యం సాధిస్తుందో లేదో చూడాల్సిందే.

తదుపరి వ్యాసం