తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Argentina Vs France: ఫిఫా వరల్డ్‌కప్‌ అర్జెంటీనాదేనా.. ఫ్రాన్స్‌తో ఆ టీమ్‌ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Argentina vs France: ఫిఫా వరల్డ్‌కప్‌ అర్జెంటీనాదేనా.. ఫ్రాన్స్‌తో ఆ టీమ్‌ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Hari Prasad S HT Telugu

16 December 2022, 15:24 IST

    • Argentina vs France: ఫిఫా వరల్డ్‌కప్‌ అర్జెంటీనాదేనా? ఆ టీమ్‌ ఫైనల్‌ ప్రత్యర్థి ఫ్రాన్స్‌తో గత రికార్డులు చెబుతున్నవి ఇదే. ఫైనల్‌కు ముందు మెస్సీ సేన కాన్ఫిడెన్స్‌ను ఈ రికార్డులు పెంచుతాయనడంలో సందేహం లేదు.
మెస్సీ, ఎంబప్పె
మెస్సీ, ఎంబప్పె (AFP)

మెస్సీ, ఎంబప్పె

Argentina vs France: ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 ఇక తుది అంకానికి చేరుకుంది. శనివారం (డిసెంబర్‌ 17) మూడోస్థానం మ్యాచ్‌ జరగనుండగా.. ఆదివారం (డిసెంబర్‌ 18) ఫైనల్‌ జరగనుంది. మూడోస్థానం కోసం గత వరల్డ్‌కప్‌ రన్నరప్‌ క్రొయేషియా, మొరాకో తలపడనున్నాయి. ఇక ఫైనల్లో అర్జెంటీనా, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ ట్రోఫీ కోసం కొట్లాడనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ ఫైనల్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సాకర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెస్సీ వరల్డ్‌కప్‌ కల నెరవేరుతుందా లేక డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఫ్రాన్స్‌ వరుసగా రెండోసారి విజేతగా నిలుస్తుందా అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎన్నో అంచనాలు, సంచలనాల తర్వాత చివరికి ఈ రెండు టీమ్స్‌ ట్రోఫీ కోసం పోరాడబోతున్నాయి.

ఇదే తన చివరి వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ అని ఇప్పటికే మెస్సీ ప్రకటించిన నేపథ్యంలో ట్రోఫీ కోసం అర్జెంటీనా గట్టిగానే ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. పైగా గత రికార్డులు కూడా ఆ టీమ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఫ్రాన్స్‌తో ఇప్పటి వరకూ జరిగిన ముఖాముఖి పోరులో అర్జెంటీనానే పైచేయి సాధించింది.

అర్జెంటీనా vs ఫ్రాన్స్.. ఎవరెన్ని గెలిచారంటే?

అర్జెంటీనా, ఫ్రాన్స్‌ టీమ్స్‌ ఇప్పటి వరకూ 12 అంతర్జాతీయ మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో అర్జెంటీనా ఆరు మ్యాచ్‌లు గెలవడం విశేషం. ఫ్రాన్స్‌ మూడింట్లోనే విజయం సాధించగా.. మరో మూడు డ్రాగా ముగిశాయి. ఇక ఫిఫా వరల్డ్‌కప్‌లలో ఇప్పటి వరకూ మూడుసార్లు ఈ రెండు టీమ్స్ ఆడాయి. అందులోనూ అర్జెంటీనానే రెండు విజయాలతో పైచేయి సాధించింది.

1930లో ఒకసారి 1-0తో, 1978లో 2-1తో ఫ్రాన్స్‌ను అర్జెంటీనా చిత్తు చేసింది. అయితే చివరిసారి 2018 వరల్డ్‌కప్‌లో ఈ రెండు టీమ్స్ తలపడినప్పుడు మాత్రం ఫ్రాన్స్‌ 4-3తో అర్జెంటీనాను ఓడించింది. ఫైనల్‌కు ముందు ఫ్రాన్స్‌కు కాస్త ఊరట కలిగించే విషయం ఇదే.

తదుపరి వ్యాసం