తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Aiff President: ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ ఎన్నికల్లో ఓడిపోయిన బైచుంగ్‌ భూటియా

AIFF President: ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ ఎన్నికల్లో ఓడిపోయిన బైచుంగ్‌ భూటియా

Hari Prasad S HT Telugu

02 September 2022, 16:29 IST

    • AIFF President: ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ ఎన్నికల్లో బైచుంగ్‌ భూటియా ఓడిపోయాడు. అతడు అధ్యక్ష పదవికి పోటీ పడిన విషయం తెలిసిందే.
బైచుంగ్ భూటియా (ఫైల్ ఫొటో)
బైచుంగ్ భూటియా (ఫైల్ ఫొటో) (PTI)

బైచుంగ్ భూటియా (ఫైల్ ఫొటో)

AIFF President: ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ (ఏఐఎఫ్‌ఎఫ్‌) కొత్త అధ్యక్షుడిగా కల్యాణ్‌ చౌబే ఎన్నికయ్యారు. ఆయన ఇండియన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ బైచుంగ్‌ భూటియాను ఎన్నికల్లో ఓడించడం గమనార్హం. శుక్రవారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కల్యాణ్‌ చౌబే కూడా గతంలో ఫుట్‌బాల్ ప్లేయరే. ఆయన మోహన్‌ బగాన్‌, ఈస్ట్‌ బెంగాల్‌ టీమ్‌లలో గోల్‌కీపర్‌గా వ్యవహరించారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

తాజా ఎన్నికల్లో భూటియాపై 33-1 తేడాతో సులువుగా విజయం సాధించారు. అయితే ఈ విజయంతో కల్యాణ్‌ చౌబే కొత్త చరిత్ర సృష్టించారు. ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ చరిత్రలో ఓ మాజీ ప్లేయర్‌ అధ్యక్షుడు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. కల్యాణ్‌ గతంలో భూటియాతోనూ కలిసి ఆడారు. ఇక ఈ అధ్యక్ష ఎన్నికల్లో భూటియా పేరును గుజరాత్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ అయిన ముల్రాజ్‌సింగ్‌ చౌదాసమా ప్రతిపాదించగా.. అరుణాచల్ ప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ సెక్రటరీ కిపా అజయ్‌ బలపరిచారు.

ఇక కల్యాణ్‌ చౌబే ఫుట్‌బాల్‌ కెరీర్‌ విషయానికి వస్తే ఆయన రెండుసార్లు గోల్‌కీపర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు అందుకున్నాడు. 1997-98, 2001-02లలో రెండుసార్లు చౌబే ఈ ఘనత సాధించారు. కల్యాణ్‌ 1995లో టాటా ఫుట్‌బాల్‌ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్‌ అయ్యారు. ఇక భూటియా కూడా 1995, 2008లలో రెండుసార్లు ఏఐఎఫ్‌ఎఫ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా నిలిచాడు.

కల్యాణ్‌ చౌబే, బైచుంగ్‌ భూటియా కలిసి 1999, 2005లలో ఇండియన్‌ టీమ్‌ను సౌత్‌ ఏషియన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ ఛాంపియన్‌షిప్స్‌ విజేతగా నిలిపారు. ఫుట్‌బాల్‌ నుంచి రిటైరైన తర్వాత ఈ ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చారు. కల్యాణ్‌ చౌబే బీజేపీలో ఉన్నారు. ఆయన గత పార్లమెంట్‌ ఎన్నికల్లో వెస్ట్‌బెంగాల్‌లోని కృష్ణనగర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఏఐఎఫ్‌ఎఫ్‌ ఉపాధ్యక్షుడిగా కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎన్‌ఏ హారిస్‌, కోశాధికారిగా కిపా అజాయ్‌ ఎన్నికయ్యారు.

టాపిక్

తదుపరి వ్యాసం