తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lunar Eclipse 2023 : చంద్రగ్రహణం ఎప్పుడు? ఏ రాశివారికి చెడు ఫలితాలున్నాయి?

Lunar Eclipse 2023 : చంద్రగ్రహణం ఎప్పుడు? ఏ రాశివారికి చెడు ఫలితాలున్నాయి?

HT Telugu Desk HT Telugu

28 October 2023, 7:50 IST

    • Chandra Grahan 2023 Zodiac Signs : ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం తేదీ, సమయం, ఏయే రాశులకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో  జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ప్రతీకాత్మక చిత్రం

చిలకమర్తి పంచాంగరీత్యా ధృక్‌ సిద్ధాంతం పంచాంగ గణితం ఆధారంగా ఆశ్వయుజ మాసం శుక్ల పక్ష పౌర్ణమి తిథి రోజు అశ్విని నక్షత్రములో రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు. ఈ గ్రహణం అశ్విని నక్షత్రం మేషరాశిలో ఏర్పడుట కారణంగా మేష, తులారాశివారు గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిదని చిలకమర్తి తెలిపారు.

లేటెస్ట్ ఫోటోలు

3 రోజుల్లో వృషభ రాశిలోకి శుక్రుడు.. వీరి కష్టాలు తీరిపోతాయి

May 16, 2024, 04:45 PM

Mercury transit: వీరి మీద కనక వర్షం కురిపించబోతున్న బుధుడు.. అందులో మీరు ఉన్నారా?

May 16, 2024, 01:34 PM

Jupiter combust: అస్తంగత్వ దశలోకి గురు గ్రహం.. వీరికి అప్పులు, సమస్యలు, కష్టాలే

May 16, 2024, 01:11 PM

వృషభ రాశిలో సూర్యుడు: నెలపాటు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. ఈ ఇబ్బందులు కలగొచ్చు

May 16, 2024, 12:10 PM

Guru Aditya yoga: 12 ఏళ్ల తర్వాత గురు ఆదిత్య యోగం.. వీరికి గౌరవం, డబ్బు, అన్నింటా విజయం

May 16, 2024, 08:25 AM

మే 16, రేపటి రాశి ఫలాలు.. రేపు మీకు మంచి రోజు అవుతుందో కాదో ఇప్పుడే తెలుసుకోండి

May 15, 2024, 08:22 PM

ఈ పాక్షిక చంద్రగ్రహణం ధృక్‌ సిద్ధాంతం పంచాంగ గణితం ప్రకారం 28 అక్టోబర్‌ 2023 అర్ధరాత్రి 1.05 నిమిషాలకు ప్రారంభమై 2.23 నిమిషాలకు పరిసమాప్తమవుతుందని గ్రహణం మధ్యకాలం 1.44 నిమిషాలని, గ్రహణ ఆద్యంత సమయం 1.18 నిమిషాలని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు. గ్రహణం రాత్రి సంభవించుట కారణంగా ఈ సమయంలో నిద్రపోకూడదని, దుర్దాదేవిని పూజించడం, సుబ్రహ్మణ్యుడిని ఆరాధించుట వలన శుభఫలితాలు కలుగుతాయని చిలకమర్తి వెల్లడించారు.

ఈ గ్రహణ సమయంలో పట్టు స్నానం, విడుపు స్నానం ఆహార నియమాలు వంటి కార్యక్రమాలు జపతప హోమాలు దానాదులు వంటివి యథావిధిగా ఆచరించుకోవడం మంచిదని చిలకమర్తి అన్నారు. మేషరాశి నుండి మీన రాశి వరకు చంద్రగ్రహణ ప్రభావం ఈవిధంగా ఉందని చిలకమర్తి వివరించారు.

మేష రాశి

చంద్రగ్రహణ ప్రభావంచేత మేష రాశి వారికి మానసిక ఆందోళనలు, శారీరక శ్రమ, ఇబ్బందులు కలుగు సూచన. సుబ్రహ్మణ్యుని ఆరాధించడం, దుర్దాదేవిని పూజించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి చంద్రగ్రహణ ప్రభావంచేత అధిక ఖర్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగు సూచన.

మిథున రాశి

మిథున రాశి వారికి అనుకూలమైన ఫలితాలు, లాభదాయకమైన ఫలితాలు కలుగును.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి రాజకీయ సమస్యలు వేధించు సూచన. గ్రహశాంతి జరుపుకోవడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి చంద్రగ్రహణం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు.

కన్యా రాశి

కన్యా రాశి వారికి వ్యాపారాభివృద్ధి జరుగును. అలసట లేకుండా పనులు చేసెదరు. ఆరోగ్యం అనుకూలించును.

తులా రాశి

తులా రాశి వారికి పనుల యందు చికాకులు, ఒత్తిళ్ళు ఏర్పడును. కలహములు కలుగు సూచన.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి శత్రుబాధ, నరఘోష అధికమగును. చికాకులు కలుగును.

ధనూ రాశి

ధనూ రాశి వారికి చంద్రగ్రహణం అనుకూలించును. ఆనందముగా గడిపెదరు. శుభఫలితములు ఏర్పడును.

మకర రాశి

మకర రాశి వారికి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. గ్రహణ ప్రభావం వలన మధ్యస్థ ఫలితాలు కలుగును.

కుంభ రాశి

కుంభ రాశి వారికి గ్రహస్థితిలో మార్పు సంభవించును. కుటుంబ కలహాలు వేధించు సూచన.

మీన రాశి

మీన రాశి వారికి గ్రహణ ప్రభావం వలన ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కలుగును. మానసిక ఒత్తిళ్ళు కలుగును.

ఏ రాశివారికి అయితే అశుభ ఫలితాలు ఉన్నాయో వారు గ్రహణ సమయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దుర్దాదేవి, సుబ్రహ్మణ్యుడు, నవగ్రహ ఆరాధన చేస్తే వారికి శుభ ఫలితాలు కలుగునని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు.

తదుపరి వ్యాసం