తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈవారం రాశి ఫలాలు 24.12.2023 నుండి 30.12.2023 వరకు..

ఈవారం రాశి ఫలాలు 24.12.2023 నుండి 30.12.2023 వరకు..

HT Telugu Desk HT Telugu

24 December 2023, 1:00 IST

    • Weekly Horoscope Telugu: ఈవారం రాశి ఫలాలు (వార ఫలాలు) 24.12.2023 నుండి 30.12.2023 వరకు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈవారం రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Weekly Horoscope Telugu: ఈవారం రాశి ఫలాలు (వార ఫలాలు) 24.12.2023 నుండి 30.12.2023
Weekly Horoscope Telugu: ఈవారం రాశి ఫలాలు (వార ఫలాలు) 24.12.2023 నుండి 30.12.2023 (Pixabay)

Weekly Horoscope Telugu: ఈవారం రాశి ఫలాలు (వార ఫలాలు) 24.12.2023 నుండి 30.12.2023

ఈవారం రాశిఫలితాలు (వార ఫలాలు)

లేటెస్ట్ ఫోటోలు

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

తేదీ 24.12.2023 నుండి 30.12.2023 వరకు

మాసం: మార్గశిరం, సంవత్సరం: శోభకృత్‌ నామ

మేషరాశి వార ఫలాలు

మేషరాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థముగా ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. నూతన సదుపాయాలపట్ల ఆసక్తి ఏర్పడుతుంది. బుుణభారాలు తగ్గించుకుంటారు. అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. శ్రమాధికమైనప్పటికీ ప్రయోజనాలు అందుకుంటారు. బంధుమిత్రులు మీ అసహాయతను అర్ధం చేసుకోగలరు. మేషరాశివారు ఈవారం దక్షిణామూర్తిని పూజించాలి. అదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుణ్ణి పూజించినట్లయితే మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభరాశి వార ఫలాలు

వృషభ రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. అయితే అవసరాలకు సరిపడు ఆదాయం ఉంటుంది. కుటుంబ సభ్యులచే మానసిక ఒత్తిడులుంటాయి. అధికారులతో తగు మాత్రముగా వ్యవహరించుకోవాలి. బంధుమిత్రులతో ఆనందముగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు. అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని దిద్దుబాట్లకు ప్రయత్నించుకుంటారు. వృషభ రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి. శనివారంరోజు దుర్గా దేవిని పూజించాలి.

ఈవారం మిథునరాశి ఫలాలు

మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో ఆనందముగా గడుపు సూచనలున్నాయి. ప్రయత్నాలకు తగిన ప్రయోజనాలు పొందుతారు. ఊహించని వ్యక్తుల నుంచి అవసరాలను తీర్చుకోగలరు. స్థిరాస్తి వ్యవహారాల్ని అనుకూలింపచేసుకోగలరు. స్పెక్యులేషన్‌లందు కలసి రాగలదు. దీర్హకాలిక లోన్స్‌కు చేయు ప్రయత్నాలు కలసివస్తాయి. వివాహాది శుభాలు పూర్తి చేసుకుంటారు. అన్ని విధాలుగా శుభ సూచనలున్నాయి. మిథునరాశివారు ఈ వారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం సూర్యాష్టకాన్ని పఠించండి.

ఈవారం కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగపరంగా సాధారణంగా ఉంటాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడుటకు దూరంగా ఉండుట మంచిది. అనారోగ్య సమస్యలుంటాయి. ఆలోచనలు కలసిరాక మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు కష్టపడవలసిన సమయం. కర్మాటకరాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

సింహరాశి వార ఫలాలు

సింహరాశి వారికి ఈవారం మీకు అనుకూలంగా ఉన్నది. మీరు చేయు పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. అవకాశాలు కలసివస్తాయి. ఆరోగ్య విషయల్లో జాగ్రత్తలు వహించాలని సూచన. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టు సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులచే సహాయ సహకారాలు అందుకుంటారు. సంతాన ఉద్యోగ, వివాహాది విషయాల్లో కీలక సమాచారం అందుతుంది. చిన్నతరహా పెట్టుబడులుంచడం, రుణాలను కొన్నిటిని తీర్చడం జరుగుతుంది. భ్రాతృవర్గమున శుభాల్లో పాల్గొంటారు. సింహరాశివారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కన్యారాశి వార ఫలాలు

కన్యారాశి వారికి ఈ వారం మధ్యస్థముగా ఉన్నది. అన్ని విషయాలలో మేలు జరుగుతుంది. ఇంటా బయటా చిన్న తరహా లౌక్యమును చూపవలసి ఉంటుంది. సోదరులతో, మిత్రులతో చిన్న తరహా లాభాలు చూడగలుగుతారు. నూతన వస్తు సదుపాయాలు కలుగుతాయి. పనులు ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి చేసుకుంటారు. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. కన్యారాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు కోసం మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశి వార ఫలాలు

తులారాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. గత వివాదాల నుండి పరిష్కారములు ఏర్పడును. ఆరోగ్య సమస్యల నుండి క్రమంగా బయటపడతారు. కుటుంబ సభ్యులతో వ్యవహారాల్లో అచి తూచి వ్యవహరించాలి. వద్దు అనుకున్నా ఇతరులకు సహకారాలు చేస్తారు. ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

ఈవారం వృశ్చిక రాశి ఫలితాలు

వృశ్చిక రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాలచే కుటుంబమునకు దూరంగా ఉన్నవారు దగ్గరవ్వగలరు. ఊహించుకున్న పనులను నెరవేర్చగలుగుతారు. ముఖ్యమనుకున్న పనులను సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు. నిరుద్యోగులకు అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. స్త్రీలకు కుటుంబ మరియు అరోగ్య సమస్యలతో కొంత చికాకులు, మానసిక అందోళనలు కలుగును. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు రావు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించండి.

ఈవారం ధనుస్సు రాశి ఫలితాలు

ధనూరాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. బంధువులు మరియు స్నేహితులతో ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. చెడు అలవాట్లకు భారీమూల్యం చెల్లించవలసి రావచ్చును. భావోద్వేగమునకు గురిచేయు అంశాలు తరచూ ఇబ్బందిపెట్టును. విద్యార్థులకు, నిరుద్యోగులకు అనుకూల సమయం. దూరప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడును. కుటుంబముతో ఎక్కువ సమయంల గడపగలుగుతారు. గత బుుణాల్ని కొన్ని తీరుస్తారు. ధనూరాశివారు ఈవారం మరింత శుభఫలితాల కోసం సూర్యాష్టకాన్ని పఠించడం. శివాలయంలో అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి వార ఫలాలు

మకర రాశివారికి ఈ వారం మీకు మధ్యస్థముగా ఉన్నది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. మీ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. మీకు సహకరించు వ్యక్తులు పెరుగుతారు. నూతన ఒప్పందాలు, అగ్రిమెంట్లు చేసుకోగలరు. అధికారులతో చర్చలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొంచెం అభివృద్ధి కలుగును. దూర ప్రయాణాలు చేయవలసిరావచ్చు. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మకర రాశీ వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మంచిది.

కుంభ రాశి వార ఫలాలు

కుంభరాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బందిపెట్టును. ఇంటా బయటా సహాయం చేయు వ్యక్తులు పెరుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో గత ఇబ్బందులను దూరం చేసుకోగలరు. నిరుద్యోగులకు స్వల్చ అవకాశాలు ఎదురవుతాయి. వస్తుమార్చిడిలు తలపెట్టేవి పూర్తిచేసుకోగలరు. స్త్రీలు కుటుంబ మరియు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పైఅధికారులతో ఇబ్బందులు ఏర్పడును. కుటుంబములో కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వేంకటేశ్వరస్వామిని పూజించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి.

మీన రాశి ఈ వారం రాశి ఫలాలు

మీన రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. ఇతరులపై ఆధిపత్య ప్రదర్శనలకు దూరంగా ఉండాలి. ఇంటా బయటా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. అదనపు బాధ్యతలు ఏర్చడగలవు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించకుండా వ్యవహరించుకోవాలి. అనాలోచితంగా సాగకండి. ఖర్చులకై అప్పులు చేయవలసి రావచ్చును. నవగ్రహ ఆరాధనలు తప్పనిసరిగా చేయండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించాలని సూచన. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషే కం చేసుకోవాలి. దక్షిణామూర్తిని పూజించండి. లలితా సహస్ర నామాన్ని పఠించండి.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

తదుపరి వ్యాసం