తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Weekly Horoscope In Telugu: ఈవారం రాశి ఫలాలు.. వీరికి ఆదాయం గతం కంటే బాగుంటుంది

Weekly Horoscope in Telugu: ఈవారం రాశి ఫలాలు.. వీరికి ఆదాయం గతం కంటే బాగుంటుంది

HT Telugu Desk HT Telugu

15 October 2023, 4:05 IST

    • Weekly Horoscope in Telugu: ఈవారం రాశి ఫలాలు తేదీ అక్టోబరు 15 నుంచి అక్టోబరు 21 వరకు గల వారానికి రాశి ఫలాలు (వార పంచాంగం) ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
ఈ వారం రాశి ఫలాలు తేదీ అక్టోబరు 15 నుంచి అక్టోబరు 21 2023 వరకు
ఈ వారం రాశి ఫలాలు తేదీ అక్టోబరు 15 నుంచి అక్టోబరు 21 2023 వరకు (pixabay)

ఈ వారం రాశి ఫలాలు తేదీ అక్టోబరు 15 నుంచి అక్టోబరు 21 2023 వరకు

ఈవారం రాశి ఫలాలు (వార పంచాంగం)

లేటెస్ట్ ఫోటోలు

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

తేదీ 15.10.2023 నుండి 21.10.2023 వరకు

మాసం: ఆశ్వయుజం, సంవత్సరం: శోభకృత్‌ నామ

మేషరాశి వార ఫలాలు

మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు తగ్గుతాయి. ప్రభుత్వ ఉద్యోగ యత్నాలలో మార్పులుంటాయి. వ్యాపారస్తులకు కొంత అనుకూల సమయం. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాల సూచన. కుటుంబములో సమస్యలు తొలగుతాయి. వృథా ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. వారసత్వపు ఆస్తి లభించును. వాహనం సౌఖ్యం. మేషరాశి వారు ఈవారం దక్షిణామూర్తిని పూజించాలి. ఆదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గా దేవిని, సుబ్రహ్మణ్యుణ్జి పూజించినట్లయితే మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి వార పంచాంగం

వృషభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభదాయకం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. ఉద్యోగస్తులు పై అధికారుల మన్ననలు పొందుతారు. రాజకీయవేత్తలు, కళాకారులు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అప్పుల బాధ నుండి కొంత విముక్తి కలుగుతుంది. శుభకార్యాలపై బంధువులతో సంప్రదిస్తారు. ఆదాయం గతం కంటే బాగుంటుంది. వృషభ రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి. శనివారంరోజు దుర్గాదేవిని పూజించాలి.

మిథున రాశి వార ఫలాలు

మిథున రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు మానసిక ఒత్తిళ్ళ నుండి ఉపశమనం. సాంకేతిక రంగాల వారికి అనుకోని అవకాశాలు కలుగును. వ్యాపారాలు బాగుంటాయి. భూములకు సంబంధించిన వివాదాలు పరిష్మారం. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. అనుకోని రాబడి ఉంటుంది. అనుకోని విధంగా మీ పనులు పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు గుర్తింపు కలుగును. మిథున రాశి వారు ఈ వారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే అదివారం సూర్యాష్టకాన్ని పరఠించండి.

కర్కాటక రాశి ఈవారం రాశి ఫలాలు

కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలం. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ రంగాల వారికి, కళాకారులకు శుభ సమయం. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. వాహన, గృహ యోగాల సూచన. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధన లాభాలు కలుగును. ఏ పనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. కర్కాటక రాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

సింహ రాశి జాతక ఫలం

సింహరాశి వారికి ఈవారం మీకు మధ్యస్థముగా ఉన్నది. వ్యాపారస్తులకు వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగాలలో మీపై వచ్చిన నిందలు తొలగుతాయి. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు, ఫలితాలుంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కొన్ని సమస్యలను మీ తెలివితో పరిష్మరించుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పారిశ్రామిక వేత్తలు విదేశీ పర్యటనలు చేస్తారు. సింహ రాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కన్యారాశి ఈవారం రాశి ఫలాలు

కన్యారాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగాలలో ఉన్నత పదవులు లభించవు. ఆస్తి వ్యవహారాలలో అంగీకారానికి వస్తారు. సంతానపరంగా చిక్కులు తొలగుతాయి. వాహన సౌఖ్యం. తండ్రి తరపు వారి సహాయ సహకారాలు అందుతాయి. శుభవార్త వింటారు. కన్యారాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు కోసం మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశి వార పంచాంగం

తులారాశి వారికి ఈ వారం మీకు కొంత అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. భూముల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. మనసుకు నచ్చిన నిర్ణయాలే తీసుకుంటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలేర్చడతాయి. కొన్ని సమస్యలు తీరి మనశ్శాంతి చేకూరుతుంది. మీపై ప్రశంసలు కురుస్తాయి. మీ ఆప్తుల రాక మీకు సంతోషం కలగిస్తుంది. క్రీడాకారులకు అనుకూలం. ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి వార ఫలాలు

వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థముగా ఉన్నది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు ఉండవచ్చు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. అవసరాలకు తగిన ఆదాయముంటుంది. నూతన విద్యావకాశాలు రాకపోవచ్చు. వాహనాలు, ఇళ్ళ కొనుగోలు ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుని ప్రశంసలు అందుకుంటారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్షీ అష్టకం పఠించండి.

ధనూ రాశి వార ఫలాలు

ధనూరాశి వారికి ఈ వారం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. వ్యాపారాలలో భాగస్వాములతో విభేదాలు తొలగుతాయి. ఉద్యోగస్తులు కొత్త లక్ష్యాలు పెట్టుకుంటారు. ప్రముఖ వ్యక్తులు పరిచయమై సహకరిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలుచేస్తారు. ఒక వ్యక్తి ద్వారా మీకు కలసి వస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులు మీ మీద ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. దీర్హకాలిక రుణాలు కొన్ని తీరతాయి. విదేశీ విద్యావకాశాలు కలుగు సూచన. కళాకారులకు, క్రీడాకారులకు పురస్కారాలు, సత్కారాలు. ధనూరాశివారు ఈవారం మరింత శుభఫలితాల కోసం సూర్యాష్టకాన్ని పఠించాలి. శివాలయంలో అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

ఈవారం మకర రాశి ఫలాలు

మకర రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఆటంకాలు తొలగుతాయి. వాహనాలు కొనుగోలుచేస్తారు. ఉద్యోగాలలో మీ పనితనాన్ని నిరూపించుకుంటారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. సాంకేతిక నిపుణులకు, వైద్యులకు అనుకూలం. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మంచిది.

కుంభ రాశి వార ఫలాలు

కుంభరాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. గృహం కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. ఆశించిన దానికంటే ఎక్కువగా డబ్బు సమకూరుతుంది. దూరమైన సన్నిహితులు తిరిగి దగ్గరకు చేరతారు. ఇంట్లో వేడుకలు నిర్వహిస్తారు. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వేంకటేశ్వరస్వామిని పూజించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి.

మీన రాశి వార పంచాంగం

మీన రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సమస్యలు ఎదురైనా మీ ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకుంటారు. ఇల్లు కొనుగోలు విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. విద్యార్థులకు ఆశించిన అవకాశాలుంటాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు వచ్చే అవకాశముంది. తల్లి తరపు వారినుంచి సాయం అందుకుంటారు. సోదరులు, సోదరీలతో ఆస్తుల విషయంలో చర్చిస్తారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు విజయం సిద్ధిస్తుంది. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవాలి. దక్షిణామూర్తిని పూజించండి. లలితా సహస్ర నామాన్ని పఠించండి.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

తదుపరి వ్యాసం