తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shukra Gochar 2023 : కుంభరాశిలోకి ప్రవేశించనున్న శుక్రుడు.. ఆ రాశుల వారికి లాభాలు

Shukra Gochar 2023 : కుంభరాశిలోకి ప్రవేశించనున్న శుక్రుడు.. ఆ రాశుల వారికి లాభాలు

19 January 2023, 15:07 IST

    • Shukra Gochar 2023 : జనవరి నెలలో శుక్రుని సంచారం వల్ల అనేక రాశుల వారికి కలిసి వస్తుంది. శుక్రునిలో మార్పులు కొన్ని రాశిచక్ర గుర్తుల విధిని మార్చుతాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. అయితే ఏ రాశుల వారికి ఎప్పటినుంచి కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కుంభరాశిలో శుక్రుని సంచారం
కుంభరాశిలో శుక్రుని సంచారం

కుంభరాశిలో శుక్రుని సంచారం

Shukra Gochar 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట వ్యవధిలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంది. జనవరి 17న శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించింది. శుక్రుడు జనవరి 22న కుంభరాశిలో సంచరించనున్నాడు. ఈ క్రమంలో కుంభరాశిలోనే శని, శుక్రులు కలిసి ఉంటారు. శని, శుక్రుల మధ్య స్నేహ భావం వల్ల అనేక రాశుల వారికి అపారమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఏ రాశుల వారికి శుక్ర సంచారం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

మేషం

కుంభరాశిలో శుక్రుడు రావడం వల్ల మేష రాశి వారికి పూర్తి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కాలంలో వ్యాపార వర్గానికి మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగం దొరకుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విహారయాత్రకు వెళ్లవచ్చు.

మిథునం

శుక్రుడు కుంభరాశిలోకి వెళ్లడం మిథునరాశి వారికి శుభసూచకం. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ప్రయోజనం కలుగుతుంది. కార్యాలయంలో పురోగతి ఉంటుంది. చాలా కాలంగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలుంటాయి.

సింహ రాశి

శుక్రుడు రాశి మార్పు సింహ రాశి వారికి శుభ ఫలితాలనిస్తుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. వివాహితుల జీవితంలో తీవ్రత ఉంటుంది. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తేనే పురోగతి సాధించవచ్చు.

మకరం

మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభం లభిస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రమోషన్‌తోపాటు ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.

కుంభం

కుంభ రాశి వారికి శుక్ర సంచారం వల్ల అనుకూల ఫలితాలున్నాయి. మీ పనితీరుతో ఉన్నతాధికారులు సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని ప్రశంసిస్తారు. వ్యాపార వర్గానికి ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. ఏది అవసరమో అది అందుబాటులో ఉంటుంది. పెట్టుబడికి సమయం అనుకూలంగా ఉంటుంది.

ఈ సమాచారం.. పూర్తిగా నిజం, ఖచ్చితమైనదని చెప్పడం హిందూస్థాన్ టైమ్ తెలుగు ఉద్దేశం కాదు. మరింత సమాచారం కోసం.. సంబంధిత రంగంలోని నిపుణుడి సలహా తీసుకోండి.

తదుపరి వ్యాసం