తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips: ఇంటి ఆగ్నేయ దిశలో ఇది అస్సలు ఉండకూడదు.. లేకపోతే ఇబ్బందులు తప్పవు!

Vastu Tips: ఇంటి ఆగ్నేయ దిశలో ఇది అస్సలు ఉండకూడదు.. లేకపోతే ఇబ్బందులు తప్పవు!

HT Telugu Desk HT Telugu

19 September 2022, 22:37 IST

    • Vastu Tips: ఇంట్లో అంతా బాగానే ఉన్నా, డబ్బు మన చేతుల్లో ఆగదు. అయితే దీనికి వాస్తు చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య తీరుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. అవెంటో ఇప్పుడు చూద్దాం.
Vastu Tips
Vastu Tips

Vastu Tips

సంతోషకరమైన రిలాక్స్డ్ జీవితాన్ని గడపడానికి, ఇంట్లోని పలు విషయాలలో సమతుల్యతను కలిగి ఉండాలి. ఇంట్లో ప్రతి వస్తువు ఏదో ఒక మూలకాన్ని సూచిస్తుంది. వీటిని వాస్తు ప్రకారం అమర్చినట్లయితే, ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది. దీంతో ఇంట్లో నివసించే సభ్యులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు.

లేటెస్ట్ ఫోటోలు

ఈ రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది.. డబ్బు సహా చాలా ప్రయోజనాలు

May 11, 2024, 02:05 PM

Jupiter Venus conjunction: మీకు పని ప్రదేశంలో అవమానం కలగవచ్చు.. ఆర్థిక నష్టం రావచ్చు, జాగ్రత్త

May 11, 2024, 01:33 PM

Trikona Raja Yogam : శని దేవుడి చల్లని చూపు.. రాజయోగంతో అదృష్టమంతా ఈ రాశులవారిదే

May 11, 2024, 08:50 AM

సంతోషం అంతా ఈ రాశుల వారిదే! ధన లాభం, ప్రమోషన్​- కొత్త ఇల్లు కొంటారు..

May 11, 2024, 05:50 AM

మే 11, రేపటి రాశి ఫలాలు.. రేపటితో వీరికి డబ్బు సమస్యకు తెరపడబోతుంది

May 10, 2024, 08:20 PM

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజు ఏం కొనాలో తెలుసుకోండి.. ఇవి కొంటె మీ లైఫ్ మారిపోతుంది

May 10, 2024, 10:38 AM

అయితే అంతా బాగానే ఉన్నా, డబ్బు మన చేతుల్లో ఆగదు. అయితే దీనికి కొన్ని వాస్తు చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య తీరుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. అవెంటో ఇప్పుడు చూద్దాం.

ఇంటి ఆగ్నేయ ప్రాంతం వైపు నీలం రంగు ఉండకుండా చూసుకోవాలి. ఈ దిశలో లేత నారింజ, గులాబీ రంగులను ఉపయోగించండి.

ఇంటిలోపల ఉండే స్పైడర్ వీల్స్, దుమ్ము, ధూళిని ఎప్పటికప్పుడు తొలగించడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ నిలవదు.

పార్కింగ్ కోసం వాయువ్య స్థలాన్ని ఉపయోగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

ఇంట్లో కుండీలలో నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. ఏదైనా మొక్క ఎండిపోతే వెంటనే తొలగించాలి.

నైరుతి దిశలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవడం ప్రయోజనకరం.

తలుపు తెరిచి మూసివేసేటప్పుడు, పగుళ్లు రాకుండా జాగ్రత్తగా మూసివేయండి.

శుభ ఫలితాలు పొందాలంటే ఇంట్లో పూజగదిలో నిత్యం పూజలు క్రమం తప్పకుండా జరగాలి. నైరుతి దిశలో నిర్మించిన గదిని పూజకు ఉపయోగించకూడదు.

పడకగదిలో డ్రెస్సింగ్ టేబుల్‌ని ఎప్పుడూ ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలి, పడుకునేటప్పుడు అద్దాన్ని కప్పి ఉంచండి.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తి తన పాదాలను దక్షిణం వైపు ఉంచి నిద్రించకూడదు, అలా చేయడం వలన అశాంతి, భయము, నిద్రలేమికి దారితీస్తుంది.

పడకగదిలో పాదాలను మెయిన్ డోర్‌కు ఆనించి పడుకోకండి. తలను తూర్పున, పాదాలు పడమర వైపు ఉంచి నిద్రించడం వల్ల ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి.

కాక్టస్ మొక్కలు లేదా ముళ్ల పొదలు ఉండే మెుక్కలను కుండీలలో అలంకరించకూడదు. వాటిని ఇంట్లో లేదా గదులలో పూర్తిగా నివారించాలి

భవనంలో కాంతి వస్తువులను ఉత్తరం, తూర్పు , పడమర దిశలలో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

అగ్నికి సంబంధించిన గృహోపకరణాలు ఇంట్లో వీలైనంత వరకు ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఇంట్లో అమర్చిన ఎలక్ట్రికల్ ఉపకరణాలు సరిగ్గా నిర్వహించబడాలి, వాటి నుండి శబ్దం రాకూడదు.

టాపిక్

తదుపరి వ్యాసం