తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rakhi 2023 Date And Time: రాఖీ పండుగ 2023: తేదీ, ముహూర్తం, పండుగ విశిష్టత ఇదే

Rakhi 2023 date and time: రాఖీ పండుగ 2023: తేదీ, ముహూర్తం, పండుగ విశిష్టత ఇదే

HT Telugu Desk HT Telugu

26 August 2023, 10:42 IST

    • రాఖీ పండుగ 2023: తేదీ, పండగ విశిష్టత ఇక్కడ తెలుసుకోండి. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఈ వివరాలు అందించారు.
రాఖీ పండుగ 2023 తేదీ, విశిష్టత తెలుసుకోండి
రాఖీ పండుగ 2023 తేదీ, విశిష్టత తెలుసుకోండి (pixabay)

రాఖీ పండుగ 2023 తేదీ, విశిష్టత తెలుసుకోండి

జ్యోతిష్యశాస్త్ర ప్రకారం 2023 ఆగస్టు 17వ తేదీ నుండి 2023 సెప్టెంబర్‌ 15వ వరకు నిజ శ్రావణ మాసం జరుపుకుంటామని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ నిజ శ్రావణ మాసంలో 30 ఆగస్టు 2023 బుధవారం రక్షాబంధనం అంటే రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకోవాలని చిలకమర్తి తెలిపారు. రాఖీ పౌర్ణమి రోజు అక్కాచెల్లెళ్ళను గౌరవించడం వారి యొక్క ఆశీర్వాదం పొందడం, వారి యొక్క మనస్సును సంతృప్తి పరచడం సాంప్రదాయం. సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు ప్రతీక ఈ పండగ.

లేటెస్ట్ ఫోటోలు

మే 16, రేపటి రాశి ఫలాలు.. రేపు మీకు మంచి రోజు అవుతుందో కాదో ఇప్పుడే తెలుసుకోండి

May 15, 2024, 08:22 PM

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

శాస్త్ర ప్రకారం అక్మాచెల్లెళ్ళతో దీపం పెట్టించి, ఇంట్లో తీపి పదార్థాలు వండించి దేవుడికి నైవేద్యం పెట్టించి పూజ చేయించాలి. మీరు పెట్టాలి. అక్కాచెల్లెళ్ళకు శ్రావణ పౌర్ణమి నాడు బట్టలు పెట్టి ఇష్టమైన వస్తువులు ఇచ్చినపుడు వారు మీ యింట్లో కొత్త బట్టలు కట్టుకుని, పసుపు కుంకుమ తీసుకుని వెళ్ళినా మంచిదే. ఈరకంగా తోబుట్టువులను గౌరవించాలి. ఆనందముగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు వారికి తాము అత్తవారింట్లో ఉన్నా పుట్టింటికి దూరమవ్వలేదని, తమ మీద గౌరవాభిమానాలు అలాగే ఉన్నాయని భావిస్తారు. అలా గౌరవించినప్పుడు ఆడ పడుచు యొక్క ఆశీస్సుల వలన మీకు జీవితములో సుఖసౌఖ్యాలు కలుగుతాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

రాఖీ కట్టడానికి మంచి సమయం ఇదే

హిందూ క్యాలెండర్ ప్రకారం రాఖీ పౌర్ణమి తిథి ఆగస్టు 30 ఉదయం 10.58కి ప్రారంభమై ఆగస్టు 31 గురువారం ఉదయం 7.05 గంటల వరకు ఉంటుంది. ఈ తిథి రోజు ఎప్పుడైనా రాఖీ కట్టొచ్చు. అయితే మంచి ముహూర్తం ఆగస్టు 30 రాత్రి 9.01 నుంచి ఆగస్టు 31 తెల్లవారుజాము 7.01 గంటలలోపు కట్టడం శ్రేష్టం.

అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు ఎంత దూరం ఉన్నా ఈ రాఖీ పండగ రోజు కలిసి రాఖీ కట్టుకుంటే వారి అనుబంధం మరింత బలపడుతుంది. అలాగే మీ సోదరికి చిరు కానుక ఇవ్వడం మరిచిపోకండి.

తదుపరి వ్యాసం