తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Raksha Bandhan 2023: వంద రూపాయల్లోనే.. రక్షాబంధన్ బహుమతులు..

Raksha Bandhan 2023: వంద రూపాయల్లోనే.. రక్షాబంధన్ బహుమతులు..

24 August 2023, 20:36 IST

  • Raksha Bandhan 2023: రాఖీ పండగ రోజు ఎలాంటి బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? అయితే తక్కువ బడ్జెట్ లో ఎలాంటి గిఫ్ట్ ఇవ్వచ్చో చూడండి. 

వంద రూపాయల్లో రక్షాబంధన్ బహుమతులు
వంద రూపాయల్లో రక్షాబంధన్ బహుమతులు (Freepik/Unsplash)

వంద రూపాయల్లో రక్షాబంధన్ బహుమతులు

Raksha Bandhan 2023: రాఖీ పండగంటేనే హడావుడి. రాఖీలు, బహుమతుల హంగామా చాలానే ఉంటుంది. ఈ రోజున కాస్త తక్కువ బడ్జెట్లో బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నారా? అయితే కొన్ని మంచి ఆప్షన్లు చూసేయండి.

100 రూపాయల్లో రాఖీ పండగ బహుమతులు:

1. సెంటెడ్ క్యాండిళ్లు:

గులాబీలు, ల్యావెండర్, వెనీలా వాసనలు ఎవ్వరికి ఇష్టముండవు. వాటి నుంచి వచ్చే వాసన సాంత్వననిస్తుంది. రాఖీ పండగ రోజున ఇలాంటి సువాసనలు వెదజళ్లే క్యాండిళ్లను బహుమతిగా ఇవ్వండి. దీంట్లో తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకూ రకరకాలుగా క్యాండిళ్లు అందుబాటులో ఉంటాయి. వాళ్ల మనసుకు సాంత్వననిచ్చేది మంచి బహుమతే కదా.

2. గ్రీటింగ్ కార్డ్:

బయట మార్కెట్లో కొన్న గ్రీటింగ్ కార్డ్ కన్నా మీ చేతితో మీరే స్వయంగా మంచి గ్రీటింగ్ కార్డు తయారు చేయండి. మీరు చెప్పాలనుకున్న విషయాల్ని దాని ద్వారా తెలియజేయండి. మంచి రంగురంగుల పెన్నులతో అందంగా తీర్చిదిద్దండి. డబ్బులతో కొనలేని అమూల్యమైన కానుక అవుతుంది. మీ సోదరునిపై మీ ప్రేమను ఈ కార్డు తెలియజేస్తుంది.

3. చాకోలేట్లు, స్వీట్లు:

ఏ బహుమతి ఇవ్వాలో తెలీకపోతే, వాళ్లకేం నచ్చుతుందో అనే సందేహం ఉంటే రుచికరమైన చాకోలేట్లు లేదా స్వీట్లు కొనండి. అవి నచ్చని వారు ఎవ్వరూ ఉండరు. మీ బంధాన్ని సూచించే తియ్యని కానుక అవుతుంది. ఇప్పుడు చాలా రకాల చాకోలేట్లు, ఆసక్తికరమైన ప్యాకింగులలో వస్తున్నాయి. వాటిని ఎంచుకోండి.

4. ఫొటో ఫ్రేమ్:

మీ బంధాన్ని, పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసేది మంచి ఫోటో. అలాంటిదాన్ని ఒకటి ఎంచుకుని సింపుల్ గా ఫొటో ఫ్రేమ్ చేయించండి. తక్కువ ధరలో ఇవ్వదగ్గ మంచి బహుమతి.

5. డైరీ లేదా నోట్ ప్యాడ్:

చిన్న డైరీ లేదా నోట్ ప్యాడ్ ప్రత్యేకంగా కొనుక్కోరు. మీరు కానుకగా ఇస్తే దాన్ని తప్పకుండా ఉపయోగిస్తారు. దాని అవసరం కూడా నిజానికి ఉంటుంది. తక్కువ ధరల్లో, మంచి డిజైన్లలో అందంగా ఉండే డైరీలు చాలా దొరుకుతాయి. వాటిలో మంచిదొకటి ఎన్నుకుని బహుమతిగా ఇచ్చేయండి.

6. మొక్క:

ఎదుగుదలను సూచించేది మొక్కలు. వాళ్ల ఎదుగుదలను కోరుతూ ఇచ్చే బహుమతి. దానికి వచ్చే కొత్త ఆకులు, పండ్లు మీ బంధం బలపడడాన్ని సూచిస్తాయి. ఇదే మెసేజీని ఆ మొక్కకు జతచేసి ఏదైనా మంచి పండ్ల మొక్క లేదా పూల మొక్క బహుమతిగా ఇవ్వండి.

తదుపరి వ్యాసం