తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Planetary Transit । శుభకార్యాలకు ఇదే అద్భుతమైన సమయం, గ్రహాల సంచారంతో మంచిరోజులు!

Planetary Transit । శుభకార్యాలకు ఇదే అద్భుతమైన సమయం, గ్రహాల సంచారంతో మంచిరోజులు!

HT Telugu Desk HT Telugu

23 February 2023, 8:51 IST

    • Planetary Transit: శుభకార్యాలు చేసుకోవడానికి మంచిరోజులు మొదలయ్యాయని ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మరిన్ని వివరాలు చూడండి.
Planetary Transit
Planetary Transit (Unsplash)

Planetary Transit

Planetary Transit: ఏదైనా శుభకార్యం చేపట్టాలంటే మంచిరోజు కోసం ఎదురుచూస్తాం. మంచిరోజున మొదలు పెట్టే ఏ కార్యమైన ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సాగుతుంది, శుభ ఫలితాలను అందిస్తుంది. ఇప్పుడు ఆ మంచి రోజులు వచ్చాయని పంచాంగకర్తలు చెబుతున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించడం జరుగుతుంది. ఈ సంచారం భూమి మీద మానవాళిపై శుభ, అశుభ ఫలితాలను కలిగిస్తుందని శాస్త్రం చెబుతుంది. అయితే కొన్ని గ్రహాల సంచారం పూర్తి శుభఫలితాలను అందజేస్తుంది.

లేటెస్ట్ ఫోటోలు

Jupiter venus combust: అస్తంగత్వ దశలో గురు, శుక్ర గ్రహాలు.. సమస్యల సుడిగుండంలో చిక్కుకోబోయే రాశులు ఇవే

May 21, 2024, 10:04 AM

Panchak 2024: మే నెలలో ఈ 5 రోజులు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు.. ఎందుకో తెలుసా?

May 21, 2024, 09:21 AM

మే 21, రేపటి రాశి ఫలాలు.. రేపు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు

May 20, 2024, 08:19 PM

Budhaditya raja yogam: బుధాదిత్య రాజయోగం.. వీరికి పెళ్లి కుదురుతుంది, ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది

May 20, 2024, 05:54 PM

భద్ర మహాపురుష రాజ యోగంతో ఈ రాశుల జాతకులకు కొత్త అవకాశాలు, శుభ ఘడియలు

May 20, 2024, 05:31 PM

30 ఏళ్ల తరువాత అదృష్ట రాజయోగం.. ఈ 3 రాశులకు శుభ ఘడియలు

May 20, 2024, 11:30 AM

శుక్రుడిని అదృష్టానికి అధిపతి అంటారు. శుక్రుని ప్రభావం జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. బృహస్పతి పాత్ర కూడా మన జీవితంలో సానుకూలంగా ఉంటుంది. బృహస్పతి ఆశీర్వాదం, విజయం, సానుకూలతను అందించే గ్రహం. అలాగే శని అనుకూల దృష్టి ఉంటే అంతా మంచే జరుగుతుంది. ఇప్పుడు అలాంటి ఒక గోచార స్థితి ఏర్పడింది. ఇది అన్ని రాశులకు శుభ ఫలితాలను అందిస్తుంది. శుభకార్యాలకు, నూతనంగా చేపట్టే కార్యాలకు ఇప్పుడు అనుకూల సమయం నడుస్తోంది. పంచాంగ కర్తలు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

శుభ కార్యాలకు మంచిరోజులు

జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ప్రస్తుత గోచార రీత్యా శని కుంభ రాశి యందు స్వక్షేత్రములో, గురుడు మీన రాశి యందు స్వక్షేత్రములో అలాగే శుక్రుడు మీన రాశి యందు ఉచ్ఛ క్షేత్రములో సంచరిస్తున్నారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్రవేత్త, చిలకమర్తి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఇలా మూడు గ్రహాలు స్వక్షేత్రము, ఉచ్ఛక్షేత్రములో ఉండటం శుభ పరిణామం అని చిలకమర్తి తెలిపారు. ఇలా గ్రహాలు స్వక్షేత్రము, ఉచ్ఛక్షేత్రములో ఉండగా చేసేటటువంటి శుభకార్యాలు సత్ఫలితాలను ఇస్తాయి.

ఇలాంటి గ్రహస్థితిలో చేసేటటువంటి షోడశకర్మలు, గృహారంభ, గృహప్రవేశ, ఉపనయన, వివాహ, అన్నప్రాశన వంటి శుభకార్యాలు మామూలు రోజుల కంటే మంచి ఫలితాలను ఇస్తాయి. నూతనంగా వస్తువులు కొనడానికి, నూతనంగా వాహనాలు కొనుక్కోవడానికి, రిజస్ట్రేషన్ వంటివి చేసుకోవటానికి ఈ గ్రహస్థితి ఉన్న ఫిబ్రవరి, మార్చి నెలలు శుభముహూర్తాలకు, శుభకార్యాలకు మంచిరోజులు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఫాల్గుణ మాసం విశిష్టత

ఫాల్గుణ మాసము దానధర్మాలు ఆచరించడానికి ఉత్తమమైన మాసమని పురాణాలు తెలియచేస్తున్నాయి. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం పూర్వ ఫాల్గుణి, ఉత్తర ఫాల్గుణి నక్షత్రాల వద్ద పౌర్ణమి చంద్రుడు ఉండుట చేత ఈ మాసమునకు ఫాల్గుణ మాసంగా పేరు వచ్చినది. భాగవతం ప్రకారం ఫాల్గుణ మాసము విష్ణు ప్రీతికరము అని చెప్పడమైనది. ఫాల్గుణ మాసములో గోదానం, ధనదానం, వస్త్రదానం చేయడం వలన గోవిందునకు ప్రీతి కలిగిస్తాయిని శాస్త్ర వచనం. విష్ణుమూర్తిని ఆరాధించేటటువంటి వారు ఫాల్గుణ శుక్ల పాడ్యమి నుండి శుక్ల ద్వాదశి వరకు ఉన్న ఈ పన్నెండు రోజులు పయోవ్రతమును ఆచరిస్తారు. పయోవ్రతం అనగా మహా విష్ణువును ఈ పన్నెండు రోజులు పంచామృతాలతో అభిషేకం చేసి, రోజూ ఉదయంత్, సాయంత్రము స్నానమాచరించి విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తిని పంచామృతాలతో అభిషేకం చేయడం పయోవ్రతములో విశేషము. పదకొండో రోజు ఉపవాసముండి పన్నెండో రోజు విష్ణుమూర్తికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇలా పన్నెండు రోజులు విష్ణుమూర్తిని అభిషేకం చేసి పూజించిన వారికి అభీష్టసిద్ధి కలుగుతుందని భాగవత పురాణము తెలియచేసింది.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్: 9494981000.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

టాపిక్

తదుపరి వ్యాసం