తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Trigrahi Yoga: త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారు డబ్బు, గౌరవం పొందుతారు

Trigrahi yoga: త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారు డబ్బు, గౌరవం పొందుతారు

Gunti Soundarya HT Telugu

06 January 2024, 9:30 IST

    • Trigrahi yoga: జనవరి నెలలో సూర్యుడు, బుధుడు, కుజుడు ఒకే రాశి చక్రంలో ఉండటం వల్ల అద్భుతమైన త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది. దీని వల్ల కొన్ని రాశులకి శుభం చేకూరనుంది. 
త్రిగ్రాహి యోగం
త్రిగ్రాహి యోగం (pixabay)

త్రిగ్రాహి యోగం

Trigrahi yoga: గ్రహాల గమనం వల్ల శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. జనవరి నెలలో పెద్ద గ్రహాలు కొన్ని తమ రాశి చక్రాలు మార్చుకోబోతున్నాయి. దీని ప్రభావం పన్నెండు రాశుల మీద పడనుంది.

లేటెస్ట్ ఫోటోలు

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు కొంత విరామం తర్వాత రాశి చక్రం, నక్షత్ర మండలాన్ని మారుస్తూ వస్తాయి. 2024 సంవత్సరం జనవరి నెలలో బుధుడు, కుజుడు, సూర్యుడు ఒకే రాశిలోకి రానున్నాయి. దీని వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది. బుధుడు జనవరి 7వ తేదీన ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు ఇప్పటిగే ధనుస్సు రాశిలో ఉన్నాడు. ఇక అంగారక గ్రహం కూడా డిసెంబర్ 27 నుంచే ధనుస్సు రాశిలో ఉన్నాడు.

ఈ మూడు పెద్ద గ్రహాలైన బుధుడు, సూర్యుడు, కుజుడు కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం రాశి చక్రాలపై శుభ, అశుభ ప్రభావాలు చూపుతుంది. అయితే కొన్ని రాశులు త్రిగ్రాహి యోగం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందబోతున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవంటే..

వృషభ రాశి

మూడు పెద్ద గ్రహాల కలయిక వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. వృత్తి జీవితంలో పురోగతి సాధిస్తారు. సంపద పెరిగే అవకాశం ఉంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక ప్రదేశానికి వెళ్ళే ప్లాన్ చేసుకోవచ్చు. అవసరమైన సమయాల్లో తండ్రి మద్దతు మీకు లభిస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మాధుర్యం ఉంటుంది. ఆవివాహితులు పెళ్లి చేసుకునేందుకు ఇది అనువైన సమయం.

సింహ రాశి

జనవరి నెలలో ఏర్పడబోతున్న త్రిగ్రహాల కలయిక సింహ రాశి వారికి ఆనందాన్ని, అదృష్టాన్ని పెంచుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పోటీ పరీక్షలు రాసిన వాళ్ళు శుభవార్తలు వింటారు. డబ్బుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు లాభం తీసుకొస్తాయి. స్థలం, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ శ్రమకి తగిన ఫలితం పొందుతారు. లవ్ లైఫ్ అద్భుతంగా ఉండబోతుంది.

తుల రాశి

ఉద్యోగస్తులకు ఈ యోగం ఎంతో శుభదాయకంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన జీవితం నెలకొంటుంది. శత్రువులని ఓడిస్తారు కానీ కొద్దిగా అలజడి ఉంటుంది. ప్రశాంతమైన మనసులో నిర్ణయాలు తీసుకోండి.

ధనుస్సు రాశి

త్రిగ్రాహి యోగం వల్ల ధనుస్సు రాశి వారికి సమాజంలో హోదా, ప్రతిష్టలు పెరుగుతాయి. పాత మిత్రులని కలుసుకుని సంతోషంగా గడుపుతారు. మిత్రుల సహాయంతో ఉద్యోగ, వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. వ్యాపారులకు ప్రయోజనాలు చేకూరతాయి. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఏదైనా పని చేపట్టేందుకు ఇది శుభ సమయం.

మీనం

వ్యాపారం విస్తరించాలని అనుకునే వారీకి కొత్త అవకాశాలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. కుటుంబం ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.

గమనిక: ఈ వ్యాసంలో ఇవ్వబడిన సమాచారం పూర్తిగా సత్యమని, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు సంబంధిత నిపుణుల సలహా తీసుకోవాలి.

తదుపరి వ్యాసం