తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Matsya Dwadashi 2022 : మత్స్య ద్వాదశి ప్రత్యేకం.. ధర్మాన్ని రక్షించడానికే విష్ణువు మత్స్యావతారం

Matsya Dwadashi 2022 : మత్స్య ద్వాదశి ప్రత్యేకం.. ధర్మాన్ని రక్షించడానికే విష్ణువు మత్స్యావతారం

02 December 2022, 18:00 IST

    • Matsya Dwadashi 2022 : మత్స్య ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి అంటారు. ఈ సంవత్సరం మత్స్య ద్వాదశిని డిసెంబర్ 4వ తేదీన వచ్చింది. ఆ రోజున శ్రీమహావిష్ణువు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. దాని ప్రాముఖ్యత, పూజావిధానం, దాని వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మత్స్య ద్వాదశి 2022
మత్స్య ద్వాదశి 2022

మత్స్య ద్వాదశి 2022

Matsya Dwadashi 2022 : మత్స్య ద్వాదశి రోజున విష్ణువు మత్స్య అవతారం ఎత్తాడు. ఈ మత్స్యావతారం శ్రీ హరి ప్రత్యేక అవతారాలలో ఒకటి. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి అంటారు. 4, డిసెంబర్ 2022న మత్స్య ద్వాదశిని మనం జరుపుకోబోతున్నాము. ఆరోజు విష్ణుమూర్తిని ఎలా పూజించాలో.. ప్రత్యేక పూజలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

Gajalakshmi Yogam : గజలక్ష్మీ యోగం.. వీరికి అప్పులు తీరుతాయి.. వ్యాపారంలో లాభాలు!

May 20, 2024, 07:58 AM

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

మత్స్య ద్వాదశి రోజున శ్రీ హరివిష్ణువు మత్స్యావతారం ధరించి హయగ్రీవ అనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించాడని నమ్ముతారు. మత్స్య ద్వాదశి నాడు శ్రీమహావిష్ణువు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోని 'నాగలాపురం వేద నారాయణ స్వామి ఆలయం' విష్ణువు మత్స్యావతారానికి అంకితమైన ఏకైక ఆలయం.

మత్స్య ద్వాదశి రోజున ఇలా పూజలు చేయండి..

బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి.. స్నానం చేయండి. అనంతరం శుభ్రమైన బట్టలు ధరించండి. దీని తరువాత పూలను తీసుకుని నాలుగు కలశాలలో వేసి పూజా స్థలంలో ప్రతిష్టించండి. ఇప్పుడు నాలుగు కలశాలను నువ్వులతో కప్పి.. వాటి ముందు పసుపుతో తయారు చేసిన విష్ణువు విగ్రహాన్ని ఉంచాలి.

ఈ నాలుగు కలశాలు సముద్రానికి ప్రతీకగా చెప్తారు. ఆ తర్వాత విష్ణువు ముందు నెయ్యితో దీపం వెలిగించండి. తర్వాత కుంకుమ, బంతిపూలు, తులసి ఆకులను సమర్పించండి. స్వీట్లు నైవేద్యంగా సమర్పిస్తూ.. ఓం మత్స్య రూపాయ నమః అనే మంత్రాన్ని జపించండి.

మత్స్య ద్వాదశి రోజున ఈ పని చేయండి

మత్స్య ద్వాదశి రోజున.. నీటి వనరులలో లేదా నదులలోని చేపలకు పిండి ముద్దలు తినిపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల వ్యక్తి జాతక దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.

మత్స్య ద్వాదశి కథ

ఇతిహాసాల ప్రకారం.. హయగ్రీవ అనే రాక్షసుడు వేదాలను దొంగిలించాడు. దాని కారణంగా లోకం జ్ఞానం కోల్పోయింది. అధర్మం పెరగడం మొదలైంది. హయగ్రీవుడు చేసిన ఈ పనికి.. దేవతలు, రాక్షసులు అందరూ చాలా కలత చెందారు. అప్పుడు ధర్మాన్ని రక్షించడానికి విష్ణువు మత్స్యావతారం ఎత్తాడు. హయగ్రీవుడు అనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించాడు. ఈ వేదాలన్నింటినీ తిరిగి బ్రహ్మకు అప్పగించాడు.

తదుపరి వ్యాసం