తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  పూజ ఎలా చేయాలి? విధివిధానాలు ఏంటి? సనాతన ధర్మం ఏం చెబుతోంది?

పూజ ఎలా చేయాలి? విధివిధానాలు ఏంటి? సనాతన ధర్మం ఏం చెబుతోంది?

HT Telugu Desk HT Telugu

24 April 2023, 8:59 IST

    • భగవత్ పూజకు సనాతన ధర్మం ఒక విధి విధానాన్ని తెలిపిందని ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
పూజ విధి విధానం దాని అర్థాలు
పూజ విధి విధానం దాని అర్థాలు

పూజ విధి విధానం దాని అర్థాలు

ప్రతీ మానవుడు తన జీవితంలో ధర్మ అర్థ కామ మోక్ష అనే చతుర్విద ఫలితాలు పొందాలి అనేటువంటి సంకల్పముతో జీవిస్తారు. ఆ సంకల్పాలు నెరవేరడం కోసం భగవంతుని పూజిస్తారు. ఆ భగవత్ పూజకు సనాతన ధర్మం ఒక విధి విధానాన్ని తెలిపిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. పూజ అంటే పూర్వ జన్మ వాసనలను నశింపచేసేది అని అర్థము. జన్మ మృత్యువులను లేకుండా చేసేది అని అర్థము.

లేటెస్ట్ ఫోటోలు

ఈ రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది.. డబ్బు సహా చాలా ప్రయోజనాలు

May 11, 2024, 02:05 PM

Jupiter Venus conjunction: మీకు పని ప్రదేశంలో అవమానం కలగవచ్చు.. ఆర్థిక నష్టం రావచ్చు, జాగ్రత్త

May 11, 2024, 01:33 PM

Trikona Raja Yogam : శని దేవుడి చల్లని చూపు.. రాజయోగంతో అదృష్టమంతా ఈ రాశులవారిదే

May 11, 2024, 08:50 AM

సంతోషం అంతా ఈ రాశుల వారిదే! ధన లాభం, ప్రమోషన్​- కొత్త ఇల్లు కొంటారు..

May 11, 2024, 05:50 AM

మే 11, రేపటి రాశి ఫలాలు.. రేపటితో వీరికి డబ్బు సమస్యకు తెరపడబోతుంది

May 10, 2024, 08:20 PM

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజు ఏం కొనాలో తెలుసుకోండి.. ఇవి కొంటె మీ లైఫ్ మారిపోతుంది

May 10, 2024, 10:38 AM

పూజ విధి విధానం.. దాని పరమార్థం

పూజ విధి విధానంలో ఉన్న అంశములు దాని యొక్క అర్థాలను చిలకమర్తి తెలిపారు.

  1. పూజలో ఆసనం అనగా ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.
  2. తర్పణం అనగా పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది. గంధం అంతం లేని దౌర్భాగ్యాన్ని, క్లేశాన్ని నశింపుచేసేది. ధర్మజ్ఞాపునాలనిచ్చేది.
  3. అక్షతలు కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి.
  4. పుష్పం పుణ్యాన్ని వృద్ధిచేసి పాపాన్ని పోగొట్టేది. పుష్కలార్ధాన్ని ఇచ్చేది.
  5. ధూపం చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది.
  6. దీపం సుదీర్ఘమైన అనాన్ని పొగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది.
  7. నైవేద్యం అనగా ఆరు రుచులతో నున్న నాల్గు విధాల పదార్థాలను, దేవతకు తృప్తినిచ్చే దానిని నివేదన చేయుటయే.
  8. ప్రసాదం ప్రకాశానందాల నిచ్చేది. సామరస్యాన్ని కల్గించేది. పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం.
  9. ఆచమనీయం అనగా లవంగ, జాజి, తక్కోలములతో కూడిన ద్రవ్యం ఆచమనీయం.
  10. ఆవాహనం పూజ కొరకు దేవతను పిలుచుటయే ఆవాహనం.
  11. స్వాగతం అనగా దేవతను కుశల ప్రశ్నవేయుట.
  12. పాద్యం అనగా చామలు, గరికలు, పద్మాలు, విష్ణుక్రాంతలతో కూడిన ద్రవ్యం పాద్యం, పాదాలు కడుగుటకు ఇచ్చే జలం.
  13. మధుపర్కం అనగా తేనె, నెయ్యి, పెరుగులతో కూడినది.
  14. స్నానం గంధం, కస్తూరి, అగరు మొదలగు వాటితో స్నానం.
  15. వందనం అనగా అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం ఉరస్స (వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకు తాకించి చేసే వందనం సాష్టాంగం).
  16. ఉద్వాసన అనగా దేవతను, ఆవరణ దేవతలను పదహారు ఉపచారాలచే పూజించి పంపడాన్ని ఉద్వాసన అంటారు.
  17. పూజ అనగా పూర్వ జన్మ వాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది. సంపూర్ణఫలాన్నిచ్చేది.
  18. అర్చన అనగా అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.
  19. జపం అనగా అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం.
  20. స్తోత్రం అనగా నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.
  21. ధ్యానం అనగా ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింపచేసేది. ఇష్టదేవతను చింతింపచేసేది ధ్యానం.
  22. దీక్ష అనగా దివ్యభావాలను కల్గించేది. పాపాలను కడిగివేసేది. సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష.
  23. అభిషేకమనగా అహంభావాన్ని పోగొట్టేది. భయాన్ని మథించేది. పవిత్రోదకాన్నిచల్లేది. ఆనందాదులను కల్గించేది.
  24. మంత్రంమనగా తత్త్వంపై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

టాపిక్

తదుపరి వ్యాసం