తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఆగస్టు 21, సోమవారం రాశి ఫలితాలు.. శివారాధనతో శుభ కాలం

ఆగస్టు 21, సోమవారం రాశి ఫలితాలు.. శివారాధనతో శుభ కాలం

HT Telugu Desk HT Telugu

21 August 2023, 4:05 IST

    • Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలితాలు తేదీ ఆగస్టు 21, 2023 సోమవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు తెలుసుకోండి.
Today rasi phalalu: ఈరోజు రాశి ఫలితాలు ఆగస్టు 21, 2023 సోమవారం
Today rasi phalalu: ఈరోజు రాశి ఫలితాలు ఆగస్టు 21, 2023 సోమవారం

Today rasi phalalu: ఈరోజు రాశి ఫలితాలు ఆగస్టు 21, 2023 సోమవారం

ఈరోజు రాశి ఫలితాలు (దిన ఫలాలు) 21.08.2023

లేటెస్ట్ ఫోటోలు

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

వారం: సోమవారం, తిథి: పంచమి

నక్షత్రం: చిత్త, మాసం: శ్రావణం,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కలసివచ్చును. కుటుంబముతో ఆహ్లాదకరమైన వాతావరణం. మీరు చేసే ప్రతీ పని కలసివచ్చును. ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు. రాజకీయ నాయకులకు, స్త్రీలకు కలసివచ్చే రోజు. విద్యార్థులకు మధ్యస్థం నుండి అనుకూలం. మేషరాశివారు ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు మరియు ధనమును పొందెదరు.

వృషభ రాశి

వృషభ రాశివారికి ఈ రోజు మీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఆహ్లాదకరమైన వాతావారణం. విద్యార్థులకు మధ్యస్థం నుండి అనుకూలం. స్త్రీలు ఇష్టమైన వస్తువుల కోసం ధనమును ఖర్చు చేసెదరు. సోదర వర్గంతో ఆనందముగా గడుపుదురు. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభ ఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగంలో ఒత్తిళ్ళు అధికం. చికాకులతో కూడియున్నటువంటి వాతావరణం. కుటుంబముతో ఇబ్బందికరమైన పరిస్థితి. ఖర్చులు నియంత్రించుకోవాలి. వ్యాపారస్తులకు అందవలసిన ధనము సమయానికి అందదు. రాజకీయ నాయకులకు అంత అనుకూలం కాదు. మిథునరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు ఉద్యోగంలో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రశాంతంగా ఉండటం మంచిది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనలాభం. ధనమును జాగ్రత్తగా ఖర్చుచేయాలని సూచన. మీయొక్కతెలివితేటలను సద్వినియోగం చేసుకుంటారు. కర్మాటక రాశి వారికి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన మరియు పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి.

సింహరాశి

సింహరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో సమస్యలను అధిగమించండి. గొడవలకు దూరంగా ఉండండి. ముఖ్య పనుల్లో శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు అనుకూలం. ధైర్యంగా మీ సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారస్తులకు ఖర్చులధికం. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యవిషయాల్లో జాగ్రత్తలు వహించాలి. సింహరాశి వారు మరింత శుభఫలితాలు పొందడానికి చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.

కన్యారాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూలంగా ఉన్నది. శ్రమ పడాల్సినటువంటి సమయం. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఉద్యోగస్తులకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు మధ్యస్థం. శ్రమకు తగిన ఫలితం లభించును. విద్యార్థులకు మధ్యస్థం. రైతాంగం, సినీరంగం రంగాలవారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. రాజకీయ నాయకులకు మధ్యస్థం నుండి అనుకూలం. కన్యారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

తులా రాశి

తులారాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. మీరు చేసే పనుల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మంచి పనులు చేపడతారు. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు లాభాలతో కూడిన వ్యాపారం. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. అపార్థాలకు దూరంగా ఉండండి. విద్యార్థులకు కలసివచ్చేటటువంటి రోజు. రైతాంగం, సినీరంగం, రాజకీయ రంగాలవారికి ఈరోజు కలసివచ్చును. తులారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి. ఈశ్వరుణ్ణి పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి. చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఒత్తిళ్ళు అధికం. కుటుంబముతో ఇబ్బందికరమైన వాతావరణం. మనస్సును నియంత్రించుకోవాలి. అనసవర విషయాలు ప్రస్తావించరాదు. కుటుంబ, ఇతర వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. పని ఒత్తిళ్ళు అధికం. సంతానం వలన చికాకులు. విద్యార్థులకు మధ్యస్థ సమయం. రైతాంగానికి అనుకూలం. స్త్రీలకు చెడు సమయం. ఉద్యోగస్తులకు మధ్యస్థం సమయం. వ్యాపారస్తులకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి

ధనూరాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. అష్టమ రవి ప్రభావం చేత సంతానం వలన ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు ఏర్పడును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. స్త్రీలకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఇబ్బందికరం. వ్యాపారస్తులకు అనారోగ్య సమస్యలు కలుగు సూచన. మానసిక ఆందోళనలు, ఇబ్బందులు కలుగును. ధనూరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.

మకర రాశి

మకరరాశి వారికి ఈ రోజు మధ్యస్తం నుండి అనుకూల ఫలితాలున్నాయి. మీరు చేసే పనులు కలసివచ్చును. శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులతో ప్రశంసలు. ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. వ్యాపారస్తులకు ధనపరమైనటువంటి లాభము. సినీరంగం, రైతాంగం వారికి మధ్యస్థం. రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు. మకరరాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావంచేత గొడవలకు దూరంగా ఉండాలని సూచన. కుటుంబములో సమస్యలు వేధించును. అప్పులు బాధించును. ఏ పని ప్రయత్నించినా చికాకులు ఏర్చడును. ఉద్యోగస్తులకు మధ్యస్థం నుండి చెడు సమయం. వ్యాపారస్తులకు చెడు ఫలితం అధికముగా ఉన్నది. విద్యార్థులకు మధ్యస్థం. కుంభరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావంచేత ఖర్చులు అధికము. కోర్టు సమస్యలు. ధనపరమైనటువంటి ఇబ్బందులు కలుగును. గొడవలకు రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచన. అప్పులు చేయరాదు. ఉద్యోగస్తులకు మధ్యస్థం. వ్యాపారస్తులకు, రైతాంగం మరియు సినీరంగం వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికము. విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. మీనరాశి వారు మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలు, శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

తదుపరి వ్యాసం