తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారిపై ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది!

Horoscope Today । నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారిపై ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది!

HT Telugu Desk HT Telugu

18 January 2023, 1:01 IST

    • Horoscope Today in Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వారిచే, తేదీ జనవరి 18, 2023కు సంబంధించి అందించిన రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today in Telugu
Horoscope Today in Telugu (Pixabay)

Horoscope Today in Telugu

Horoscope Today in Telugu: తెలుగు రాశి ఫలాలు (దిన ఫలాలు) 18.01.2023

లేటెస్ట్ ఫోటోలు

30 ఏళ్ల తరువాత అదృష్ట రాజయోగం.. ఈ 3 రాశులకు శుభ ఘడియలు

May 20, 2024, 11:30 AM

Gajalakshmi Yogam : గజలక్ష్మీ యోగం.. వీరికి అప్పులు తీరుతాయి.. వ్యాపారంలో లాభాలు!

May 20, 2024, 07:58 AM

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

సంవత్సరం: శుభకృత్ నామ, అయనం: దక్షిణాయనం, మాసం: పుష్యము వారం: బుధవారం, తిథి: శు. ఏకాదశి నక్షత్రం: అనురాధ

మేష రాశి :

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. శారీరక మరియు ఒత్తిళ్ళు అధికమగును. వాగ్వివివాదానికి దూరంగా ఉండటం మంచిది. అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ఖర్చు అధికముగా ఉండును. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. మానసిక ఇబ్బందులు కొంత కలిగేటటువంటి సూచనలున్నాయి. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. మేషరాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

వృషభ రాశి :

ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉంది. ఖర్చులు అధికమగును. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. శుభవార్తను వింటారు. సుఖ భోజన ప్రాప్తి కలుగును. శారీరక శ్రమ కొంత అధికముగా ఉండును. మానసిక అలసట ఏర్పడును. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగును. నూతనంగా వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వృషభరాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

మిథున రాశి :

ఈ రోజు మీకు అంత అనుకూలంగా ఉన్నది. మానసికంగా ఉల్లాసంగా ఉండెదరు. శారీరక సౌఖ్యము కలుగును. మీ కృషి చేత ధనపరమైన విషయాలలో లాభము పొందెదరు. కుటుంబములో కొంత ఇబ్బందులు ఏర్పడును. ప్రయాణము నందు ఖర్చులు అధికమగు సూచన. మిధున రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

కర్కాటక రాశి :

ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. శారీరక సౌఖ్యమును పొందెదరు. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్ధిక విషయాలు అనుకూలించును. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగును. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్ళటం మంచిది. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కర్కాటక రాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

సింహ రాశి :

ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. చంద్రుని అనుకూల ప్రభావంచేత అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. మానసికంగా ఉల్లాసంగా ఉండెరు. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడులు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉన్నది. సింహ రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

కన్య రాశి :

ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. చంద్రుని ప్రభావం చేత శారీర శ్రమ మానసిక ఒత్తిళ్ళు పెరుగును. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. ప్రయాణములు అధికమగును. స్త్రీ సౌఖ్యం కలుగును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆరోగ్య విషయాల్లో మరియు కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కన్యారాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశి :

ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. ప్రతీ పని ఆచితూచి వ్యవహరించడం మంచిది. శరీర సౌఖ్యం కోసం ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. మానసిక ఆనందము కలుగును. ధనలాభము కలుగును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. కుటుంబ సౌఖ్యము కలుగును. సంతానము వలన సంతోషము కలుగును. అప్పుల ఒత్తిడి ఉండును. మిత్రుల ద్వారా సహాయము పొందెదరు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం తులారాశి వారు మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

వృశ్చిక రాశి :

ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నవి. చంద్రుని ప్రభావం చేత ఒత్తిళ్ళు, శారీరక శ్రమ అధికముగా ఉండును. ఉ ద్యోగములో ఒత్తిళ్ళు, వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు. ధనలాభము మరియు కుటుంబ సౌఖ్యము కలుగును. ఉద్యోగంలో ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ధనలాభము కలుగును. శత్రువులు జాగ్రత్త వహించాలి. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వృశ్చికరాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

ధనుస్సు రాశి :

ఈ రోజు మీకు మధ్యస్తము నుండి అనుకూలంగా ఉన్నది. మీరు చేసే ప్రతీ పని యందు ఆచితూచి వ్యవహరించండి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ఆందోళన కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఏర్పడును. ధనూరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

మకర రాశి :

ఈ రోజు మీకు మధ్యస్తమునుండి అనుకూల ఫలితాలున్నవి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. చికాకులు అధికముగా ఉండును. కీర్తి ప్రతిష్టలు పెరుగును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మకరరాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

కుంభ రాశి :

ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నవి. చంద్రుని అనుకూల ప్రభావం చేత కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. కుటుంబంలోని వారితోటి ఆచితూచి వ్యవహరించండి. ఏలినాటి శని ప్రభావము కుంభరాశి వారికి తీవ్రముగా ఉన్నది. ప్రతీ పని ఆచితూచి వ్యవహరించవలసిన సమయము. శత్రువుల బాధలు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు సమస్యలు అధికముగా ఉన్నవి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుంభరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

మీన రాశి :

ఈ రోజు మీకు మధ్యస్తమునుండి అనుకూల ఫలితములున్నవి. కుటుంబ సౌఖ్యము కలుగును. శారీరక శ్రమ అధికముగా ఉండును. ఆందోళన కలుగును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. ప్రతీ పనిలో విజయాన్ని పొందెదరు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మీన రాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్: 9494981000.

 బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం