తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Horoscope Today। సెప్టెంబర్ 12 రాశి ఫలాలు.. ఆ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలి!

Horoscope Today। సెప్టెంబర్ 12 రాశి ఫలాలు.. ఆ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలి!

HT Telugu Desk HT Telugu

12 September 2022, 6:15 IST

    • Horoscope Today: ఈరోజు రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తేదీ సెప్టెంబర్ 12, 2022కు సంబంధించి అందించిన రాశి ఫలాలను ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today
Horoscope Today (Pixabay)

Horoscope Today

సంవత్సరం: శుభకృత్ నామ, అయనం: దక్షిణాయనం, మాసం: భాద్రపదం, వారం: సోమవారం, తిథి: కృ. విదియ నక్షత్రం: ఉత్తరాభాద్ర. సెప్టెంబర్ 12, 2022 రాశి ఫలాలు

లేటెస్ట్ ఫోటోలు

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

మేషరాశి

మేష రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. సుఖ భోజనప్రాప్తి, విందులు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలో కుజుని ప్రభావం చేత వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వాగ్వి వివాదాలు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ధనాన్ని కొంత అధికంగా ఖర్చు చేస్తారు.

వృషభ రాశి

ఈ రోజు మీకు మధ్యస్తంగా ఉన్నది. ధన వ్యయం అధికముగా జరుగును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించుట మంచిది. శివారాధన చేత ఈ రోజు కొంత శుభ ఫలితాలు కలిగే అవకాశాలున్నవి.

మిథున రాశి

ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికి మీరు అనుకున్న పనిలో విజయాన్ని పొందుతారు. ప్రతి పనియందు ఆచితూచి ముందుకు వెళ్ళటం మంచిది.

కర్కాటక రాశి

ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. అనుకున్న ప్రతీ పనీ దిగ్విజయంగా పూర్తి చేసెదరు. సంతోషము, కీర్తి కలుగును. శివారాధన చేత శుభ ఫలితాలు పొందుతారు.

సింహ రాశి

ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. కోపము, గొడవలు అధికముగా ఉండును. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత లోపించును. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా లేదు. శివాష్టకము పఠించటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.

కన్యా రాశి

ఈ రోజు మీకు మధ్యస్తంగా ఉన్నది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. పనుల యందు ఒత్తిడి అధికముగా ఉండును. ఆచితూచి వ్యవహరించవలసిన సమయం. శివారాధనచే శుభఫలితాలు పొందుతారు.

తులా రాశి

ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ధనలాభం, వస్తులాభం కలుగు సూచనలు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశి

ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. చేసే ప్రతీ పనియందు విజయము పొందెదరు. ధనలాభము మరియు కీర్తి లాభము కలదు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలమైన రోజు.

ధనుస్సు రాశి

ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. చేసే ప్రతీ పనియందు ఆటంకములు, హాని, ఇబ్బందులు కలుగును. మనస్సుని నియంత్రణలో ఉంచుకుంటే మంచిది. మరింత శుభ ఫలితాల కోసం లింగాష్టకాన్ని పఠించాలి.

మకర రాశి

ఈ రోజు మీకు మధ్యస్త ఫలితముగా ఉన్నది. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. చేసే ప్రతీ పనియందు ఆందోళనలు కలుగును. శత్రువర్గంతో జాగ్రత్తలు వహించాలి. శివారాధనచేత శుభ ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి

ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ధనలాభము చేకూరుతుంది. ఏలినాటి శని ఉన్నప్పటికి చేసే ప్రతి పనియందు విజయము పొందుతారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈరోజు శివాభిషేకం చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు ఉంటాయి.

మీన రాశి

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కొన్ని ప్రత్యేక వస్తువులను కొనుగోలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్ నెంబరు- 9494981000

టాపిక్

తదుపరి వ్యాసం