తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శ్రావణమాస ప్రాముఖ్యత.. ఏ రోజు ఎవరిని పూజించాలి?

శ్రావణమాస ప్రాముఖ్యత.. ఏ రోజు ఎవరిని పూజించాలి?

HT Telugu Desk HT Telugu

07 August 2023, 11:37 IST

    • శ్రావణమాస ప్రాముఖ్యత.. ఏ రోజు ఎవరిని పూజించాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన వివరాలు ఇవీ.
లక్ష్మీదేవి చిత్రం.. శ్రావణ మాసంలో ఏ రోజు ఏ దేవుడిని పూజించాలో తెలుసుకోండి
లక్ష్మీదేవి చిత్రం.. శ్రావణ మాసంలో ఏ రోజు ఏ దేవుడిని పూజించాలో తెలుసుకోండి

లక్ష్మీదేవి చిత్రం.. శ్రావణ మాసంలో ఏ రోజు ఏ దేవుడిని పూజించాలో తెలుసుకోండి

శ్రావణమాసాన్ని అత్యంత పవిత్రంగా భావించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నెలలో ప్రతిరోజుకూ ఒక ప్రత్యేకత ఉన్నది. విష్ణుమూర్తి శ్రవణానక్షత్రమున పుట్టినవారు. ఈ నెలలో జన్మించినవారు వేదోక్తకర్మలు నిర్వహించడము, సకల జనుల మన్ననలను పొందడము, సిరిసంపదలు సమృద్ధితో జీవనము సాగించగలరని నమ్మకము.

లేటెస్ట్ ఫోటోలు

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

మే 19 నుంచి ఈ రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు.. ఉద్యోగంలో ప్రమోషన్​- ధన లాభం!

May 14, 2024, 09:35 AM

ఈ నెలలో జన్మించిన మహానుభావులు శీకృష్ణపరమాత్మ, హయగ్రీవుడు. మాఘమాసంలో ఆదివారాలు, కార్తీక మాసంలో సోమవారాలు, మార్గశిర మాసములో లక్షీవారాలు ఇలా ఒక్కొక్క మాసములో ఒక్కో రోజు పవిత్రదినముగా భావిస్తారు. అయితే శ్రావణమాసములో అన్ని రోజులూ పవిత్రమైనవే. ప్రతి దినము ముఖ్యమైనదే. ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడిని పూజిస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

* సోమవారాల్లో శివుడికి అభిషేకాలు

* మంగళవారం గౌరీ వ్రతం

* బుధవారం విఠలుడికి పూజలు

* గురువారాల్లో గురుదేవుడికి ఆరాధన

* శుక్రవారాల్లో లక్ష్మి తులసి పూజలు

* శనివారాల్లో హనుమంతుడికి, తిరుమలేశునికి, శనీశ్వరునికి పూజలు

భక్తులు ప్రతిరోజూ ప్రత్యేక పూజలు చేస్తూ కొలుస్తారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని పూజించడం తరతరాల నుంచి సంప్రదాయంగా వస్తోంది. రోజూ చేస్తున్న పూజలు కాకుండా ఈ మాసంలో నాగపంచమి, పుత్రైకాదశి, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, రుషిపంచమి, గోవత్స బహుళ, సీతల సప్తమి, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య వంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి.

పరమశివుడి వారం

సోమవారం భక్తులు హరహరమహాదేవ శంభో శంకర అంటూ పిలువగానే కొలువుదీరే శివునికి శ్రావణమాసం అత్యంత ప్రీతిపాత్రమైనది.

ఈ మాసంలో వచ్చే సోమవారాలన్నింటినీ శివాభిషేకానికి కేటాయిస్తారు. ఆవుపాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె వంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే అభిషేకం చేసి ఉపవాస దీక్షలు చేపట్టి తాంబూలం, దక్షిణ సమర్పించి భక్తులు శివుడికి హారతి ఇస్తారు.

బిల్వపత్రాలు, ఉమ్మెత్త, కలువ, తుమ్మి వంటి శివుడికి ఇష్టమైన పువ్వులతో పూజలు చేయడం ఈ పండుగ ఆనవాయితీ అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

తదుపరి వ్యాసం