తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  2023 Meena Rasi Phalalu : 2023వ మీన రాశి వారు ఆర్థిక, ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి..

2023 Meena Rasi Phalalu : 2023వ మీన రాశి వారు ఆర్థిక, ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి..

31 December 2022, 16:30 IST

    • 2023 Pisces Horoscope : ఆంగ్ల నూతన సంవత్సరంలో మీన రాశి వారు జాగ్రత్తగా ఉండాలని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. 2023 మీన రాశి ఫలాలు ఇక్కడ చూడండి.
 మీన రాశి
మీన రాశి

మీన రాశి

2023 Meena Rasi Phalalu : చిలకమర్తి పంచాంగ రీత్యా ధృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మీన రాశి వారికి 2023లో ఏలినాటి శని ప్రభావంచేత జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మీన రాశి వారికి 2023లో మధ్యస్తం నుంచి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. మీన రాశివారికి ఏప్రిల్ 2023 వరకు శని 11వ ఇంట మకర రాశి యందు సంచరించడం, గురుడు 1వ ఇంట సంచరించడం, మే 2023 నుండి మీన రాశి వారికి శని 12వ ఇంట (ఏలినాటి శని) సంచరించడం, గురు రాహువులు రెండవ స్థానమునందు సంచరించడంచేత మీన రాశివారికి 2023 ఆర్ధిక వ్యవహారాలయందు జాగ్రత్తలు వహించాలి. ఆర్ధిక సమస్యలు, ఖర్చులు అధికమగు సూచనలు కనబడుచున్నాయి.

లేటెస్ట్ ఫోటోలు

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

మీన రాశి వారు 2023లో ఏలినాటి శని వలన ఆరోగ్య విషయాలయందు, కుటుంబ వ్యవహారాలయందు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలయందు జాగ్రత్తలు వహించాలి. ఏలినాటి శని ప్రభావంచేత కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు వ్యవహారాలు, చికాకులు వంటి ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు కనబడుతున్నాయి. మీన రాశి ఉద్యోగస్తులకు 2023 మధ్యస్త ఫలితాలున్నాయి. ఉద్యోగములో రాజకీయాలు, ఒత్తిడి, సమస్యలు, చికాకులు అధికముగా ఉండును. మీన రాశి ఉద్యోగస్తులకు కొంత కష్టకాలముగా గ్రహస్థితి గోచరిస్తున్నది. 2023 మీన రాశి వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. వ్యాపారములో చికాకులు, ఆర్ధిక సమస్యలు ఏర్పడును. మీన రాశి స్త్రీలకు అనారోగ్య సమస్యలు అధికముగా ఉంటాయి. మీన రాశి రైతులకు 2023లో అనుకూలముగా లేదు. మీన రాశి సినీరంగం వారికి ఈ సంవత్సరం చెడు ఫలితములు అధికముగా ఉన్నవి. 2023 మీన రాశి విద్యార్థులకు కష్టపడి చదువాల్సిన సంవత్సరం. మొత్తం మీద 2023 మీన రాశి వారికి మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావము చేత మీన రాశి వారు 2023లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉండటం, ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తగా ఉండాలని మీన రాశి వారికి సూచిస్తున్నాను. ఆర్ధికపరమైనటువంటి విషయాల్లో మీనరాశి వారు జాగ్రత్తలు ఖచ్చితంగా వహించాలి.

మీన రాశి మరింత శుభఫలితాలు పొందాలంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించడం, గురువారం రోజు దత్తాత్రేయుని పూజించడం, ఆదివారం రోజు నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. మీన రాశివారు ధరించవలసినటువంటి నవరత్నం కనక పుష్యరాగము. మీన రాశి వారు 5 ముఖములు గల రుద్రాక్షను ధరించడం వలన శుభ ఫలితములు కలుగుతాయి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిలకమర్తి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం