తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  52 వారాల కనిష్టస్థాయికి ఈ స్టాక్స్.. కొనుగోలు చేయొచ్చా?

52 వారాల కనిష్టస్థాయికి ఈ స్టాక్స్.. కొనుగోలు చేయొచ్చా?

06 May 2022, 14:07 IST

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు చవిచూడడంతో భారతీయ మార్కెట్లు శుక్రవారం దాదాపు 2 శాతం పడిపోయాయి. దేశీయ మార్కెట్లలో ఐటీ, మెటల్స్, రియల్టీ, బ్యాంకులు, ఆర్థిక సేవల సూచీలు 2 నుంచి 3 శాతం మధ్య క్షీణించడంతో అన్ని రంగాల్లో బలహీనత కనిపించింది. మిగిలిన రంగాలు కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,112 పాయింట్లు పడిపోయి ఇంట్రాడే కనిష్ట స్థాయి 54,586.75 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 342 పాయింట్లు నష్టపోయి 16,341 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. బ్లూచిప్స్ ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఆర్‌ఐఎల్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్‌ల నష్టాలు సూచీలను మరింత కిందికి లాగాయి. నేటి ట్రేడ్‌లో 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్న స్టాక్‌లను పరిశీలిద్దాం:

  • అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు చవిచూడడంతో భారతీయ మార్కెట్లు శుక్రవారం దాదాపు 2 శాతం పడిపోయాయి. దేశీయ మార్కెట్లలో ఐటీ, మెటల్స్, రియల్టీ, బ్యాంకులు, ఆర్థిక సేవల సూచీలు 2 నుంచి 3 శాతం మధ్య క్షీణించడంతో అన్ని రంగాల్లో బలహీనత కనిపించింది. మిగిలిన రంగాలు కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,112 పాయింట్లు పడిపోయి ఇంట్రాడే కనిష్ట స్థాయి 54,586.75 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 342 పాయింట్లు నష్టపోయి 16,341 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. బ్లూచిప్స్ ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఆర్‌ఐఎల్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్‌ల నష్టాలు సూచీలను మరింత కిందికి లాగాయి. నేటి ట్రేడ్‌లో 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్న స్టాక్‌లను పరిశీలిద్దాం:
స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్: ఇంట్రా-డే డీల్స్‌లో షేరు 52 వారాల కనిష్ట స్థాయి రూ. 297ను తాకింది. ఇది నిన్నటి ముగింపుతో పోలిస్తే 4 శాతం తగ్గింది. స్టాక్ ఈ వారంలోనే 7.5 శాతానికి పైగా నష్టపోయింది. గత ఏడాదికాలంలో 63 శాతానికి పైగా నష్టపోయింది. మింట్‌జెనీ పోల్‌లో పాల్గొన్న 46 శాతం మంది విశ్లేషకులు ఈ స్టాక్‌కు 'హై రిస్క్' రేటింగ్ ఇచ్చారు.
(1 / 9)
స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్: ఇంట్రా-డే డీల్స్‌లో షేరు 52 వారాల కనిష్ట స్థాయి రూ. 297ను తాకింది. ఇది నిన్నటి ముగింపుతో పోలిస్తే 4 శాతం తగ్గింది. స్టాక్ ఈ వారంలోనే 7.5 శాతానికి పైగా నష్టపోయింది. గత ఏడాదికాలంలో 63 శాతానికి పైగా నష్టపోయింది. మింట్‌జెనీ పోల్‌లో పాల్గొన్న 46 శాతం మంది విశ్లేషకులు ఈ స్టాక్‌కు 'హై రిస్క్' రేటింగ్ ఇచ్చారు.(AFP)
విప్రో: నేటి ట్రేడింగ్‌లో ఈ షేరు 52 వారాల కనిష్ట స్థాయి రూ. 481.10కి పడిపోయింది. ఐటీ మేజర్ మేలో ఇప్పటి వరకు 3.5 శాతం నష్టపోయింది. గత ఏడాది కాలంలో కేవలం 2 శాతం పెరిగింది. గడిచిన నెల రోజుల వ్యవధిలో స్టాక్ 20 శాతానికి పైగా నష్టపోయింది. సంస్థ ఇటీవల క్యూ4 ఫలితాలు ప్రకటించింది, విప్రో నికర లాభం Q4FY22లో 3.85 శాతం పెరిగి రూ. 3,087 కోట్లకు చేరుకుంది. గత ఏడాది రూ. 16,245 కోట్లతో పోలిస్తే ఆదాయం 28 శాతం పెరిగి రూ. 20,860 కోట్లకు చేరుకుంది. MintGenie ద్వారా పోల్ చేసిన 26.5 శాతం విశ్లేషకులు స్టాక్‌కు 'బ్యాలెన్స్‌డ్ రిస్క్' రేటింగ్ ఇచ్చారు.
(2 / 9)
విప్రో: నేటి ట్రేడింగ్‌లో ఈ షేరు 52 వారాల కనిష్ట స్థాయి రూ. 481.10కి పడిపోయింది. ఐటీ మేజర్ మేలో ఇప్పటి వరకు 3.5 శాతం నష్టపోయింది. గత ఏడాది కాలంలో కేవలం 2 శాతం పెరిగింది. గడిచిన నెల రోజుల వ్యవధిలో స్టాక్ 20 శాతానికి పైగా నష్టపోయింది. సంస్థ ఇటీవల క్యూ4 ఫలితాలు ప్రకటించింది, విప్రో నికర లాభం Q4FY22లో 3.85 శాతం పెరిగి రూ. 3,087 కోట్లకు చేరుకుంది. గత ఏడాది రూ. 16,245 కోట్లతో పోలిస్తే ఆదాయం 28 శాతం పెరిగి రూ. 20,860 కోట్లకు చేరుకుంది. MintGenie ద్వారా పోల్ చేసిన 26.5 శాతం విశ్లేషకులు స్టాక్‌కు 'బ్యాలెన్స్‌డ్ రిస్క్' రేటింగ్ ఇచ్చారు.(Bloomberg)
ప్రిజం జాన్సన్: బిఎస్‌ఇలో ఈ షేరు 52 వారాల కనిష్ట స్థాయి రూ.108.35కి పడిపోయింది. ఇది గత వారంలో 4 శాతం, గత 1 సంవత్సరంలో 15 శాతం పడిపోయింది. ప్రిజం జాన్సన్ ఒక నిర్మాణ సామగ్రి సంస్థ. కంపెనీ విభాగాలలో సిమెంట్, టైల్స్, బాత్, రెడీ మిక్స్‌డ్ కాంక్రీట్ మెటీరియల్ ఉన్నాయి. MintGenie ద్వారా పోల్ చేసిన 41 శాతం మంది విశ్లేషకులు స్టాక్‌కు 'బ్యాలెన్స్‌డ్ రిస్క్' రేటింగ్ ఇచ్చారు.
(3 / 9)
ప్రిజం జాన్సన్: బిఎస్‌ఇలో ఈ షేరు 52 వారాల కనిష్ట స్థాయి రూ.108.35కి పడిపోయింది. ఇది గత వారంలో 4 శాతం, గత 1 సంవత్సరంలో 15 శాతం పడిపోయింది. ప్రిజం జాన్సన్ ఒక నిర్మాణ సామగ్రి సంస్థ. కంపెనీ విభాగాలలో సిమెంట్, టైల్స్, బాత్, రెడీ మిక్స్‌డ్ కాంక్రీట్ మెటీరియల్ ఉన్నాయి. MintGenie ద్వారా పోల్ చేసిన 41 శాతం మంది విశ్లేషకులు స్టాక్‌కు 'బ్యాలెన్స్‌డ్ రిస్క్' రేటింగ్ ఇచ్చారు.(AFP)
ఇన్ఫో ఎడ్జ్: ఈ షేరు 9 శాతం క్షీణించి 52 వారాల కనిష్ట స్థాయి రూ. 3,753కి చేరుకుంది. ఈ వారంలో 6 శాతం, గత 1 సంవత్సరంలో 15 శాతం నష్టపోయింది. సంస్థ తన వివిధ వెబ్ పోర్టల్‌లు, మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా బహుళ ఇంటర్నెట్ ఆధారిత సేవలను నిర్వహిస్తోంది. దీని బ్రాండ్‌లలో naukri.com, iimjobs.com, hirist.com, ambitionbox.com, bigshyft.com, jobhai.com, 99acres.com, jeevansaathi.com, shiksha.com బ్రాండ్‌లు ఉన్నాయి. MintGenie ద్వారా పోల్ చేసిన 40 శాతం విశ్లేషకులు స్టాక్‌కు 'బ్యాలెన్స్‌డ్ రిస్క్' రేటింగ్ ఇచ్చారు.
(4 / 9)
ఇన్ఫో ఎడ్జ్: ఈ షేరు 9 శాతం క్షీణించి 52 వారాల కనిష్ట స్థాయి రూ. 3,753కి చేరుకుంది. ఈ వారంలో 6 శాతం, గత 1 సంవత్సరంలో 15 శాతం నష్టపోయింది. సంస్థ తన వివిధ వెబ్ పోర్టల్‌లు, మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా బహుళ ఇంటర్నెట్ ఆధారిత సేవలను నిర్వహిస్తోంది. దీని బ్రాండ్‌లలో naukri.com, iimjobs.com, hirist.com, ambitionbox.com, bigshyft.com, jobhai.com, 99acres.com, jeevansaathi.com, shiksha.com బ్రాండ్‌లు ఉన్నాయి. MintGenie ద్వారా పోల్ చేసిన 40 శాతం విశ్లేషకులు స్టాక్‌కు 'బ్యాలెన్స్‌డ్ రిస్క్' రేటింగ్ ఇచ్చారు.(Image by StartupStockPhotos from Pixabay)
పిఎన్‌బి హౌసింగ్: షేరు 4.7 శాతం పడిపోయి 52 వారాల కనిష్ట స్థాయి రూ. 343.35ని తాకింది. ఇది ఈ వారంలోనే 7 శాతానికి పైగా నష్టపోయింది. గత ఏడాదికాలంగా ఫ్లాట్‌గా ఉంది. MintGenie ద్వారా పోల్ చేసిన 45 శాతం మంది విశ్లేషకులు స్టాక్‌కు 'బ్యాలెన్స్‌డ్ రిస్క్' రేటింగ్ ఇచ్చారు.
(5 / 9)
పిఎన్‌బి హౌసింగ్: షేరు 4.7 శాతం పడిపోయి 52 వారాల కనిష్ట స్థాయి రూ. 343.35ని తాకింది. ఇది ఈ వారంలోనే 7 శాతానికి పైగా నష్టపోయింది. గత ఏడాదికాలంగా ఫ్లాట్‌గా ఉంది. MintGenie ద్వారా పోల్ చేసిన 45 శాతం మంది విశ్లేషకులు స్టాక్‌కు 'బ్యాలెన్స్‌డ్ రిస్క్' రేటింగ్ ఇచ్చారు.(Image by Click on 👍🏼👍🏼, consider ☕ Thank you! 🤗 from Pixabay)
ఫ్యూచర్ రిటైల్: ఈ స్టాక్ 4.85 శాతం క్షీణించి, 52 వారాల కనిష్ట స్థాయి రూ. 18.65కి చేరుకుంది. వరుసగా తొమ్మిదో సెషన్‌లో ఈ స్టాక్ 5-శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ బియానీ పదవీవిరమణ చేసినట్లు ప్రకటించింది, అయితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థ యొక్క కంపెనీ సెక్రటరీతో సహా అధికారులు కూడా తమ రాజీనామాలను సమర్పించారు. సంస్థ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో రుణదాతల ద్వారా దివాలా పిటిషన్‌ను ఎదుర్కొంటోంది. రిలయన్స్ రిటైల్ ద్వారా రూ. 24,713 కోట్ల డీల్‌ను రద్దు చేసిన తర్వాత ఈ తతంగం కొనసాగింది. MintGenie ద్వారా పోల్ చేసిన 64 శాతం విశ్లేషకులు స్టాక్‌కు 'హై రిస్క్' రేటింగ్ ఇచ్చారు.
(6 / 9)
ఫ్యూచర్ రిటైల్: ఈ స్టాక్ 4.85 శాతం క్షీణించి, 52 వారాల కనిష్ట స్థాయి రూ. 18.65కి చేరుకుంది. వరుసగా తొమ్మిదో సెషన్‌లో ఈ స్టాక్ 5-శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ బియానీ పదవీవిరమణ చేసినట్లు ప్రకటించింది, అయితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థ యొక్క కంపెనీ సెక్రటరీతో సహా అధికారులు కూడా తమ రాజీనామాలను సమర్పించారు. సంస్థ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో రుణదాతల ద్వారా దివాలా పిటిషన్‌ను ఎదుర్కొంటోంది. రిలయన్స్ రిటైల్ ద్వారా రూ. 24,713 కోట్ల డీల్‌ను రద్దు చేసిన తర్వాత ఈ తతంగం కొనసాగింది. MintGenie ద్వారా పోల్ చేసిన 64 శాతం విశ్లేషకులు స్టాక్‌కు 'హై రిస్క్' రేటింగ్ ఇచ్చారు.(Pixabay)
ఆర్‌బిఎల్ బ్యాంక్: బిఎస్‌ఇలో షేరు 4.7 శాతం పడిపోయి 52 వారాల కనిష్ట స్థాయి రూ. 113.25ని తాకింది.. స్టాక్ ఈ వారంలో 5 శాతం, గత 1 సంవత్సరంలో 35 శాతం నష్టపోయింది. యూఎస్ డాలర్-డినామినేటెడ్ బాండ్లను జారీ చేయడం ద్వారా 100 మిలియన్ డాలర్ల వరకు సమీకరించడానికి తన బోర్డు ఆమోదించినట్లు ఇటీవల బ్యాంక్ ప్రకటించింది. MintGenie ద్వారా పోల్ చేసిన 60 శాతం విశ్లేషకులు స్టాక్‌కు 'హై రిస్క్' రేటింగ్ ఇచ్చారు.
(7 / 9)
ఆర్‌బిఎల్ బ్యాంక్: బిఎస్‌ఇలో షేరు 4.7 శాతం పడిపోయి 52 వారాల కనిష్ట స్థాయి రూ. 113.25ని తాకింది.. స్టాక్ ఈ వారంలో 5 శాతం, గత 1 సంవత్సరంలో 35 శాతం నష్టపోయింది. యూఎస్ డాలర్-డినామినేటెడ్ బాండ్లను జారీ చేయడం ద్వారా 100 మిలియన్ డాలర్ల వరకు సమీకరించడానికి తన బోర్డు ఆమోదించినట్లు ఇటీవల బ్యాంక్ ప్రకటించింది. MintGenie ద్వారా పోల్ చేసిన 60 శాతం విశ్లేషకులు స్టాక్‌కు 'హై రిస్క్' రేటింగ్ ఇచ్చారు.(Pixabay)
హింద్ కాపర్: షేరు 4.4 శాతం పడిపోయి 52 వారాల కనిష్ట స్థాయి రూ.105.05ని తాకింది. ఈ స్టాక్ కేవలం మేలో 6 శాతం, గత 1 సంవత్సరంలో దాదాపు 30 శాతం నష్టపోయింది. MintGenie ద్వారా పోల్ చేసిన 47 శాతం విశ్లేషకులు స్టాక్‌కు 'హై రిస్క్' రేటింగ్ ఇచ్చారు.
(8 / 9)
హింద్ కాపర్: షేరు 4.4 శాతం పడిపోయి 52 వారాల కనిష్ట స్థాయి రూ.105.05ని తాకింది. ఈ స్టాక్ కేవలం మేలో 6 శాతం, గత 1 సంవత్సరంలో దాదాపు 30 శాతం నష్టపోయింది. MintGenie ద్వారా పోల్ చేసిన 47 శాతం విశ్లేషకులు స్టాక్‌కు 'హై రిస్క్' రేటింగ్ ఇచ్చారు.(Bloomberg)

    ఆర్టికల్ షేర్ చేయండి