తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Diy Night Cream । నైట్ క్రీమ్‌ను మీ సొంతంగా తయారు చేసుకోండి.. రెండు వారాల్లోనే ముఖంలో కళ వస్తుంది!

DIY Night Cream । నైట్ క్రీమ్‌ను మీ సొంతంగా తయారు చేసుకోండి.. రెండు వారాల్లోనే ముఖంలో కళ వస్తుంది!

05 December 2022, 17:59 IST

DIY Night Cream: శీతాకాలంలో మీ చర్మాన్ని పునరుజ్జీవింపజేయడానికి మంచి సుగుణాలు కలిగిన నైట్ క్రీమ్‌ను సొంతంగా తయారు చేసుకోండి. ఇందుకు ఏమేం కావాలో, ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

  • DIY Night Cream: శీతాకాలంలో మీ చర్మాన్ని పునరుజ్జీవింపజేయడానికి మంచి సుగుణాలు కలిగిన నైట్ క్రీమ్‌ను సొంతంగా తయారు చేసుకోండి. ఇందుకు ఏమేం కావాలో, ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
చలికాలంలో చర్మ సమస్యలు మీకు తెలియనివి కావు. చర్మం పొడిబారి, పగుళ్లు వచ్చి రఫ్ గా తయారవుతుంది. దీనిని రిపేర్ చేయడానికి ఏవేవో క్రీములు ఎందుకు? చక్కనైన చిక్కనైన హోంమేడ్ క్రీంను మీరే తయారు చేసుకోండి. ఇది వాడితే రెండు వారాల్లో మీకే తేడా తెలుస్తుంది.
(1 / 6)

DIY నైట్ క్రీమ్ చేయడానికి మీకు బాదం అవసరం, ఇది చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే రోజ్ వాటర్, ఆల్మండ్ ఆయిల్, అలోవెరా జెల్, విటమిన్ ఇ క్యాప్సూల్స్ అవసరం.
(2 / 6)

ముందుగా 10-12 బాదంపప్పులను తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం, వాటి చర్మం తొలగించండి. ఆ తర్వాత మిక్సీలో 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని వడకట్టి శుభ్రమైన గిన్నెలో ఉంచండి. తర్వాత 2 టీస్పూన్ల బాదం నూనె, 2 టీస్పూన్ల అలోవెరా జెల్ తీసుకుని, 2 విటమిన్ ఇ క్యాప్సూల్స్ నుంచి నూనె తీసి బాదం పేస్ట్ తో కలపాలి. అన్నింటిని బాగా కలిపేసి, ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచండి.
(3 / 6)

సిద్ధం చేసుకున్న క్రీంను రాత్రి పడుకునే ముందు చర్మానికి రాసుకోవాలి. ముఖానికి అప్లై చేసేటపుడు ముందుగా మీ ముఖాన్ని క్లెన్సర్‌తో కడగాలి. తర్వాత టోనర్ అప్లై చేయండి. మీకు కావాలంటే ఫేస్ మిస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. చివరగా బాదంపప్పుతో చేసిన ఈ నైట్ క్రీమ్ అప్లై చేయండి.
(4 / 6)

పొడి చర్మానికి బాదం చాలా మేలు చేస్తుంది. చర్మంపై ఎరుపు రంగు దద్దుర్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మృదువైన చర్మం పొందడానికి సహాయపడుతుంది. గ్లో తెస్తుంది. ఇంకా, చర్మాన్ని టాన్ నుండి రక్షిస్తుంది.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి