తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Youtuber Gaurav Taneja : మెట్రోలో పుట్టిన రోజు వేడుకలతో బుక్కై…..!

YouTuber Gaurav Taneja : మెట్రోలో పుట్టిన రోజు వేడుకలతో బుక్కై…..!

HT Telugu Desk HT Telugu

10 July 2022, 10:11 IST

  • మెట్రో రైల్లో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు ప్రయత్నించిన యూట్యూబర్ గౌరవ్ తనేజాను నోయిడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనేజాకు చెందిన ఫ్లైయింగ్‌ బీస్ట్‌ ఖాతాను యూట్యూబ్‌లో లక్షలాది మంది ఫాలో అవుతారు.  శనివారం మెట్రోలో పుట్టిన రోజు నిర్వహించేందుకు సిద్ధమవడంతో నోయిడా పోలీసులు అరెస్ట్‌ చేసి బెయిల్‌పై విడుదల చేశారు. 

నోయిడా పోలీసుల అదుపులో తనేజా
నోయిడా పోలీసుల అదుపులో తనేజా

నోయిడా పోలీసుల అదుపులో తనేజా

యూట్యూబ్‌లో ఫ్లైయింగ్‌ బీస్ట్‌గా ఫిట్‌నెస్‌ పాఠాలు చెప్పే యూ ట్యూబర్ గౌరవ్ తనేజాను నోయిడా పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఆక్వా లైన్‌ సెక్టార్‌ 51 మెట్రో స్టేషన్‌‌కు అభిమానులు తరలి రావాలని పిలుపునివ్వడంతో భారీ సంఖ్యలో తనేజా అభిమానులు సెక్టార్ 51 మెట్రో స్టేషన్‌కు తరలి వచ్చారు. తనేజా సతీమణి ఇన్‌స్టా ఖాతాల నుంచి పలు మెసేజీలు రావడంతో ఫాలోవర్లు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఢిల్లీ నిషేదాజ్ఞలు అమల్లో ఉండటం, 144సెక్షన్‌ ఉత్తర్వులు ఉల్లంఘించి జనం గుమిగూడేలా ప్రోత్సహించినందుకు యూ ట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ అధికారుల ఆదేశాలను ఉల్లంఘించినందుకు మరో కేసు నమోదు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

శనివారం మెట్రో రైల్లో పుట్టిన రోజు వేడుకల్ని నిర్వహించేందుకు తనేజా ఓ కోచ్‌ బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత తనేజా సతీమణి రీతూ అతని పుట్టిన రోజు వేడుకలకు రావాలంటూ అభిమానులకు పిలుపునిచ్చారు. దీంతో సెక్టార్‌ 51 మెట్రోకు వేల సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఇన్‌స్టా గ్రామ్‌లో 16లక్షల మంది ఫాలోవర్లు ఉన్న రీతూ తనేజా శనివారం మధ్యాహ్నం ఒకటిన్నరకు మెట్రో స్టేషన్‌కు తరలి రావాలని పిలుపునిచ్చారు.

ఆ తర్వా రీతూ ఖాతా నుంచి మరికొన్ని మెసేజీలు వచ్చాయి. మెట్రో కోచ్‌కు సరిపడినంత మందిని మాత్రమే పుట్టిన రోజు వేడుకలకు అనుమతిస్తున్నారని తర్వాత సందేశమిచ్చారు. కొన్ని గంటల తర్వాత వ్యక్తిగత కారణాలతో పుట్టిన రోజు వేడుకల్ని రద్దుచేసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే రైల్వే స్టేషన్‌లో భారీగా జనం పోగయ్యేలా చేసినందుకు నోయిడా పోలీసులు గౌరవ్ తనేజాను అదుపులోకి తీసుకున్నారు.

యూట్యూబ్‌లో అత్యధిక ప్రేక్షకాదరణ ఉన్నత ఖాతాలలో తనేజా అకౌంట్లు కూడా ఉన్నాయి. ఫ్లైయింగ్ బీస్ట్‌, ఫిట్ మజిల్ టీవీ, రస్బరీ కే పాపా పేర్లతో యూ ట్యూబ్ ఖాతాలను నిర్వహిస్తున్నారు. వాటిలో ఫిట్‌నస్‌ సంబంధిత వీడియోలతో పాటు రోజు వారీ దినచర్యలను పోస్టు చేస్తూ ఉంటాడు.

ఐఐటీ ఖరగ్‌పూర్‌ పట్టభద్రుడైన తనేజా సోషల్ మీడియా ఖాతాలతో పాపులారిటీ సంపాదించి వాటి వల్లే చివరకు కటకటాల పాలయ్యాడు. మరోవైపు సోషల్‌ మీడియాలో తనేజా అరెస్ట్‌పై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి

టాపిక్

తదుపరి వ్యాసం