తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nykaa Share Price: పురుషుల లోదుస్తుల మార్కెట్లోకి నైకా.. జోరందుకున్న స్టాక్

Nykaa Share Price: పురుషుల లోదుస్తుల మార్కెట్లోకి నైకా.. జోరందుకున్న స్టాక్

HT Telugu Desk HT Telugu

07 July 2022, 12:43 IST

  • FSN-ECOMMERCE-Nykaa: ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ నైకా స్టాక్ గురువారం ఇంట్రా డేలో 5 శాతం వరకు లాభపడింది.

నైకా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ ఫల్గుణి నాయర్
నైకా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ ఫల్గుణి నాయర్ (AFP)

నైకా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ ఫల్గుణి నాయర్

బెంగళూరు: FSN E-Commerce nykaa షేర్లు గురువారం ఇంట్రాడేలో 4.8 శాతం మేర లాభపడ్డాయి. కాస్మొటిక్స్ నుంచి ఫ్యాషన్ బ్రాండ్స్ వరకు కలిగిన నైకా రీటైలర్ మాతృకంపెనీ ఎఫ్ఎస్ఎన్.. పురుషుల లోదుస్తులు, అథ్లీజర్ (క్యాజువల్) కాటగిరీ సెగ్మెంట్‌లోకి అడుగుతున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నైకా షేరు ధర గురువారం ఇంట్రా డేలో 4.8 శాతం వరకు లాభపడింది.

ట్రెండింగ్ వార్తలు

Indian students: భారతీయ విద్యార్థులకు ‘డీపోర్టేషన్’ ముప్పు; భారీగా నిరసనలు

Patna crime news : స్కూల్​ డ్రైనేజ్​లో 4ఏళ్ల బాలుడి మృతదేహం.. నిరసనలతో తగలబడిన పాఠశాల!

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

టీపీజీ మద్దతుతో ఉన్న ఈ కంపెనీ బుధవారం సంబంధిత వివరాలు ప్రకటించింది. నైకా ఫ్యాషన్ నుంచి గ్లూట్ పేరుతో పురుషుల కోసం ఇన్నర్‌వేర్, అథ్లీజర్ వేర్ బ్రాండ్ తెస్తున్నట్టు ప్రకటించింది.

రూ. 499 నుంచి మొదలుకుని లోదుస్తులు లభిస్తాయని, నైకా యాప్, వెబ్‌సైట్‌లో ఈ దుస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

ప్రస్తుతం నైకా షేరు ధర 4.41 శాతం పెరిగి రూ. 1,464.80 వద్ద ట్రేడవుతోంది.

నైకా నవంబరు 2021లో స్టాక్ మార్కెట్‌లో బలమైన ఎంట్రీ ఇచ్చింది. మహిళలు నేతృత్వం వహిస్తున్న భారత దేశపు మొట్టమొదటి యూనికార్న్‌గా పేరు తెచ్చుకుంది. దీని వ్యాల్యుయేషన్ 14 బిలిన్ డాలర్లుగా ఉంది.

కాగా గురువారం మధ్యాహ్నం 12.42 సమయంలో స్టాక్ మార్కెట్లు మంచి లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 373.49 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 114 పాయింట్లు లాభపడింది. టైటాన్ కంపెనీ, యూపీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బీపీసీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, లార్సెన్ తదితర స్టాక్స్ 2 శాతానికి పైగా లాభపడ్డాయి.

బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్ టెల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, నెస్లే, మారుతీ సుజుకీ, బ్రిటానియా తదితర స్టాక్స్ టాప్ లూజర్స్ జాబితాలో నిలిచాయి.

తదుపరి వ్యాసం