తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Public Transport In India : ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా ఉపయోగించుకుంటోంది మహిళలే!

Public transport in India : ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా ఉపయోగించుకుంటోంది మహిళలే!

11 December 2022, 13:50 IST

    • women in India : దేశంలోని ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా మహిళలే ఉపయోగించుకుంటున్నారని ఓ నివేదిక పేర్కొంది. అదే సమయంలో పని కోసం నడుచుకుంటూ వెళ్లే వారిలో కూడా మహిళలే ఎక్కువగా ఉన్నారు.
ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా ఉపయోగించుకుంటోంది మహిళలే!
ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా ఉపయోగించుకుంటోంది మహిళలే! (HT PHOTO)

ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా ఉపయోగించుకుంటోంది మహిళలే!

Public transport in India : దేశంలో పురుషులతో పోల్చుకుంటే.. ప్రజా రవాణా వ్యవస్థను మహిళలే అధికంగా వినియోగించుకుంటున్నారు! ప్రజా రవాణాలో మహిళల ట్రిప్పులు 84శాతంగా ఉందని ఓ నివేదిక అంచనా వేసింది.

ట్రెండింగ్ వార్తలు

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

Indian students: భారతీయ విద్యార్థులకు ‘డీపోర్టేషన్’ ముప్పు; భారీగా నిరసనలు

Patna crime news : స్కూల్​ డ్రైనేజ్​లో 4ఏళ్ల బాలుడి మృతదేహం.. నిరసనలతో తగలబడిన పాఠశాల!

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

'ఎనేబ్లింగ్​ జెండర్​ రెస్పాన్సివ్​ అర్బన్​ మొబిలిటీ అండ్​ పబ్లిక్​ స్పేసెస్​ ఇన్​ ఇండియా' పేరుతో రూపొందించిన ప్రపంచ బ్యాంక్​ నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. మహిళలు, పురుషుల మధ్య రవాణా విషయంలో ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఈ నివేదిక బయటపెట్టింది. రిపోర్టుల ప్రకారం.. ఏదైనా పనికోసం వెళితే నడకకు.. పురుషుల కన్నా మహిళలే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 45.4శాతం మంది మహిళలు నడుచుకుంటూ వెళితే.. పురుషుల విషయానికొచ్చేసరికి అది 27.4శాతంగా ఉంది.

women empowerment : ప్రజా రవాణా వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరచాలి, మహిళా ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా ఎలాంటి చర్యలు చేపట్టాలని అన్నవాటికి ఈ నివేదిక మార్గనిర్దేశకంగా నిలుస్తుందని భావిస్తున్నారు.

నివేదిక ప్రకారం.. ప్రయాణాల కోసం చాలా మంది మహిళలు బస్సులకే ప్రాధాన్యతనిస్తున్నారు. బస్సుల ప్రయాణం చౌకగా ఉంటుందని భావిస్తున్నారు.

భద్రత లేకపోతే మహిళలు బయటకు వెళ్లడానికి ఇష్టపడరు. ఫలితంగా ప్రజా రవాణాలో వారి ప్రాతినిథ్యం తగ్గిపోతుంది. భారత్​లోని ప్రజా రవాణా సేవలను రూపొందించే సమయంలో మహిళల భద్రతను ఎక్కువగా పరిగణలోకి తీసుకోవడం లేదని నివేదిక పేర్కొంది. అందుకే ఉద్యోగానికి వెళ్లే మహిళల సంఖ్య తక్కువగా ఉందని వివరించింది. 2019-20లో ప్రపంచవ్యాప్తంగా.. ఉద్యోగం చేస్తున్న మహిళల సంఖ్య.. ఇండియాలో తక్కువగా ఉందని తెలిపింది.

Women Public transport in India : స్ట్రీట్​లైట్​ల సంఖ్య పెంచడం, వాకింగ్​- సైక్లింగ్​ ట్రాక్స్​ పెంచడం వంటి చర్యలతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని నివేదిక అభిప్రాయపడింది. రైడ్​ ధరలు తగ్గిస్తే.. మహిళలు వాహనాల్లో ప్రయాణించేందుకు మొగ్గుచూపే అవకాశం ఉందని పేర్కొంది. లైంగిక వేధింపులు, లైంగిక దాడి ఘటనలను త్వరతగతిన పరిష్కరించేందుకు గ్రీవియెన్స్​ రిడ్రెస్సల్​ సిస్టెమ్​ను శక్తివంతంగా తీర్చిదిద్దాలని సూచించింది.

టాపిక్

తదుపరి వ్యాసం