తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Missouri Walmart Fight : షాపింగ్​ మాల్​లో రచ్చ.. 20మంది కొట్టుకున్నారు!

Missouri Walmart fight : షాపింగ్​ మాల్​లో రచ్చ.. 20మంది కొట్టుకున్నారు!

Sharath Chitturi HT Telugu

15 October 2022, 9:22 IST

    • Missouri Walmart fight : షాపింగ్​ మాల్​లో 20మందికి పైగా కస్టమర్లు కొట్టుకున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
షాపింగ్​ మాల్​లో కొట్టుకున్న కస్టమర్లు!
షాపింగ్​ మాల్​లో కొట్టుకున్న కస్టమర్లు!

షాపింగ్​ మాల్​లో కొట్టుకున్న కస్టమర్లు!

Missouri Walmart fight : అమెరికా వాల్​మార్ట్​ స్టోర్​కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. 20కిపైగా కస్టమర్లు దారుణంగా కొట్టుకున్నారు. ఒకరి మీద మరొకరు పడి పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

Uber ride horror: కారులో ఉబర్ డ్రైవర్ హస్తప్రయోగం; భయాందోళనలకు గురైన మహిళ

మిస్సౌరిలోని వాల్ట్​మార్ట్​ స్టోర్​లో మంగళవారం జరిగింది ఈ ఘటన. సెల్ఫ్​ చెకౌట్​ ఏరియాలో కస్టమర్లు దారుణంగా కొట్టుకున్నారు. ఒకరిని మరొకరు కాలితో తన్నారు. ముఖం మీద కొట్టారు. పక్కనే ఉన్న వస్తువులను తీసుకుని విసురుకున్నారు.

ఈ ఘటనపై ఫెర్గూసన్​ పోలీస్​ చీఫ్​ ఫ్రాంక్​ మెక్​కాల్​ స్పందించారు.

"ఇదొక సిగ్గు చేటు ఘటన. 10-25మంది వరకు గొడవ పడ్డారు. గొడవ తర్వాత స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వాల్​మార్ట్​లోనే దానిని పరిష్కరించుకున్నారు," అని ఫ్రాంక్​ పేర్కొన్నారు.

Walmart fight viral video : గొడవ పడిన వాళ్లు.. ఒకరికి ఒకరు ముందే తెలుసు!

"గొడవలో పాల్గొన్న వారిలో కొందరిని పట్టుకున్నాము. వారిలో చాలా మందికి ఒకరికి ఒకరు తెలుసు. అయినా దారుణంగా కొట్టుకున్నారు. ఘటనలో వాల్​మార్ట్​కు కూడా నష్టం జరిగింది. ఈ వ్యవహారంపై వాల్​మార్ట్​ కేసు నమోదు చేస్తుందని ఆశిస్తున్నాను," అని ఫ్రాంక్​ వెల్లడించారు.

స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్ట్​ చయలేదు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై వాల్​మార్ట్​ కూడా బహిరంగంగా స్పందించలేదు. కస్టమర్ల భద్రతే తమకు ముఖ్యమని మాత్రం వెల్లడించింది.

అసలు ఎందుకు గొడవ జరిగింది? అన్న విషయంపై స్పష్టత రాలేదు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి:

ఇటీవలి కాలంలో షాపింగ్​ మాల్స్​లో గొడవలు జరుగుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకు అనేక మంది గొడవల్లోకి దిగి గాయాల పాలవుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తెగ వైరల్​ అవుతున్నాయి.

తదుపరి వ్యాసం