తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chikungunya Vaccine: చికన్ గున్యాను ఇక టీకాతో అడ్డుకోవచ్చు.. వ్యాక్సీన్ కు అమెరికా ఆమోదం

Chikungunya vaccine: చికన్ గున్యాను ఇక టీకాతో అడ్డుకోవచ్చు.. వ్యాక్సీన్ కు అమెరికా ఆమోదం

HT Telugu Desk HT Telugu

10 November 2023, 14:07 IST

  • Chikungunya vaccine: చికన్ గున్యాను నిరోధించే వ్యాక్సీన్ ను అమెరికా ఆమోదం తెలిపింది. చికన్ గున్యా లక్ష్యంగా రూపొందిన తొలి టీకా ఇది. ఈ టీకా వినియోగానికి అమెరికా ఎఫ్డీఏ (US FDA) ఓకే చెప్పింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Photo: iStockphoto)

ప్రతీకాత్మక చిత్రం

Chikungunya vaccine: చికన్ గున్యా దోమల ద్వారా వ్యాపించే ప్రమాదకర వ్యాధి. ఈ వ్యాధి తగ్గిన తరువాత కూడా కొన్నేళ్ల పాటు కీళ్ల నొప్పుల రూపంలో బాధిస్తుంది. ఈ వ్యాధిని ‘ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రమాదకర ఆరోగ్య సమస్య’ గా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (Food and Drug Administration FDA) సంస్థ నిర్ధారించింది.

18 ఏళ్లు పైబడిన వారికే..

చికన్ గున్యాను నిరోధించే ఈ టీకాను యూరోప్ కు చెందిన వల్నెవా (Valneva) అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సీన్ ను ఇక్స్ చిక్ (Ixchiq) పేరుతో మార్కెట్ చేయనున్నారు. చికన్ గున్యా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో 18 ఏళ్ల వయస్సు పైబడిన వ్యక్తులకు ఈ టీకాను ఇవ్వడానికి ఎఫ్ డీ ఏ అనుమతినిచ్చింది. ఈ టీకాలో పూర్తిగా బలహీనపర్చిన, జీవించి ఉన్న(live) చికన్ గున్యా వైరస్ (chikungunya virus) ఉంటుంది. సింగిల్ డోస్ ద్వారా ఈ వ్యాక్సీన్ ను ఇస్తారు.

క్లినికల్ ట్రయల్స్

ఈ టీకాకు ఇప్పటివరకు ఉత్తర అమెరికాలో మొత్తం 3,500 మందిపై రెండు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్ ద్వారా ఈ టీకా తీసుకున్న తరువాత తలననొప్పి, అలసట, స్వల్ప జరం, కీళ్ల నొప్పుల వంటి సాధారణ లక్షణాలు కనిపించాయి. కేవలం 1.6% మందిలో తీవ్ర లక్షణాలు కనిపించాయి. ఇద్దరిని మాత్రం ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది.

1952 నుంచి

మొదట ఈ చికన్ గున్యా వ్యాధిని టాంజానియాలో 1952 లో గుర్తించారు. ఆ తరువాత ఇది 110 దేశాలకు విస్తరించింది. ఈ వ్యాధి మహమ్మారిలా విస్తరించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఈ వ్యాధి సమస్యలు కొన్నేళ్ల పాటు వేధిస్తాయి. ఇప్పుడు రూపొందించిన ఈ టీకా 98.9% సక్సెస్ రేటును సాధించింది. ఈ వ్యాక్సిన్ కు అనుమతి కోరుతూ వల్నెవా (Valneva) సంస్థ యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(EMA) కి కూడా దరఖాస్తు చేసుకుంది.

తదుపరి వ్యాసం