తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jk Encounter: కశ్మీర్లో ఎన్ కౌంటర్; ఇద్దరు ఆర్మీ ఆఫీసర్స్, ఒక పోలీస్ అధికారి మృతి

JK encounter: కశ్మీర్లో ఎన్ కౌంటర్; ఇద్దరు ఆర్మీ ఆఫీసర్స్, ఒక పోలీస్ అధికారి మృతి

HT Telugu Desk HT Telugu

14 September 2023, 12:16 IST

  • JK encounter: జమ్మూకశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రత దళాల మధ్య బుధవారం రాత్రి నుంచి భారీ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఒక పోలీస్ అధికారి మృతి చెందారు.

ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా దళాలు
ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా దళాలు (Imran Nissar)

ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా దళాలు

JK encounter: జమ్మూకశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. కోకర్ నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారన్న విశ్వసనీయ సమాచారంతో, వారిని వెదుకుతూ బుధవారం రాత్రి ఆ ప్రాంతానికి వెళ్లిన భద్రతాదళాల సిబ్బందిపై ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కాల్పులు జరపడం ప్రారంభించారు.

ట్రెండింగ్ వార్తలు

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

Sushil Modi death : బీజేపీ సీనియర్​ నేత సుశీల్ కుమార్​​ మోదీ కన్నుమూత..

ముగ్గురు మృతి

ఈ ఎన్ కౌంటర్ లో ఆర్మీ కల్నల్, మేజర్, జమ్మూకశ్మీర్ పోలీసు దళానికి చెందిన ఒక అధికారి ప్రాణాలు కోల్పోయారు. గురువారం మధ్యాహ్నానికి కూడా ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. రాష్ట్రీయ రైఫిల్స్ 19 కు చెందిన కల్నల్ నాయకత్వంలో ఈ ఆపరేషన్ ప్రారంభమైందని, ముందుడి పోరాడుతున్న ఆ కల్నల్, మరో మేజర్ ఉగ్రవాదుల కాల్పులకు బలయ్యారని ఆర్మీ వెల్లడించింది.

రాజౌరిలో మరో ఎన్ కౌంటర్

రాజౌరి జిల్లాలో బుధవారం మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయుధాలను, పాకిస్తాన్ లో తయారైనట్లుగా ఉన్న ఔషధాలను, పేలుడు పదార్ధాలను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. రాజౌరి జిల్లాలోని నర్ల ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం తో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి వారి కదలికలను భద్రత సిబ్బంది గమనిస్తున్నారు. చివరకు సెప్టెంబర్ 12 రాత్రి వారున్న ప్రాంతంపై దాడి చేశారు. ఈ ఎన్ కౌంటర్ 13వ తేదీ ఉదయం వరకు కొనసాగింది. భద్రతాదళాల కాల్పుల్లో ఆ ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 63 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఒక జవాను మరణించారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఒక ఆర్మీ డాగ్ కూడా మృత్యువాత పడింది.

తదుపరి వ్యాసం