తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : ఆన్​లైన్​ గేమ్​ విషయంలో గొడవ.. స్నేహితుడిని చంపి, మృతదేహాన్ని తగలబెట్టి..!

Crime news : ఆన్​లైన్​ గేమ్​ విషయంలో గొడవ.. స్నేహితుడిని చంపి, మృతదేహాన్ని తగలబెట్టి..!

Sharath Chitturi HT Telugu

19 January 2024, 12:05 IST

    • Friends kill boy over online game : ఆన్​లైన్​ గేమింగ్​ వ్యవహారం మరో యువకుడి ప్రాణాలు తీసింది. పాస్​వర్డ్​ షేర్​ చేయడం లేదన్న కోపంతో.. 18ఏళ్ల యువకుడిని.. అతని 'క్లోజ్​' ఫ్రెండ్స్​ చంపేశారు. పశ్చిమ్​ బెంగాల్​లో జరిగింది ఈ ఘటన.
ఆన్​లైన్​ గేమ్​పై గొడవ.. స్నేహితుడిని చంపి, మృతదేహాన్ని తగలబెట్టి..!
ఆన్​లైన్​ గేమ్​పై గొడవ.. స్నేహితుడిని చంపి, మృతదేహాన్ని తగలబెట్టి..! (File photo for representation)

ఆన్​లైన్​ గేమ్​పై గొడవ.. స్నేహితుడిని చంపి, మృతదేహాన్ని తగలబెట్టి..!

Friends kill boy over online game : పశ్చిమ్​ బెంగాల్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్​లైమ్​ మొబైల్​ గేమ్​ పాస్​వర్డ్​ని షేర్​ చేయడం లేదన్న కోపంతో.. నలుగురు యువకులు.. తమ 'క్లోజ్​' ఫ్రెండ్​ని దారుణంగా చంపేశారు. అనంతరం అతడి మృతదేహానికి నిప్పంటించారు.

ట్రెండింగ్ వార్తలు

Weather update : ఇంకొన్ని రోజుల పాటు ఎండల నుంచి ఉపశమనం.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

UGC NET June 2024: యూజీసీ నెట్ కు దరఖాస్తు చేసుకునే గడువు మరో 5 రోజులు పొడిగింపు

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి!

Bengaluru: బెంగళూరులో రాత్రంతా భారీ వర్షం; విమానాశ్రయంలో లీకేజీ; పలు ఫ్లైట్స్ రద్దు

ఇదీ జరిగింది..

పశ్చిమ్​ బెంగాల్​లోని ముర్షిదాబాద్​ జిల్లాలో కొన్ని రోజుల క్రితం జరిగింది ఈ ఘటన. ఫరక్క అనే ప్రాంతంలో ఐదుగురు స్నేహితులు జీవిస్తున్నారు. వారు 10వ తరగతి చదువుకుంటున్నారు. కాగా.. వారందరు.. ఆన్​లైన్​ గేమ్స్​కి అడిక్ట్​ అయ్యారు. చదువుకోకుండా చాలా సమయాన్ని, గేమింగ్​ కోసం కేటాయించేవారు.

ఈ నేపథ్యంలో.. జనవరి 8న ఐదుగురు స్నేహితులు కలిసి.. ఫరక్కలోని నిషింద్ర ఘాట్​కు వెళ్లారు. అక్కడ ఆన్​లైన్​ గేమ్​ ఆడటం మొదలుపెట్టారు. కాగా.. 18ఏళ్ల పపాయి దాస్​ అనే యువకుడు.. గేమ్​ పాస్​వర్డ్​ షేర్​ చేయడానికి ఇష్టపడలేదు. నలుగురు ఎంత అడిగినా, అతను ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఐదుగురి మధ్య గొడవ మొదలైంది. అందరు కోపంగా మాట్లాడుకున్నారు. కొన్ని క్షణాల్లోనే.. నలుగురు కలిసి, పపాయి దాస్​ని దారుణంగా పొడిచి చంపేశారు. ఈ విషయం బయటకు రాకూడదని నిందితులు ఓ ప్లాన్​ వేశారు. తమ బైక్స్​లోని పెట్రోల్​ తీసి, మృతదేహానికి నిప్పంటించారు. సగం కాలిన మృతదేహాన్ని.. నిషింద్ర ఘాట్​ వద్ద పడేసి ఇళ్లకు పారిపోయారు.

Bengal crime news : జనవరి 8న రాత్రంత ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన పపాయి దాస్​ కుటుంబసభ్యులు.. మరుసటి రోజు పోలీస్​ స్టేషన్​కి వెళ్లాడు. పపాయి దాస్​ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని, పపాయి దాస్​ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే.. నిషింద్ర ఘాట్​ వద్ద.. సగం కాలిన మృతదేహాన్ని గుర్తించారు. ఆ విషయాన్ని పపాయి దాస్​ కుటుంబసభ్యులకు వెల్లడించారు. మృతదేహంపై ఉన్న టాటూల ఆధారంగా.. పపాయి దాస్​ మృతదేహాన్ని గుర్తించారు అతని కుటుంబసభ్యులు.

మరోవైపు.. పపాయి దాస్​ మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు.. పోలీసులు, తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో.. పపాయి దాస్​తో క్లోజ్​గా ఉండే నలుగురు స్నేహితుల గురించి తెలుసుకున్నారు. వారి ఫోన్​ సిగ్నల్​ సాయంతో.. పపాయి దాస్​ మరణించిన రోజు, ఆ నలుగురు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నారు. వారు కూడా నిషింద్ర ఘాట్​ వద్దే ఉన్నారని తెలుసుకున్న పోలీసులు.. యువకులను విచారణ కోసం పిలిపించారు. ఈ నేపథ్యంలో.. పపాయి దాస్​ను తామే చంపేసినట్టు పోలీసుల ఎదుట అంగీకరించారు నిందితులు.

Friends kill boy in Bengal : "ఆన్​లైన్​ మొబైల్​ గేమ్​ పాస్​వర్డ్​ నేపథ్యంలో గొడవ మొదలైందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గొడవ పెద్దదిగా మారింది. చివరికి.. నలుగురు కలిసి, ఒకరిని చంపేశారు," అని పోలీసులు వెల్లడించారు.

ఘటనపై మర్డర్​ కేసు నమోదు చేసుకున్నట్టు, నిందితులను అరెస్ట్​ చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా.. మృతుడు పపాయి దాస్​కు గేమ్స్​ వ్యవసంగా ఎక్కువగా ఉండేదని, ఆ అడిక్షన్​తోనే ప్రీ-బోర్డ్​ ఎగ్జామ్స్​ కూడా రాయలేదని, అతని తల్లి చెప్పినట్టు, పోలీసులు వివరించారు.

తదుపరి వ్యాసం