తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Tata Housing Q1 Results: టాటా హౌజింగ్ సేల్ బుకింగ్స్‌లో 5 రెట్ల పెరగుదల

Tata Housing Q1 Results: టాటా హౌజింగ్ సేల్ బుకింగ్స్‌లో 5 రెట్ల పెరగుదల

HT Telugu Desk HT Telugu

25 July 2022, 12:31 IST

  • Tata Housing Q1 revenue: టాటా హౌజింగ్ ఆదాయంలో భారీ పెరుగుదల నమోదైంది.

టాటా హౌజింగ్ చేపట్టిన ఓ ప్రాజెక్టులోని భాగం
టాటా హౌజింగ్ చేపట్టిన ఓ ప్రాజెక్టులోని భాగం (tata housing)

టాటా హౌజింగ్ చేపట్టిన ఓ ప్రాజెక్టులోని భాగం

న్యూఢిల్లీ, జూలై 25: టాటా హౌజింగ్ సేల్ బుకింగ్స్ 5 రెట్లు పెరిగి ఆదాయం రూ. 623 కోట్లకు చేరుకుందని జూన్‌తో ముగిసిన క్వార్టర్లీ రిజల్ట్స్ వెల్లడించాయి. కంపెనీ ప్రారంభించిన రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు పటిష్టమైన డిమాండ్ కారణంగా ఆదాయం పెరిగింది.

ట్రెండింగ్ వార్తలు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

టాటా సన్స్ ప్రయివేటు లిమిటెడ్ సబ్సిడరీగా ఉన్న టాటా హౌజింగ్ దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఒకటిగా ఉంది.

టాటా రియాల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సీఈవో అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ దత్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి అనంతరం ఇళ్లకు డిమాండ్ సాధారణ స్థాయికి చేరుకోవడంతో క్యూ1లో రూ. 623 కోట్ల మేర ఆదాయం పెరిగిందని వివరించారు.

గత ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా ఇళ్ల అమ్మకాలు పడిపోయి రియల్ ఎస్టేట్ డెవలపర్లు అందరిపై ప్రభావం పడింది.

అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో భారీ వృద్ధి కారణంగా ఇండియా, ఇంటర్నేషనల్ మార్కెట్లలో రెసిడెన్షియల్ సొల్యూషన్స్ కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడంకెల వృద్ధిని ఆయన అంచనా వేశారు.

‘ఇండస్ట్రీలో బలమైన పట్టుతో మార్కెట్ లీడర్‌గా ఎదిగే మార్గంలో ఉన్నాం. మా బ్రాండ్ విలువను ప్రభావితం చేయడానికి తగిన వనరులను సమీకరించకుంటున్నాం..’ అని దత్ పేర్కొన్నారు.

గురుగ్రామ్‌లోని లా విదా, కసౌలిలోని మిస్ట్, నోయిడాలోని యురేకా పార్క్, ముంబైలోని సెరీన్, బెంగళూరులోని న్యూ హెవెన్ వంటి ప్రాజెక్టులతో గృహ కొనుగోలుదారుల నుండి మంచి డిమాండ్‌ను చూసి దేశవ్యాప్తంగా పురోగతి సాధించినట్లు టాటా హౌసింగ్ తెలిపింది. ఈ ప్రాజెక్టులు వారి త్రైమాసిక లక్ష్యాలలో 100 శాతానికి పైగా సాధించాయి.

జూన్ త్రైమాసికంలో టాటా హౌసింగ్ మాల్దీవుల్లోని మాలేలో లక్సా వన్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించింది. పెద్ద స్థలాలు, సౌకర్యాల ఆధారిత రెసిడెన్షియల్ సొల్యూషన్స్ కోసం డిమాండ్ రావడంతో టాటా హౌసింగ్ వ్యూహాత్మకంగా ఉత్తర, ఈశాన్య, దక్షిణ మార్కెట్‌లను బలోపేతం చేస్తోంది.

‘2021-22 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ మొత్తం 1,688 యూనిట్లను విక్రయించింది. క్యూ1 ఎఫ్‌వై 23లో సాధించిన ఫలితం ట్రిపుల్ డిజిట్ వృద్ధిని సూచిస్తోంది’ అని కంపెనీ పేర్కొంది.

చీఫ్ సేల్స్, మార్కెటింగ్ ఆఫీసర్ సార్థక్ సేథ్ మాట్లాడుతూ ‘క్యూ1లో మా వ్యూహం ప్రాజెక్ట్ నిర్దిష్ట మార్కెటింగ్ ప్రచారాలతో హైపర్-లోకల్ విధానంపై దృష్టి పెట్టింది..’ అని తెలిపారు.

టాటా హౌసింగ్ డెవలప్‌మెంట్ కంపెనీ టాటా రియల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రింద ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉంది. ఇది టాటా సన్స్ యొక్క 100 శాతం అనుబంధ సంస్థ.

ఇది నిర్మాణం, ఇంజనీరింగ్, వాణిజ్య, ఐటి పార్కులు, హౌసింగ్, టౌన్‌షిప్ డెవలప్‌మెంట్‌లో మంచి సామర్థ్యాలతో దేశవ్యాప్తంగా, అలాగే విదేశాల్లోనూ ఉనికిని కలిగి ఉంది.

టాటా హౌసింగ్ భారతదేశం, శ్రీలంక, మాల్దీవులలోని ప్రధాన నగరాల్లో మొత్తం 51 మిలియన్ చదరపు అడుగుల అభివృద్ధి సామర్థ్యంతో గల 33 ప్రాజెక్టులను కలిగి ఉంది.

తదుపరి వ్యాసం