తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Constable Recruitment: కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 47.5 లక్షల దరఖాస్తులు; గతంలో కన్నా తక్కువేనట..

Constable recruitment: కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 47.5 లక్షల దరఖాస్తులు; గతంలో కన్నా తక్కువేనట..

HT Telugu Desk HT Telugu

20 January 2024, 21:03 IST

  • SSC's constable (GD) recruitment: కేంద్ర సాయుధ దళాల్లో కానిస్టేబుల్ పోస్ట్ ల భర్తీ కోసం నవంబర్ లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ పోస్ట్ ల కోసం ఏకంగా 45 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తాజాగా వెల్లడైంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

SSC's constable (GD) recruitment: సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ లో ఖాళీగా ఉన్న 26,146 పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ గత నవంబర్ లో ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ పోస్ట్ ల నియామకాల కోసం 2023 నవంబర్ 24 నుంచి డిసెంబర్ 31 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షను 2024 ఫిబ్రవరి 20 నుంచి మార్చి 12 వరకు నిర్వహించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

మొత్తం 26,146 పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) చేపట్టిన అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ లలో ఇది కూడా ఒకటి. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో కానిస్టేబుల్ (GD), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF)లో రైఫిల్మెన్ (GD), అస్సాం రైఫిల్స్ లో జవాన్లను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 26,146 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

45 లక్షలకు పైగా అప్లికేషన్లు..

ఎస్ఎస్సీ నిర్వహిస్తున్న ఈ రిక్రూట్మెంట్ కు దేశంలోని నిరుద్యోగుల నుంచి భారీ స్పందన లభించింది. మొత్తం 26,146 పోస్ట్ లకు గానూ, 47,45,501 అప్లికేషన్లు వచ్చాయి. సమాచార హక్కు చట్టం సహాయంతో ఒక వ్యక్తి చేసిన అభ్యర్థనకు గానూ ఎస్ఎస్సీ ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా ఎస్ఎస్సీ దరఖాస్తుదారులకు సంబంధించిన సమాచారాన్ని పంచుకుంది.

ఓబీసీ నుంచి ఎక్కువ..

ఎస్ఎస్సీ అందించిన సమాచారం ప్రకారం, రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అన్ రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన 6,45,177 మంది, ఓబీసీ కేటగిరీకి చెందిన 21,14,972 మంది, ఎస్సీ కేటగిరీకి చెందిన 11,00,424 మంది, ఎస్టీ కేటగిరీకి చెందిన 6,11,474 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన మరో 2,67,940 మంది అభ్యర్థులు ఉన్నారు.

రిక్రూట్మెంట్ వివరాలు..

ఈ రిక్రూట్మెంట్ ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సశస్త్ర సీమా బల్ (SSB), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF), అస్సాం రైఫిల్స్ (AR) లో రైఫిల్మెన్ (GD) పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిలో బీఎస్ఎఫ్ లో 6,174, సీఐఎస్ఎఫ్ లో 11,025, సీఆర్పీఎఫ్ లో 3,337, ఎస్ఎస్బీలో 635, ఐటీబీపీలో 3,189, ఎస్ఎస్బీ 296, ఏఆర్ లో 1,490 పోస్టులు ఉన్నాయి.

గతం కన్నా తక్కువే..

ఏడాది విరామం తర్వాత కానిస్టేబుల్ (GD) నియామక ప్రకటన వచ్చింది. చివరిసారిగా 2022లో ఈ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. అయితే, ఇప్పుడు పోస్టుల సంఖ్య తక్కువగా ఉండటంతో, గతంతో పోలిస్తే ఈసారి దరఖాస్తుదారుల సంఖ్య తగ్గింది. 2022లో 50,187 పోస్టులకు 54,15,938 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సారి 26,146 పోస్టులకు 47.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2021లో రికార్డు స్థాయిలో 71,74,580 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే 2021లో కేవలం 25,271 పోస్టులు మాత్రమే ఉన్నాయి.

తదుపరి వ్యాసం