తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dollar Vs Rupee : రికార్డుస్థాయి దిగువన రూపాయి.. 10 పైసలు పతనం

Dollar vs Rupee : రికార్డుస్థాయి దిగువన రూపాయి.. 10 పైసలు పతనం

HT Telugu Desk HT Telugu

09 June 2022, 10:11 IST

    • డాలరుతో పోల్చితే రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరుకుంది. గురువారం ఉదయం 77.78కు పడిపోయింది.
రికార్డు స్థాయి దిగువన రూపాయి విలువ
రికార్డు స్థాయి దిగువన రూపాయి విలువ (AFP)

రికార్డు స్థాయి దిగువన రూపాయి విలువ

డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ 77.78కు పడిపోయింది. గురువారం ఉదయం ట్రేడింగ్‌లో 10 పైసలు బలహీనపడింది.

ట్రెండింగ్ వార్తలు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

దేశీయ మార్కెట్లు ప్రతికూలంగా మారడం, అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుముఖం పట్టకపోవడం కారణంగా డాలరుతో పోల్చితే కొద్ది నెలలుగా రూపాయి విలువ క్రమంగా తగ్గుముఖం పడుతోంది.

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ మార్కెట్లలో షేర్లను విక్రయిస్తూ గత కొంతకాలంగా నికర అమ్మకందారులుగా నిలుస్తున్నారు. 

గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజీ వద్ద రూపాయి విలువ డాలరుతో పోల్చితే 77.74 వద్ద ఓపెనైంది. తదుపరి 77.78కి జారిపోయింది. మొత్తంగా నిన్నటి ముగింపుతో చూస్తే 10 పైసలు పతనమైంది.

బుధవారం రికార్డుస్థాయి దిగువ నుంచి కోలుకున్న రూపాయి తిరిగి గురువారం బలహీనపడింది.

క్రూడాయిల్ ధర బ్యారెల్‌క్ 125 డాలర్లకు చేరుకోవడంతో రూపాయి మరింత బలహీనపడిందని ఫిన్‌రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ హెడ్ ట్రెజరీ అనిల్ కుమార్ భన్సాలీ తెలిపారు.

‘ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తమ ఈక్విటీలను తెగనమ్ముతున్నారు. డాలరు విలువ పెరగడంతో వాటిని కొనుగోలు చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే రూపాయి బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నా.. మిగిలిన అంశాలన్నీ ప్రతిబంధకంగా ఉన్నాయి..’ అని వివరించారు.

పైగా ఏషియన్ కరెన్సీలన్నీ బలహీనంగానే ట్రేడవుతున్నాయని అన్నారు. డాలరు కు కొనుగోలుదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్నందున, ఆర్‌బీఐ మద్దతు చర్యలు రూపాయి‌పై సానుకూల ప్రభావం చూపలేకపోయాయని అన్నారు.

అంతర్జాతీయ చమురు బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.26 శాతం పెరిగి బ్యారెల్ 123.90కు చేరుకుంది.

దేశీయ మార్కెట్లలో గురువారం సెన్సెక్స్ 163.34 పాయింట్లు పడిపోయింి. నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయింది.

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు బుధవారం రూ. 2,484 కోట్ల విలువైన ఈక్విటీలు అమ్మేసి నికర కొనుగోలుదారులుగా నిలిచారు.

టాపిక్

తదుపరి వ్యాసం