తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rupee Falls: 81.47కు పడిపోయిన రూపాయి.. 82 దిశగా అడుగులు

Rupee falls: 81.47కు పడిపోయిన రూపాయి.. 82 దిశగా అడుగులు

HT Telugu Desk HT Telugu

26 September 2022, 9:38 IST

    • Rupee falls: రూపాయి విలువ డాలరుతో పోల్చితే 81.47కు పడిపోయింది.
డాలరుతో పోలిస్తే జీవిత కాలపు కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ
డాలరుతో పోలిస్తే జీవిత కాలపు కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ (MINT_PRINT)

డాలరుతో పోలిస్తే జీవిత కాలపు కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ

Rupee falls to all-time low: రూపాయి విలువ మరోసారి జీవిత కాలపు కనిష్టానికి పడిపోయింది. సోమవారం ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో డాలరుతో పోల్చితే రూపాయి విలువ 81.47కు పడిపోయింది. ఇది క్రమంగా 82కు పడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Patna crime news : స్కూల్​ డ్రైనేజ్​లో 4ఏళ్ల బాలుడి మృతదేహం.. నిరసనలతో తగలబడిన పాఠశాల!

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచడంతో ప్రపంచ మార్కెట్లన్నీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ సంస్థాగత మదుపరులు ఈక్విటీలను తెగనమ్ముతుండడంతో సెంటిమెంట్ దెబ్బతిని రూపాయి విలువ పడిపోతోంది. డాలర్ ఇండెక్స్‌ గరిష్టస్థాయికి చేరుకోవడంతో మదుపరుల దృష్టి డాలర్లపై పడింది.

రూపాయి విలువ శుక్రవారం రికార్డు కనిష్ట స్థాయి 81.2250కి పడిపోయింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ డాలర్లను విక్రయించడం రూపాయి విలువ మరింత నష్టపోకుండా ఉండడానికి దోహదపడింది.

ఏషియా ట్రేడింగ్‌లో డాలర్ ఇండెక్స్ 114.50 పైన పెరిగింది. బ్రిటీష్ పౌండ్ పతనం, సురక్షితమైన డాలరు వైపు పెట్టుబడిదారులు మళ్లడంతో డాలర్ ఇండెక్స్ పెరుగుతూ వస్తోంది.

రూపాయి విలువ పడిపోతుండడంతో దేశంపై ఎగుమతుల భారం మరింత పెరుగుతుంది. అమెరికా వెళ్లే విద్యార్థులపై మరింత భారం పడుతుంది.

తదుపరి వ్యాసం