తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Garlic Prices: ఆకాశాన్ని అంటిన వెల్లుల్లి ధర; కారణమేంటంటే..?

Garlic prices: ఆకాశాన్ని అంటిన వెల్లుల్లి ధర; కారణమేంటంటే..?

HT Telugu Desk HT Telugu

13 December 2023, 14:22 IST

  • Garlic prices: ఇటీవల కాలంలో వెల్లుల్లి ధర భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు ఉల్లిగడ్డ సామాన్యుల జేబులకు చిల్లు పెడితే, ఆ బాధ్యత ఇప్పుడు వెల్లుల్లి తీసుకుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

ప్రతీకాత్మక చిత్రం

Garlic prices: వంటగదిలో నిత్యావసరం వెల్లుల్లి (Garlic). దీని ధర దాదాపు రెట్టింపు అయింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వెల్లుల్లి ధరలు కిలో రూ. 400 కి చేరుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

Sushil Modi death : బీజేపీ సీనియర్​ నేత సుశీల్ కుమార్​​ మోదీ కన్నుమూత..

సప్లై తగ్గడంతో..

వెల్లుల్లి దిగుబడి ఈ సారి బాగా తగ్గింది. దాంతో మార్కెట్లలోకి వెల్లుల్లి (garlic) సరఫరా కూడా తగ్గిపోయింది. డిమాండ్ కు తగిన సప్లై లేకపోవడంతో, వెల్లుల్లి ధర పెరుగుతోంది. కొన్ని రోజుల వ్యవధిలోనే దీని ధర రెట్టింపు అయింది. రిటైల్ మార్కెట్లలో వెల్లుల్లి కిలో రూ 350 నుంచి రూ. 400 పలుకుతోంది. హోల్ సేల్ మార్కెట్లలో వెల్లుల్లి ధర కేజీకి రూ. 130 నుంచి రూ. 140 వరకు ఉంది. అదే విధంగా, అత్యంత నాణ్యమైన వెల్లుల్లి ధర హోల్ సేల్ మార్కెట్లో రూ. 250 వరకు ఉంది. డిసెంబర్ చివరి వరకు కూడా ధరలు పెరుగుతూనే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.

దిగుబడి సమస్య..

ప్రతికూల వాతావరణ సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా వెల్లుల్లి దిగుబడి తగ్గింది. అనూహ్య వర్షాలు చాలా చోట్ల పంటలను నష్టం చేశాయి. చాలా ప్రాంతాల్లో మిచౌంగ్ తుపాను కూడా వెల్లుల్లి పంటలను నష్టపరిచింది. దాంతో మార్కెట్లలోకి సప్లై తగ్గి, ధరలు పెరగడం ప్రారంభమైంది. అంతేకాకుండా, సాధారణంగా, ప్రతీ సంవత్సరం కూడా చలి కాలంలో వెల్లుల్లి ధరలు పెరుగుతుంటాయి. కొత్త పంట మార్కెట్లలోకి వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉల్లిగడ్డల ధరలు కూడా పెరుగుతుండడంతో, ఆ ధరలను నియంత్రించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది.

తదుపరి వ్యాసం