తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Narendra Modi: అట్టహాసంగా ఢిల్లీలో ప్రధాని మోదీ మెగా రోడ్‍షో.. కీలక సమావేశానికి ముందు..

PM Narendra Modi: అట్టహాసంగా ఢిల్లీలో ప్రధాని మోదీ మెగా రోడ్‍షో.. కీలక సమావేశానికి ముందు..

16 January 2023, 17:09 IST

    • Prime Minister Narendra Modi Roadshow in Delhi: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ మెగా రోడ్‍షో ఘనంగా జరిగింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం (BJP National Executive Meeting) లో పాల్గొనే ముందు ఆయన ఈ రోడ్‍షోలో పాల్గొన్నారు.
PM Narendra Modi: అట్టహాసంగా ఢిల్లీలో ప్రధాని మోదీ మెగా రోడ్‍షో
PM Narendra Modi: అట్టహాసంగా ఢిల్లీలో ప్రధాని మోదీ మెగా రోడ్‍షో (PTI)

PM Narendra Modi: అట్టహాసంగా ఢిల్లీలో ప్రధాని మోదీ మెగా రోడ్‍షో

Prime Minister Narendra Modi Roadshow in Delhi: దేశరాజధాని ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం (జనవరి 16) మెగా రోడ్‍షో నిర్వహించారు. రహదారి పొడవునా భారతీయ జనతా పార్టీ (BJP) నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మోదీకి మద్దతుగా నినాదాలు చేశారు. ఆయన కూడా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం (BJP National Executive Meeting) లో పాల్గొనే ముందు ఆయన ఈ రోడ్‍షోలో పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

సంగీతం, ప్రజల హర్షధ్వానాల మధ్య ఢిల్లీలోని పటేల్ చౌక్‍లో ప్రధాని మోదీ.. మెగా రోడ్‍షో మొదలైంది. ఎన్‍డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ (NDMC Convention Centre) వరకు కొనసాగింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఎన్‍డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లోనే మొదలైంది. నేడు, రేపు ఈ కీలక మీటింగ్ జరగనుంది.

మోదీకి నడ్డా స్వాగతం

PM Narendra Modi Roadshow in Delhi: రోడ్‍షో తర్వాత జాతీయ కార్యవర్గ సమావేశం వేదిక వద్దకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ముఖ్యనేతలు స్వాగతం పలికారు.

ఎన్నికల వ్యూహాల రచనకు..

BJP National Executive Meeting: ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ నేతలు ఈ జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నారు. బీజేపీ ముఖ్య నేతలు, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. 2024 లోక్‍సభ ఎన్నికలపైనా ఈ సమావేశంలో బీజేపీ కసరత్తులు చేయనుంది.

బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా మూడేళ్ల పదవీ కాలం ఈనెలలో ముగియనుంది. దీంతో మరోసారి ఆయనను ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా సభ్యులు ఎన్నుకోనున్నారు. 2024 వరకు నడ్డానే పార్టీ ప్రెసిడెంట్‍గా కొనసాగే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం