తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  అయోధ్య మీరా మాఝీకి ప్రధాని మోదీ లేఖ, బహుమతులు

అయోధ్య మీరా మాఝీకి ప్రధాని మోదీ లేఖ, బహుమతులు

HT Telugu Desk HT Telugu

04 January 2024, 9:31 IST

  • ఇటీవల అయోధ్య పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఉజ్వల పథకం లబ్ధిదారు మాఝీ నివాసంలో టీ తాగారు. ఈమెతో లబ్ధిదారుల సంఖ్య 10 కోట్లకు చేరుకున్న నేపథ్యంలో మోదీ ఆమె ఇంటికి వెళ్లారు.

ప్రధాని పంపిన బహుమతులు (Sourced)
ప్రధాని పంపిన బహుమతులు (Sourced)

ప్రధాని పంపిన బహుమతులు (Sourced)

ఇటీవల ఉజ్వల పథకం లబ్ధిదారుల సంఖ్య 10 కోట్లకు చేరుకుంది. అయోధ్యకు చెందిన నదీతీర సామాజిక వర్గానికి చెందిన మహిళ మీరా మాఝీతో కలిపి పథకం లబ్ధిదారుల సంఖ్య 10 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం లేఖ, బహుమతులు పంపారు.

ట్రెండింగ్ వార్తలు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

డిసెంబర్ 30న (శనివారం) అయోధ్య పర్యటన సందర్భంగా ఆమె ఇంటికి వెళ్లిన మోదీ మాఝీ ఇంట్లో టీ తాగారు. బహుమతుల్లో టీ సెట్, రంగులతో కూడిన డ్రాయింగ్ బుక్ తదితరాలు ఉన్నాయి. ప్రధాని పర్యటన ముగిసిన వెంటనే అధికారులు ఆమె ఇంటికి వెళ్లి రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించే ఆయుష్మాన్ కార్డును అందజేశారు.

ప్రధాని తన లేఖలో మాఝీ మరియు ఆమె కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తన పర్యటనలో ఆ కుటుంబంతో కలిసి టీ తాగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 'ఉజ్వల పథకం ద్వారా మీరు 10 కోట్లవ లబ్దిదారు కావడం సాధారణ విషయం కాదు. కోట్లాది మంది ప్రజల కలను సాకారం చేసే ప్రయత్నాలకు కొనసాగింపుగా నేను దీన్ని చూస్తున్నాను' అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం